Search
  • Follow NativePlanet
Share
» »బాహుబలి చిత్రాన్ని నేరుగా చూడాలనుకుంటున్నారా? ఇది చదవండి.

బాహుబలి చిత్రాన్ని నేరుగా చూడాలనుకుంటున్నారా? ఇది చదవండి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీలలో ఒకటి రామోజీ ఫిల్మ్ సిటి. హైదరాబాదుకు 25 కిలోమీటర్ల దూరములో ఉంది. 1996లో రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావుచే స్థాపించబడిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశంగా ఆకట్టుకుంటుంది.

By Venkata Karunasri Nalluru

పిల్లలకు వేసవిసెలవులు వచ్చేస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటి చూస్తే బాగుణ్ణు అని అనిపిస్తుంది కదూ! అందుకే మీకోసం అందిస్తున్నాం రామోజీ ఫిల్మ్ సిటి గైడ్.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీలలో ఒకటి రామోజీ ఫిల్మ్ సిటి. ఈ ఫిల్మ్ సిటి మొత్తం 2000 ఎకరాలు విస్తరించి వుంటుంది. హైదరాబాదుకు 25 కిలోమీటర్ల దూరములో ఉంది. 1996లో రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావుచే స్థాపించబడిన ఈ ఫిలింసిటి పర్యాటక ప్రదేశంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మిస్తున్నారు.

బస్సు సౌకర్యం: హైద్రాబాదు నుండి బస్సులో రామోజీ ఫిల్మ్ సిటికి వెళ్ళవచ్చును. దీనిలో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా చిత్రీకరణకు అవసరమైన రకరకాల సెట్టింగ్స్ ఉన్నాయి. సందర్శకులకు ఆనందాన్ని కల్గించటానికి ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు రోజూ వుంటాయి.

రామోజీ ఫిల్మ్ సిటీ

1. ఫిల్మ్ సిటీకి ఎలా చేరుకోవాలి

1. ఫిల్మ్ సిటీకి ఎలా చేరుకోవాలి

హైదరాబాద్ నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బస్సుల ద్వారా చేరుకోవచ్చును.

pc: Rameshng

2. గైడు

2. గైడు

ఈ బస్సుల ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకునే సమయంలో వారు ఏర్పాటు చేసిన గైడు తరువాత సందర్శకులకు ఏమి చేయాలి, ఎక్కడ నిలవాలి, అన్నసూచనలను అందచేస్తాడు. ఈ బస్సులు సందర్శకులను రామోజీ ఫిల్మ్ సిటీ ముఖద్వారం వరకు తీసుకు వెళ్ళి నిలుపుతాయి. ఆ తరువాత సందర్శకులు అక్కడ టిక్కట్టు కొనవచ్చు. టిక్కట్లు కొన్ని ప్యాకేజీలతో, మరికొన్ని ఒక్క రోజు మాత్రమే చూడడానికి అనుమతిచ్చేవి లభ్యమౌతాయి.

pc:Joydeep

3. రామోజీ ఫిల్మ్ సిటీ చూడటానికి టిక్కట్టు

3. రామోజీ ఫిల్మ్ సిటీ చూడటానికి టిక్కట్టు

సందర్శకులు టిక్కట్టు కొన్న తరువాత వారిని అవే బస్సులు అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి తీసుకు వెళ్ళి వదులుతాయి. సందర్శకులు తిరిగి వచ్చే వరకు ఆ బస్సులు అక్కడే ఉండి సందర్శకులను తిరిగి వారు బయలుదేరిన ప్రదేశాలకు చేరుస్తాయి. ఇతర వాహనాల మీద వచ్చే సందర్శకులు టిక్కట్టు ఇచ్చే ప్రదేశంలో ఆగవలసిఉంటుంది.

