Search
  • Follow NativePlanet
Share
» » బెంగుళూరు నుండి సొండా - ప్రకృతి అందాలు !

బెంగుళూరు నుండి సొండా - ప్రకృతి అందాలు !

రొటీన్ తో విసుగెత్తారా ? ఒక్క లాంగ్ ట్రిప్ వేయండి. మీ బిజి షెడ్యూల్ నుండి కొద్ది రోజులు దూరంగా వుండండి. కర్ణాటక లోని మల్నాడ్ ప్రాంతానికి ట్రిప్ వేయండి. మల్నాడ్ ప్రాంత ప్రకృతి అందాలు, ప్రజల ఆచార, వ్యవహారాలూ పరిశీలించండి. ఈ మల్నాడ్ ట్రిప్ బెంగుళూరు లో మొదలై, సొండా తో ముగుస్తుంది. మీరు సొండా చేరి ఆనందించాల్సిన పని లేదు. మీ జర్నీ మొదట్లోనే ఈ ఆనందాలు మొదలవుతాయి. బెంగుళూరు నుండి సొండా 420 కి. మీ. ల దూరం. పుష్కలమైన అందాలు కల మలనాడు ప్రాంతం చూసి ఆనందించేందుకు ఇది సరైన మార్గం. ఈ ప్రయాణం జాతీయ రహదారి 4 పై మొదలవుతుంది. చిత్రదుర్గ ఫోర్ట్ వద్ద కొద్ది విశ్రాంతి పొందండి. అనేక రాజ వంశాలు పాలించిన ఈ కోట అందాలను ఆస్వాదించండి. రోడ్డుకు కొంచెం పక్కగా వెడితే, అక్కడే కల బనవాసి చారిత్రాత్మక టెంపుల్ కూడా చూడవచ్చు.

ఈ టెంపుల్ కాలగర్భంలో కలసి పోయి ఎవరూ గుర్తు పట్టలేనిది గా తయారైంది. ఆ ప్రాంతంలో తిరిగే అమాయక పశువులు, కొద్ది పాటి ఆసక్తికల విజిటర్లు తో బనవాసి తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక్కడ నుండి మరొక 44 కి. మీ. ల దూరం వెళితే, మీ ప్రధాన పర్యాటక ఆకర్షణ సొండా వచ్చేస్తుంది. స్వాది అని పిలువబడే ఈ ప్రదేశం శ్రీ వాదిరాజ మట్ వారు ఏర్పరిచిన వాటిలో ఒకటి. దీనిని ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్య స్థాపించారు.

కర్నాటక లోని శిరసి జిల్లాలో కల ఈ ప్రాంతం సొండా లో కనీసం 24 గంటలైనా వుండాలి. భుట్ట రాజరుకు ఇక్కడ జరిగే అర్దరాత్రి పూజలు, మిమ్మల్ని అలరిస్తాయి. ఉదయమే పెందలకడ సమయంలో ప్రశాంతమైన బృందావనంలో శ్రీ వాదిరాజస్వామి కీర్తనలు మీ అంతరాత్మను ఆనందింప చేస్తాయి.

వాదిరాజ మటానికి 5 కి. మీ. కల దూరంలో శాల్మాల నది ఒడ్డున శ్రీ వాదిరాజ స్వామీ అనేక సంవత్సరాలు ధ్యానం చేసిన తపోవనం కలదు. తపోవనం నుండి సహస్ర లింగానికి వెళ్ళండి. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. శలమాల నది ఒడ్డున సుమారు వేయి లింగాలను మీరు దర్శిస్తారు. సొండా నుండి వెనుకకు మరలి వచ్చేటపుడు, చారిత్రాత్మక మరికాంబ టెంపుల్ చూడండి. గతంలో ఇక్కడ అతి పెద్ద ఎద్దులను బలి ఇచ్చేవారు. ఇదే ప్రదేశంలో కల సత్తోది ఫాల్స్ చూసి మంత్ర ముగ్దులవండి. ఇది మీ ట్రిప్ మొత్తానికి విలువ చేకూరుస్తుంది.

సొండా సొగసులు, మనస్సు ఉరకలు !

ఎంతో ఎత్తునుండి పడే ఈ జలపాతాలు చివరకు కాళీ నదిలోకి ప్రవహిస్తాయి. చుట్టూ కల పచ్చదనం, ఒక స్వర్గాన్ని తలపిస్తుంది. సిద్దాపూర లో కల అఘనాషిని నది సుమారు 116 అడుగుల ఎత్తునుండి పడి మంచి దృశ్యాలను చూపుతుంది. తిరిగి వచ్చే ట్రిప్ లో మీరు ఎంతో ప్రసిద్ధి చెందిన జోగ్ ఫాల్స్ మిస్ కాకండి. దీని తర్వాత వచ్చేది సిగందూర్ అనే ఒక చిన్న గ్రామం ఇక్కడి జోగ్ ఫాల్స్ నీరు అనేక వంపులు తిరిగి చివరకు శరావతి బ్యాక్ వాటర్స్ లోకి చేరుతుంది. బెంగుళూరు కు వచ్చే మార్గంలో అఘోరేశ్వర టెంపుల్ ఇక్కేరి ప్రదేశం లో కలదు. హోయసలులు వైభవంగా నిర్మించిన ఈ శిల్ప సంపద చూడండి. చక్కని పని తనం కల ఈ శిల్పాలు, మీ అక్కడి ప్రశాంతత మీ ట్రిప్ సక్సెస్ అయ్యిందని చెవుల్లో గుస గుస లాడుతూ వున్నట్లు వుంటుంది. మీరు వెనక్కు తిరిగి వచ్చినా సరే, ఆ ప్రాంతంలో మరేదో చూడవలసినది వుందని మీ అనుభూతులు చెపుతూ వుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X