Search
  • Follow NativePlanet
Share
» »కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూసి తరించండి

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూసి తరించండి

కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి.

By Venkatakarunasri

తమిళనాడు మాజీముఖ్యమంత్రి అన్నాడియంకె అధినేత జయలలితను ఒక ఆలయంలో విగ్రహప్రతిష్ట బలిగొన్నట్టు వార్తలు.

ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది.ఈ వివరాలను పరిశీలిస్తే కాంచీపురంలోని ఏకాంబరనాథర్ ఆలయం వుంది.

ఇది దేశంలోనే అత్యంత పురాతన ఆలయాలలోనే ఒకటి.

ఈ ఆలయంలో మూలవిరాట్ విగ్రహం 300 ఏళ్ళనాటిది.

కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉంది. జిల్లా రాజధాని కాంచీపురం పలార్ నది ఒడ్డున ఉంది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి. కంచి పట్టణంలో పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం అనే చారిత్రాత్మక రేవు పట్టణం పల్లవుల శిల్పకళా చాతుర్యానికి తార్కాణం.

జయ మృతికి ఆ ఆలయం కారణమా?

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

పురాతనమైన ఈ ఆలయంలోని మూల విరాట్ విగ్రహం మరియు వుత్సవవిగ్రహం 300 సంవత్సరాల క్రితం నాడు మట్టితో చేసినవి.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఈ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్న కారణంతో కొత్తవిగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయకమిటీ నిర్ణయించింది.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

చిన్నపాటి మరమ్మత్తులు చేస్తే సరిపోతుందని,శిల్పులు మూలవిరాట్టు మార్చటం వల్ల రాష్ట్రాధినేతకు ప్రాణ హాని కలగవచ్చునని పలువురు సూచించారు.

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

అయితే వీటిని పట్టించుకోని కమిటీ 5 వ తేదీన విగ్రహాన్ని ప్రతిష్టించింది.అదే రోజున జయ కన్ను మూసారు.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం.

PC:youtube

 కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు.

PC:youtube

 కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉంది.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తరువాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు.

PC:youtube

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం

అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు.

PC:youtube

ఇక్కడ దగ్గర చూడవలసిన ప్రదేశాలు

ఇక్కడ దగ్గర చూడవలసిన ప్రదేశాలు

మహాబలిపురం

ఆకర్షణలు కొండరాతి గుహలు, వెండి రంగు ఇసుక బీచ్, సరివి చెట్లు, ఇక్కడకల దేవాలయాలు అన్నీ ఈ చారిత్రక టవున్ లో అద్భుతాలుగా వుంటాయి. చారిత్రాత్మక పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు, స్మారకాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కృష్ణ మండపం, అయిదు రధాలు, వరాహ మండపం సముద్ర తీర టెంపుల్, వంటివి ఎన్నో కలవు. టవున్ నుండి 30 కి.మీ.ల దూరంలో చోళ మండల ఆర్టిస్ట్ విలేజ్ కలదు. ఇక్కడ మీరు అనేక పెయింటింగ్ లు కళా వస్తువులు, శిల్పాలు చూడవచ్చు.

వెల్లూర్ - ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు!

వెల్లూర్ - ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు!

వెల్లూర్, ప్రయాణీకులకు ప్రయాణ కేంద్రంగా కూడా గుర్తించబడింది. ఈ నగరాన్ని 'ఫోర్ట్ సిటీ ఆఫ్ తమిళనాడు' అని కూడా అంటారు. వెల్లూరు, గొప్ప సంస్కృతి మరియు వారసత్వము మరియు చిరకాలం నిలిచి ఉండే ద్రావిడ నాగరికత; అన్నీ కలగలిసిన ఒక అద్భుతమైన చరిత్ర కలిగి ఉన్నది.

కొవ్ లాంగ్ బీచ్

కొవ్ లాంగ్ బీచ్

కోవ్ లాంగ్ బీచ్, తమిళ్ నాడు కోస్తా తీరంలో ఒక మత్స్యకారుల గ్రామం. బీచ్ ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఇది చెన్నై కు సమీప ప్రదేశం కావటం వలన వారాంతపు సెలవులకు అనుకూలిస్తుంది. ఇక్కడ కల డచ్ కేజల్ ను ఒక రిసార్ట్ గా మార్చారు. ప్రతి సంవత్సరం ఎంతోమంది టూరిస్టులు వస్తారు. తాజ్ ఫిషర్ మాన్ కొవ్ గా చెప్పబడే ఈ ప్రదేశం విశ్రాంతిగా మీరు కొంత సమయం గడిపేందుకు బాగుంటుంది.

తిరువన్నమలై - ఆధునిక ఆదర్శధామం

తిరువన్నమలై - ఆధునిక ఆదర్శధామం

తిరువన్నమలై, ఒక ఆకర్షణీయంగా మరియు చూడముచ్చటగా ఉన్నఒక ఆధునిక ఆదర్శధామం గల పట్టణం. దేశంలోనే ఈ ప్రదేశంలో ప్రేమ మరియు సోదరప్రేమకు ఒక ఖచ్చితమైన ఉదాహరణగా ఉంటుంది.లేకపోతె మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. పర్యాటకులకు చాల ప్రసిద్ది చెందింది.

పాండిచేరి – వలస వైభవ౦ గల నగరం !

పాండిచేరి – వలస వైభవ౦ గల నగరం !

2006 నుండి అధికారికంగా పుదుచెర్రిగా పిలుస్తున్న పాండిచేరి, అదే పేరుతో ఉన్నకేంద్ర పాలిత ప్రాంత రాజధాని. ఈ నగరం, కేంద్ర పాలిత ప్రాంతం రెండు కూడా ఫ్రెంచి వలస సామ్రాజ్యం ఎంతో దోహద పడడం వలన వారసత్వంగా పొందిన ప్రత్యేకమైన సంస్కృతి, వారసత్వ సంపదను కల్గి ఉన్నాయి. పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతం భారత దేశంలోని మూడు రాష్ట్రాలలో వ్యాపించిన తీరప్రాంత రాష్ట్రాలతో ఏర్పడింది: యానాం (ఆంధ్రప్రదేశ్ లో), పాండిచేరి నగరం, కరైకల్ ( రెండూ తమిళనాడు తూర్పు తీర ప్రాంతంలోనివి), మహే (కేరళలోని పశ్చిమ కనుమలలో ఉంది).

ఎలా చేరాలి

ఎలా చేరాలి

మార్గం 1:

తిరుపతి, కర్నూలు, కడప మీదుగానైతే 12గంటలలో చేరవచ్చును. తిరుపతి శ్రీనివాసునికూడా ఈ మార్గంలో మీరు దర్శించుకొనవచ్చును.

మార్గం 2:

ఇందులో 13గంటలు పడుతుంది.

pc:google maps

వాయు మార్గం

వాయు మార్గం

హైదరాబాద్ నుండి నెల్లూరు మీదుగా చెన్నై విమానాశ్రయంలో దిగి అక్కడనుంచి కాంచీపురం చేరవచ్చును.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X