pc:Rameshng

4. ఫిల్మ్ సిటీ లోపలకు ఎటువంటి వస్తువులు తీసుకువెళ్ళాలి

4. ఫిల్మ్ సిటీ లోపలకు ఎటువంటి వస్తువులు తీసుకువెళ్ళాలి

రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకు ఎటువంటి ఆహారం తీసుకువెళ్ళకూడదు. సందర్శకులు వారికి కావలసిన ఆహార పానీయాలను ఫిల్మ్ సిటీ లోపలే కొనుక్కోవాలి. సందర్శకులు కెమేరా, సెల్‌ఫోన్ వంటి వస్తువులు రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకు తీసుకువెళ్లవచ్చును. ప్రవేశించే ముందు తనిఖీలను నిర్వహిస్తారు. చేతి సంచి, హ్యాండ్ బ్యాగులను మాత్రమే వెంట తీసుకుని వెళ్ళవచ్చు.

pc:Vinayaraj

5. లగేజు సదుపాయం

5. లగేజు సదుపాయం

సందర్శకులు తమ సామానులను వెలుపలి వాహన నిలయము వద్ద భద్రపరచుకుని తిరిగి వెలుపలకు రాగానే తీసుకువెళ్ళవచ్చును. గైడ్ ఇందుకు తగిన సహాయ సహకారాలను అందిస్తాడు.

pc:Iisr006

6. రామోజీ ఫిల్మ్ సిటీలో చూడదగినవి

6. రామోజీ ఫిల్మ్ సిటీలో చూడదగినవి

రామోజీ ఫిల్మ్ సిటీ లోపల తిరిగే బస్సులలో స్టూడియో టూరుకు వెళ్ళవచ్చు. బస్సులు ఎక్కేటప్పుడు సందర్శకులు క్యూ పాటించాలి. బస్సులోపల కూడా గైడు అక్కడ విశేషాలను సందర్శకులకు వివరిస్తూ ఉంటాడు.

pc:Vinayaraj

7.రాజమహల్ సెట్‌

7.రాజమహల్ సెట్‌

సందర్శకులను ఒక్క ప్రదేశంలో మాత్రమే ఆపి అక్కడ కొన్ని నిముషాల సమయం ఆకర్షణీయమైన రాజమహల్ సెట్‌లను చూసే అవకాశం కల్పిస్తారు. సమయంలో సందర్శకులు బస్సు నంబరు గుర్తించి తాము ఎక్కిన బస్సులోనే తిరిగి ఎక్కవలసి ఉంటుంది. తీసుకు వెళ్ళి హవా మహల్ అనే ప్రదేశంలో విడిచి పెడతారు. ఈ బస్సులు సందర్శకులను మరి కొంత దూరం తీసుకు వెళ్ళి హవా మహల్ వద్ద విడి పెడతాయి. అక్కడ సందర్శకులు అక్కడ ఉన్న రెస్టారెంటలలో చిరుతిండి,పానీయాలు, మినరల్ వాటర్ వంటివి కొనుక్కునే ఏర్పాట్లు ఉన్నాయి. సందర్శకులు అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని అక్కడ ఉన్న హవా మహల్ చూసి దిగువకు దిగి వేరొక బస్సులో ఎక్కి వేరొక ప్రదేశానికి చేరవచ్చు.

pc:Rameshng

8. ఎల్లోరా గుహల సెట్టింగులు

8. ఎల్లోరా గుహల సెట్టింగులు

సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులకు చేరుకోవచ్చు. ఎల్లోరా గుహలు చూసిన తర్వాత అక్కడ ఉన్న బస్ స్టాండ్ కు చేరుకుని అక్కడ ఉన్న బస్సు ఎక్కి ఫిల్మీ మ్యాజిక్ ఉన్న ప్రదేశానికి చేరవచ్చును. ఈ బస్సులకు ప్రత్యేక రుసుము ఏమీ చెల్లించనవసరం లేదు. ఫిల్మీ మ్యాజిక్ చేరుకునే సమయానికి దాదాపు భోజన సమయం అవుతుంది. ఫిల్మీ మ్యాజిక్ వద్ద ఖరీదైన ఇంటర్ నేషనల్ రెస్టారెంట్లలో ఆహారం తిని కొంత విశ్రాంతి తీసుకున్న సందర్శకులు ఫిల్మీ మ్యాజిక్ వద్ద నిర్వహిస్తున్న షోలను సందర్శించవచ్చును.

pc:Pratish Khedekar

9. ఫిల్మీ మ్యాజిక్

9. ఫిల్మీ మ్యాజిక్

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శనలన్నీ ఫిల్మీ మ్యాజిక్ వద్దే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు విశ్రాంతి తీసుకొనే ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇక్కడ ఎన్నో బహిరంగ నృత్య ప్రదర్శనలు చూసి ఆనందించవచ్చును.

pc: McKay Savage

10. రామోజీ ఫిల్మ్ సిటీ షోలు

10. రామోజీ ఫిల్మ్ సిటీ షోలు

రియల్ స్టంట్, స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి షోలను క్యూలో వెళ్ళి చూడవచ్చు. రియల్ స్టంటు కళాకారులు కృత్రిమ స్టంట్ ప్రదర్శనను ఇస్తూంటారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. దృశ్యచిత్రీకరణ ప్రదర్శనలో ముందుగా సందర్శకులను ఒక చిన్న హాలులో గుమి కూడేలా చేస్తారు. అక్కడ సందర్శకులలో నుండి ఒక జంటను పిలిచి వారిని హీరో హీరోయిన్లగా ప్రకటిస్తారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను కొన్ని ద్వారాలను తెరిచి వాటి ద్వారా వేరొక ప్రదర్శనశాలకు తీసుకు వెడతారు.

pc:Joydeep

11.ఔట్ డోర్ దృశ్యాలు

11.ఔట్ డోర్ దృశ్యాలు

ఔట్ డోర్ దృశ్యాలను చిత్రీకరించడానికి కొన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి. జరగబోయే కార్యక్రమాలను నిర్వాహకులు సందర్శకులకు వివరించి ముందుగా ఎన్నుకున్న జంట చేత ఒక లఘు దృశ్యంలో నటింపచేస్తారు. ఆదృశ్యాలను తెర మీద చూపుతారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను వేరొక ప్రదర్శనశాలకు తీసుకు వెడతారు. అక్కడ ముందుగా చిత్రించిన దృశ్యాలకు డబ్బింగ్ జత చేస్తారు. డబ్బింగ్ సహాయం ప్రేక్షకుల నుండి ఉత్సాహవంతులైన వారిని తీసుకుని చేస్తారు. తరువాత ఆదృశ్యాలను ప్రేక్షకులకు చూపి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ప్రేక్షకులకు చిత్రీకరించిన దృశ్యానికి వేరొక చోట చిత్రీకరించిన ఔట్ డోర్ దృశ్యాలను మరి కొన్నింటిని అవసరమైన మేరకు జత చేర్చి చూపుతారు. ఇలా సందర్శకులకు చిత్రీకరణ రహస్యాలను ప్రత్యక్షంగా చూపడమే కాక వాటిలో ఉన్న శ్రమను కొంత హాశ్యాన్ని జత చేసి అవగాహన కలుగచేస్తారు. ఇంతటితో ఈ ప్రదర్శన పూర్తి అయినట్లే.

pc:Rameshng

12. రామోజీ టవర్స్ భవనం

12. రామోజీ టవర్స్ భవనం

సందర్శకులు రామోజీ టవర్స్ భవనంలో నిర్వహించే ప్రదర్శన కొరకు సందర్శకులు క్యూలో నిలిచి వచ్చి చేరుకుంటారు. అక్కడ నుండి సందర్శకులను చిన్న ట్రాలీ వంటి వాహనాలలో ఎక్కించి తరువాత సీటు నుండి కదలకుండా ఏర్పాటు చేసి రైడ్‌కు తీసుకు వెడతారు. సందర్శకులు ట్రాలీలో కూర్చుని ప్రయాణం చేస్తూ ఇరువైపులా బొమ్మల కదలికతో ఏర్పాటు చేసిన చక్కని దృశ్యాలను చూడవచ్చు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన మందమైన కాంతిలో కదిలే బొమ్మలు వివిధ దృశ్యాల రూపంలో సందర్శకులను ఆకర్షిస్తాయి.

pc:Rameshng

13. భూకంపం దృశ్యాన్ని ప్రదర్శించే షో

13. భూకంపం దృశ్యాన్ని ప్రదర్శించే షో

భూకంపం దృశ్యాన్ని ప్రదర్శించే షో కొరకు సందర్శకులు వేరొక క్యూలో నిలిచి చేరుకుంటారు. మినీ థియేటర్ లాగా ఉండే ఈ ప్రదర్శనశాలలో సందర్శకులు చేరగానే వారిని ఆశీనులను చేసి స్పెషల్ ఎఫెక్ట్ సాయంతో ప్రేక్షకులను ఎత్తుకు తీసుకు వెళ్ళిన అనుభూతిని ఉన్న చోటు నుండే కలిగిస్తారు.

pc:Pratish Khedekar

14. వర్షం కురిసే అనుభూతి

14. వర్షం కురిసే అనుభూతి

రామోజీ ఫిల్మ్ సిటీ అంతా పై నుండి విహంగ వీక్షణంలా చూస్తున్న సమయంలో ఉన్నట్లుండి అతి చక్కటి నైపుణ్యంతో ప్రేక్షకులను వర్షం కురిసే అనుభూతికిలోను చేస్తారు. ఆ దృశ్యంలో ప్రేక్షకుల మీద నిజంగా నీటిని చల్లే ఏర్పాటు చేసి దృశ్యంలో ప్రేక్షకులను ఒక భాగమైన అనుభూతిని కలుగచేస్తారు.

pc:Samruddhi patel

15. భూకంపం వచ్చినట్లు అనుభూతి

15. భూకంపం వచ్చినట్లు అనుభూతి

చివరగా భూకంపం వచ్చినట్లు నిర్మాణాలు కూలిపోయినట్లు దృశ్యాలు చూడవచ్చు. ఈ మొత్తం సన్నివేశంలో ప్రేక్షకులను ఒక భాగంయినట్లు అనుభూతిని కలిగించడం ఈ ప్రదర్శనలో ప్రత్యేకత. ఈ ప్రదర్శన చూసి బయటకు వచ్చే దారిలో సందర్శకులు తమకు కావలసిన వస్తువులను కొనుక్కునే షాపింగ్ మాలుకు చేరుకుంటారు.

pc:Rameshng

16. షాపింగ్ మాలు

16. షాపింగ్ మాలు

అక్కడ కావలసిన వారు ఫిల్మ్ సిటీ సందర్శన జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

pc:Vinayaraj

17.చిత్రీకరణకు ఉపయోగపడే లొకేషన్స్

17.చిత్రీకరణకు ఉపయోగపడే లొకేషన్స్

ఎయిర్ పోర్ట్, ఆశ్రమం, అవెన్యూ ఆఫ్ పిల్లర్స్, కోర్ట్, డబుల్ టేక్ హౌస్, గోవా హౌస్, హవా మహల్, హిల్ టాప్ కాటేజ్, హాస్పిటల్, జైల్, ఎమ్-సిటీ, నార్త్ సిటీ, రైల్వే స్టేషను, రిలీజియస్ ప్లేస్, స్మాల్ టౌన్, విలేజ్.

pc:Rameshng

18. గార్డెన్లు, ఫౌంటెన్లు

18. గార్డెన్లు, ఫౌంటెన్లు

అల్ఫ విస్ట, ఆనంద, ఏంజిల్ ఫౌంటేన్, ఆర్బర్, ఆస్కారి, బలేరినా, బ్యూటీ ఎక్స్‌ప్రెస్స్, బేటా విస్టా, బ్లేజ్, కాస్కేడ్, కేవ్స్, చరిష్మా, కోంబో, కొమెట్, కాన్ఫరెన్స్, డామ్‌సెల్స్, దెవియా, డ్రీమ్ లాండ్, డ్రీమ్ వెల్లి, ఈస్ట్ పాయింట్, ఫ్లాష్ బ్యాక్, ఫ్లొర, ఫ్లైయింగ్ కిస్, గ్లాడియేటర్, గుడ్‌మార్నింగ్, గులాబ్, హవాయ్, జపనాహ్, మెజెస్టిక్, మెరినా, మేజ్, మెర్రీ గో రