Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారతదేశంలో సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !

దక్షిణ భారతదేశంలో సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !

మీ ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా దానికి తోడు కాస్త ఉత్సాహాన్ని పెంపొందించే ప్రదేశాలు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి. అక్కడ ఆలయాలను దర్శిస్తే ఫ్రీ గా బీచ్ కూడా దర్శించినవారవుతారు.

By Mohammad

ఇప్పటి వరకు ఆలయాలను మతపరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా చూశాము. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని , బొట్టు పెట్టుకొని కాస్త కూర్చొని ఇళ్లకు తిరిగి వస్తుంటారు ఇది అందరూ చేసేదే అవునా ..! ఎప్పుడు అలాగే ఉంటే బోర్ కొట్టదా ? మరి ఏం చేయాలి ??

ఇది కూడా చదవండి : దక్షిణ భారతదేశంలోని 8 ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశాలు !

దక్షిణ భారతదేశంలో సముద్రపు ఒడ్డున గల అద్భుత ఆలయాలు !

మీ ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా దానికి తోడు కాస్త ఉత్సాహాన్ని పెంపొందించే ప్రదేశాలు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి. అక్కడ ఆలయాలను దర్శిస్తే ఫ్రీ గా బీచ్ కూడా దర్శించినవారవుతారు. ఆ మీరు ఊహించింది నిజమే ... ఇప్పుడు మీకు చెప్పబోతున్న ప్రదేశాలు బీచ్ ఒడ్డున ఉన్న ప్రముఖ ఆలయాలు గురించి. పర్యాటకులు ఇక్కడున్న ఆలయాలను దర్శించి పక్కనే ఉన్న బీచ్ లో విశ్రాంతి తీసుకోవచ్చు. బీచ్ లో కూర్చొని పొట్లాలలో పల్లీలు, బురుగులు, మురుకులు తింటూ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

మురుడేశ్వర్

మురుడేశ్వర్

మురుడేశ్వర్ ఎలా వెళ్ళాలి ?

మురుడేశ్వర్ వెళ్ళటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమానమార్గం

మురుడేశ్వర్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం మంగళూరు విమానాశ్రయం. ఇది 153 కి. మీ. దూరంలో ఉంటుంది. ఏర్ పోర్ట్ నుండి క్యాబ్ లేదా ప్రవేట్ ట్యాక్సీ లను ఆద్దెకు తీసుకొని మురుడేశ్వర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

మురుడేశ్వర్ లో రైల్వే స్టేషన్ ఉన్నది కానీ కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. సమీపాన ఉన్న ప్రధాన రైల్వే జంక్షన్ మంగళూరు స్టేషన్. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. ట్యాక్సీ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి మురుడేశ్వర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

మురుడేశ్వర్ కు సమీప నగరాల నుండి, పట్టణాల నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి. బెంగళూరు నుండి హోనావార్ కు నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. హోనావార్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర్ కు క్యాబ్ లేదా ట్యాక్సీ లలో చేరుకోవచ్చు.

చిత్ర కృప : Ning Sanz

శివుని విగ్రహం

శివుని విగ్రహం

మురుడేశ్వర్ లో శివుని విగ్రహం ప్రధాన ఆకర్షణ. చుట్టూ అరేబియా సముద్రం పక్కనే 123 అడుగుల ఎత్తులో భారీ శివుని విగ్రహం మరియు శివలింగాలతో కూడిన అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. సమీపంలోని రాజగోపురం 20 అంతస్తులు కలిగి ఉండి గ్రానైట్ రాయితో నిర్మించబడింది.

చిత్ర కృప : Sanjay Upadhyay

బీచ్

బీచ్

మురుడేశ్వర్ లో ఆలయాలు చూసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. బీచ్ లో పర్యాటకులు సేదతీరుతూ పొడవైన శివుని విగ్రహాన్ని చూసి ఆనందిస్తారు. యాత్రికులు నీటి సంబంధిత ఆటలు అంటే బోటింగ్, స్విమ్మింగ్ వంటివి చేయవచ్చు. సాయంత్రంవేళ బీచ్ లో కూర్చొని సూర్యాస్తమ ఘట్టాన్ని తిలకించవచ్చు.

చిత్ర కృప : Yogesa

మహాబలిపురం

మహాబలిపురం

చేరుకోవడం ఎలా ??

మహాబలిపురం చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి

విమాన మార్గం

మహాబలిపురానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారు 54 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలు అద్దెకు తీసుకొని మహాబలిపురం చేరుకోవచ్చు.

రైలు మార్గం

మహాబలిపురం లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ సమీపంలో చెంగల్పట్టూ రైల్వే స్టేషన్ కలదు. ఇది 29 కిలోమీటర్ల దూరంలో కలదు. ట్యాక్సీ లేదా బస్సుుల్లో ప్రయాణించి మహాబలిపురం చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

చెన్నై మరియు సమీప ఇతర పట్టణాల నుండి , నగరాల నుండి మహాబలిపురం కు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. చెన్నై నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సులు మహాబలిపురానికి నిత్యం తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Emmanuel DYAN

షోర్ టెంపుల్

షోర్ టెంపుల్

మహాబలిపురం లో చూడవలసినది సముద్ర ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం మహాబలిపురానికి స్మారకం లాంటిది. ఈ ఆలయం లో శివుడు, విష్ణువు మరియు దుర్గ అమ్మవారి విగ్రహాలు దర్శనం ఇస్తాయి. దీనితో పాటు పంచ రథాల నిర్మాణం మరియు టైగర్ గుహలు మొదలగునవి చూడవచ్చు.

చిత్ర కృప : Sankar

బీచ్

బీచ్

మహాబలిపురం లో షోర్ టెంపుల్ చూసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. ఈ బీచ్ లో సాయంత్రం పూట చల్లని గాలులను ఆస్వాదించవచ్చు. బీచ్ లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోనికి పోకపోవడం ఉత్తమం. ఇక్కడ గవ్వల తో చేసిన వస్తువులు కొనుక్కోవటం, మంచి రుచికరమైన సీ ఫుడ్ లను తినటం చేయవచ్చు.

చిత్ర కృప : Karthikeyan Chinnathamby

విజింజమ్

విజింజమ్

విజింజమ్ ఎలా చేరుకోవాలి ?

విజింజమ్ గ్రామం చేరుకోవాలంటే ముందుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం నగరానికి చేరుకోవాలి. ఇదే ఈ గ్రామానికి పెద్ద రవాణా వ్యవస్థ కలిగి ఉంది. కనుక ముందు తిరువనంతపురం ఎలా చేరుకోవాలో చూద్దాం ..!

విమాన మార్గం

తిరువనంతపురం నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే విజింజమ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరువనంతపురం లో రైల్వే స్టేషన్ కలదు. అక్కడి నుండి ట్యాక్సీ లేదా బస్సు లో ప్రయాణించి విజింజమ్ సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

విజింజమ్ చేరుకోవటానికి తిరువనంతపురం నుండి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కోవాలం నుండి కూడా బస్సులు విజింజమ్ తిరుగుతుంటాయి. కాబట్టి ఎటు చూసిన తిరువనంతపురం నుండి రోడ్డు మార్గం గుండా మాత్రమే విజింజమ్ చేరుకోవటానికి సౌకర్యాలు అధికంగా ఉన్నాయి.

చిత్ర కృప : Ramesh Chandran Sreevalsam

అజ్హిమలై శివ ఆలయం

అజ్హిమలై శివ ఆలయం

విజింజమ్ గ్రామంలోని ఒక కొండ మీద అజ్హిమలై శివ ఆలయం ఉన్నది. కొండ మీద ఉన్న ఈ శివాలయానికి శివరాత్రి మరియు పండుగ పర్వదినాల్లో భక్తులు అధికంగా వస్తుంటారు. అజ్హి అంటే సముద్రం అని, మలై అంటే కొండ అని అర్థం.

చిత్ర కృప : Vinayaraj

బీచ్

బీచ్

విజింజమ్ లో కొండ మీద ఉన్న శివుని ఆలయాన్ని చూసిన తర్వాత కింద ఉన్న బీచ్ తప్పక సందర్శించాలి. ఈ బీచ్ లోని ఇసుక తిన్నెల మీద కూర్చొని సాయంత్రం పూట సూర్యాస్తమాన్ని వీక్షించవచ్చు. నీటి క్రీడలకు ఈ బీచ్ అనువైనదే ..!

కుమారకోమ్ - కేరళ రాష్ట్ర వర్షపు విందు !

చిత్ర కృప : Dr Ajay Balachandran

గోకర్ణం

గోకర్ణం

గోకర్ణం ఎలా చేరుకోవాలి ?

గోకర్ణం చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

గోకర్ణం పట్టణానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం గోవా లోని అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పర్యాటకులు విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని గోకర్ణం చేరుకోవచ్చు.

రైలు మార్గం

గోకర్ణంకు ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు. అంకోలా రైల్వే స్టేషన్ 20 కి.మీ. దూరం ఉండి, సమీపంలో ఉంటుంది. ఈ రైలు స్టేషన్ నుండి స్ధానిక బస్ లేదా టాక్సీ లపై గోకర్ణం చేరవచ్చు.

రోడ్డు మార్గం

మార్గోవా, డబోలిం, బెంగళూరు మరియు మంగళూరు ల నుండి గోకర్ణం పట్టణానికి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. పర్యాటకులు ప్రతిరోజు నిర్వహించే టూరిస్ట్ బస్సుల ద్వారా కూడా గోకర్ణం పట్టణానికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : Weetybix

మహాబలేశ్వర్ ఆలయం

మహాబలేశ్వర్ ఆలయం

గోకర్ణం కర్ణాటకలో బీచ్ లకు మరియు ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. చాలావరకు ఆలయాలన్ని బీచ్ ఒడ్డునే ఉంటాయి. అందులో ప్రధానమైనది మహాబలేశ్వర్ ఆలయం. ఇక్కడి ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న శివుడు. అలాగే ఇక్కడ భద్రకాళి ఆలయం, మహా గణపతి ఆలయం చూడదగినవి.

చిత్ర కృప : Nvvchar

బీచ్

బీచ్

గోకర్ణం బీచ్ చుట్టుప్ర్రక్కల అంతా కనిపించేది అరేబియా సముద్రం, పడమటి కనుమలు మరియు ఆలయాలు. వాటర్ బోటింగ్, సన్ బాతింగ్ వంటివి ఇక్కడ చేయవచ్చు. ఎటువంటి కాలుష్యం, శబ్ధాలు లేని ప్రశాంతమైన వాతావరణాన్ని బీచ్ లో ఆస్వాదించవచ్చు. గోకర్ణం లో ఈ బీచ్ ఒక్కటే కాదు ఓం బీచ్, కుడ్లే బీచ్ మరియు హాఫ్ మూన్ బీచ్ వంటివి కూడా చూడదగినవే.

చిత్ర కృప : Manfred Sommer

తిరుచెందూర్

తిరుచెందూర్

తిరుచెందూర్ ఎలా చేరుకోవాలి ?

తిరుచెందూర్ చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

తిరుచెందూర్ కు సమీపాన ఉన్న విమానాశ్రయం తూటికోరిన్ విమానాశ్రయం. ఇది 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆలాగే మధురై విమానాశ్రయం మరియు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం (150 కి. మీ) లు కూడా తిరుచెందూర్ కు సమీపాన ఉన్నాయి. క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి వాహనాలను ఆద్దెకు తీసుకొని తిరుచెందూర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

తిరుచెందూర్ కు సమీపాన ఉన్న ప్రధాన రైల్వే జంక్షన్ తిరునల్వేలి రైల్వే జంక్షన్. ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉండి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలతో, పట్టణాలతో కలుపబడి ఉన్నది. స్థానిక బస్సుల్లో గాని ట్యాక్సీ లో గాని ప్రయాణించి తిరుచెందూర్ చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

చెన్నై, మధురై, తిరునల్వేలి, తిరువనంతపురం మరియు కన్యాకుమారి నగరాల నుండి తిరుచెందూర్ కు ప్రభుత్వ బస్సులు తరచూ అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Harishwar 7070

తిరుచెందూర్ మురుగన్ ఆలయం

తిరుచెందూర్ మురుగన్ ఆలయం

తిరుచెందూర్ మురుగన్ టెంపుల్, పట్టణం లోనే ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో మురుగన్ తో పాటు ఆయన భార్యలు వల్లి మరియు దేవసేన కొలువుదీరి ఉంటారు. ఆలయం ప్రవేశంలో తొమ్మిది అంతస్తుల గోపురం, ప్రాంగణంలో నీటి బుగ్గ కూడా ఉన్నది.

చిత్ర కృప : Rkrish67

బీచ్

బీచ్

మురుగన్ ఆలయానికి పక్కనే సముద్రం ఉన్నది. ఈ సముద్రం ఒడ్డున ప్రకృతిని ఆస్వాదిస్తూ సాయంత్రంపూట హాయిగా గడిపేయవచ్చు. తడిసిన ఇసుక తిన్నెల మీద నడుస్తూ, కాళ్లకు చిన్న చిన్న ఇసుక రాళ్లు తగులుతూ ఎంజాయ్ చేయవచ్చు. సముద్రంలో సూర్యాస్తమ సన్నివేశాలను కనులారా వీక్షించి ఆనందం పొందవచ్చు.

భువనేశ్వర్ - ప్రముఖ పర్యాటక ప్రదేశాలు !

చిత్ర కృప : C/N N/G

రామేశ్వరం

రామేశ్వరం

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?

రామేశ్వరం చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి

వాయు మార్గం

రామేశ్వరానికి 168 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం మధురై విమానాశ్రయం. ఇది చెన్నై ఆంతర్జాతీయ విమానాశ్రయానికి చక్కగా అనుసంధానించడం జరిగింది. విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను ఆద్దెకు తీసుకొని రామేశ్వరానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

రామేశ్వరంలో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, మధురై, కొచ్చి, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు బాగా అనుసంధానించబడి ఉన్నది.

రోడ్డు మార్గం

మధురై, కన్యాకుమారి, చెన్నై, ట్రిచి వంటి నగరాల నుండి రామేశ్వరానికి ప్రభుత్వ బస్సుల తో పాటుగా , ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్ర కృప : Syamantaksen92

రామనాథస్వామి ఆలయం

రామనాథస్వామి ఆలయం

రామేశ్వరం హిందువుల పుణ్య క్షేత్రం. ఇక్కడ చెప్పుకోవలసినది రామనాథస్వామి ఆలయం. ఈ ఆలయం దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. 12 వ శతాబ్ధంలో పాండ్య రాజులచే నిర్మించబడ్డ ఈ ఆలయంలో శిల్ప శైలి, కళలు అద్భుతంగా ఉంటాయి.

చిత్ర కృప : Jagadip Singh

బీచ్

బీచ్

రామనాథ స్వామి ఆలయానికి సమీపంలో అందమైన ఒక బీచ్ కూడా కలదు. పర్యాటకులు శని, ఆదివారాలలో ఈ బీచ్ ను సందర్శించడానికి వస్తుంటారు. వారికి ఇదొక పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది. ఈ బీచ్ అందాలను మరింత పెంచుతూ ఇక్కడ సరివి చెట్లు తోటలుంటాయి. స్విమ్మింగ్, బోటింగ్, సర్ఫింగ్ వంటి నీటి ఆటలు కలవు.

రామేశ్వరం - ఒక యాత్రా స్థలం !

చిత్ర కృప : Rohit.fnds1

కన్యాకుమారి

కన్యాకుమారి

కన్యాకుమారి ఎలా చేరుకోవాలి ??

కన్యాకుమారి కి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.


విమాన మార్గం

కన్యాకుమారి లో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ 93 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని కన్యాకుమారి చేరుకోవచ్చు.

రైలు మార్గం

కన్యాకుమారి లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం

చెన్నై, తిరువనంతపురం, మధురై, చెన్నై వంటి ప్రాంతాల నుండి కన్యాకుమారి కి చక్కటి రోడ్డు మార్గం కలదు. ఈ ప్రాంతాల నుండి నిత్యం ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు కన్యాకుమారి కి తిరుగుతుంటాయి.

చిత్ర కృప : Rakesh Kanyakumari

కుమారి అమ్మన్ ఆలయం

కుమారి అమ్మన్ ఆలయం

కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. ఈ దేవత పార్వతి అవతారం. ఈ టెంపుల్ ను పాండ్య రాజులు ఎనిమిదవ శతాబ్దం లో నిర్మించారు. కన్యాకుమారి టెంపుల్ లో నేటికి 18 వ శతాబ్దం నాటి ఒక పవిత్ర ప్రదేశం దేవత యొక్క పాద ముద్రలు చూడవచ్చు.

చిత్ర కృప : Anulal

బీచ్

బీచ్

ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి. సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు కనులారా చూడటానికి ఇక్కడి బీచ్ లన్నీ అనుకూలంగా ఉంటాయి. అల్లు అర్జున్ ఆర్య -1 సినిమా షూటింగ్ కొంత భాగం ఇక్కడే చిత్రీకరించారు.

ఇండియాలో ఆకర్షనీయ సూర్యోదయ, సూర్యాస్తమ ప్రదేశాలు !

చిత్ర కృప : Aleksandr Zykov

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X