అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

కన్యాకుమారి - ప్రతి పర్యాటకుని డ్రీమ్ డెస్టినేషన్ !

Written by:
Published: Friday, December 16, 2016, 10:00 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

భారత పర్యాటకానికి చివరి మజిలీ ....

త్రివేణి సంగమ స్థలం ....

వివేకానందుడు స్ఫూర్తి పొందిన ప్రదేశం ...

ఒకవైపు ప్రకృతి అందాలు ... మరోవైపు అద్భుత నిర్మాణాలు వీటన్నింటికి నెలవైన కన్యాకుమారి పర్యాటకంగానూ, విహార కేంద్రంగానూ విలసిల్లుతోంది.

గతం లో 'కేప్ కొమరిన్' గా ఖ్యాతి చెందిన కన్యాకుమారి తమిళనాడు లో దక్షిణ భాగంలో కలదు. ఈ పట్టణం ఇండియా దిశలో ఉన్న చిట్టచివరి ప్రదేశం. కన్యాకుమారి ప్రాంతం లో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం రెండూ కలుస్తాయి. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఇక్కడకు 90 కి. మీ. ల దూరం లో కలదు. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది.

భారతదేశంలోని అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు !

సృజనాత్మక మైండ్ లేని వారు ఈ టవున్ యొక్క కళలను మరియు సంస్కృతి ని ఆనందించలేరు. అయితే, కన్యాకుమారి లో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు . ఇవి యాత్రికులను, పర్యాటకులను బా గా ఆకర్షిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు గా ఉన్నాయి.

చితరాల్ హిల్ టెంపుల్

ఇది సిటీ కి 45 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడ కల హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు ప్రసిద్ధి. వీటిలో తీర్థంకరుల విగ్రహాలు కలవు. కొండపై కి చేరాలంటే సుమారు అర్ధ గంట కాలినడకన పైకి ఎక్కాలి. సుబ్రమణ్య టెంపుల్, నాగరాజ టెంపుల్, తిరునందికరాయి కేవ్ టెంపుల్ లు చూడదగ్గవి.

చిత్రకృప : Karthi.dr

గాంధి మ్యూజియం

గాంధీ మెమోరియల్ ను 1956 లో నిర్మించారు. ఈ మండపా నిర్మాణం ఒరిస్సా టెంపుల్స్ నిర్మాణం పోలి వుంటుంది. ఈ మండపా నిర్మాణం లో ఏటా అక్టోబర్ 2 న మిట్ట మధ్యాహ్నవేళ సూర్యుడి కిరణాలు ఆయన అస్థికలు నిమజ్జనం చేసే ముండు ఉంచిన ప్రదేశంలో పడేలా నిర్మించారు. ఇక్కడే ఒక లైబ్రరీ కూడా కలదు.

చిత్రకృప : Johan Bichel Lindegaard

త్రివేణి సంగమ క్షేత్రం

కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. పౌర్ణమి నాడు నిండు చంద్రుని వెన్నెల కాంతులలో బీచ్ వద్ద కాసేపు గడపడం పర్యాటకుల స్వప్నం.

చిత్రకృప : Aveek Mukherjee

పుష్పాలు & వలస పక్షులు

ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Praveen Desai

వివేకానంద రాక్‌

వివేకానంద రాక్‌ వద్ద 1892 లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఈ వివేకానందుడి రాక్‌ కు కొంత దూరంలో పార్వతిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూపంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

చిత్రకృప : Himadri Karmakar

తిరువళ్లువర్‌ విగ్రహం

వివేకానంద రాక్‌ కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుందిఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా, చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్తుంటారు. ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఇది ఒకటి.

చిత్రకృప : V.Sathyamurthy

కన్యాకుమారి టెంపుల్

కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. ఈ దేవత పార్వతి అవతారం. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. సంవత్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

చిత్రకృప : Parvathisri

ఇందిరా పాయింట్‌

కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

చిత్రకృప : Irshadpp

వత్తకోట్టాయి ఫోర్ట్

వట్ట కొట్టాయి ఫోర్ట్ కన్యాకుమారి సిటీ కి ఈశాన్యంగా సుమారు 6 కి.మీ. ల దూరం లో కలదు. ఈ కోట ను 18 వ శతాబ్దం నాటిది. కోట గోడలు సుమారు 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటాయి. ఇది ఒక రాతి కోట. దీనిలో రెస్ట్ రూములు, వాచ్ టవర్లు, ఆయుధ గదులు కలవు. కోట గోడలు లోపలి భాగం లో పాండ్య రాజుల చిహ్నాలు కొన్ని కలిగి వుంటాయి.

చిత్రకృప : Dileeshvar

వవాతురాయి

కన్యాకుమారి లోని వవతురాయి గ్రామం అక్కడ కల సెయింట్ ఆరోకియా నతార్ చర్చి కి ప్రసిద్ధి. ఈ చర్చి కన్యాకుమారి సిటీ యొక్క తీరం లో వున్నది. వవతురాయి చర్చి సైట్ ఆరోకియా నతార్ కు అంకితం చేయబడినది. ఆరోక్య నతార్ అంటే ప్రజలను ఎల్లపుడూ అనారోగ్యాలనుంది రక్షించి ఆరోగ్యం ఇచ్చేవాడు అని అర్ధం.

చిత్రకృప : Mapantony

బీచ్ లు

తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు. ఈ బీచ్ లలో సంగుతురాయి బీచ్, తేన్గాపట్టినం బీచ్ మరియు సొత విలి బీచ్ లు ప్రసిద్ధి.

చిత్రకృప : Evonne

రొయ్యలకూ ప్రసిద్ధి

కన్యాకుమారి సి ఫుడ్ ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌' అని పిలిచే రొయ్యలకు ప్రసిద్ధి. అధిక మసాలా, కొబ్బరి వంటివి ప్రతి ఆహారం లోను కలిగి వుంటాయి. టవున్ లోని చాలా రెస్టారెంట్ లు సౌత్ ఇండియన్ డిష్ లు వడ, ఇడ్లి, దోస మరియు ఊతప్పం వంటివి అందిస్తారు. కన్యాకుమారి లో చైనీస్, రాజస్థాని, గుజరాతి ఆహారాలను అందించే రెస్టారెంట్లు కూడా కలవు.

చిత్రకృప : Gakmo

షాపింగ్

కన్యాకుమారి లో షాపింగ్ ఎల్లపుడూ షాపింగ్ చేసే వారికి కన్యాకుమారి సరైన ప్రదేశం కాదు. అయితే కొట్టి పాటి గుర్తు కొరకు ప్రియమైన వారికి ఇవ్వగల కొన్ని వస్తువులు తప్పక దొరుకుతాయి. సముద్రపు ఆలిచిప్ప వంటివి, శంఖాలు మరియు చిన్న మెమెంటోలు దొరుకుతాయి. హస్త కళల వస్తువులు ఇక్కడ స్థానికులచే చేయబడినవి దొరుకుతాయి.

చిత్రకృప : cotaro70s

వసతి

కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

చిత్రకృప : Varun Bhuvanendran

ఇలా వెళ్లాలి

విమాన మార్గం : త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం (90 KM), మదురై విమానాశ్రయం (212 KM) లు కన్యాకుమారి చేరువలో ఉన్నాయి.

రైలు మార్గం : దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి కన్యాకుమారి రైల్వే స్టేషన్ కనెక్ట్ చేయబడింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుండి నేరుగా రైలు ఎక్కి కన్యాకుమారి వెళ్ళవచ్చు.

బస్సు మార్గం : త్రివేండ్రం, మదురై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు కన్యాకుమారి బయలుదేరి వెళుతుంటాయి.

చిత్రకృప : Pranchiyettan

English summary

Kanyakumari - A Dream Destionation for Traveller

Kanyakumari is a coastal town of Tamil Nadu state, India. This Town is the southernmost point of India. Temples, beaches are main attractions of this town.
Please Wait while comments are loading...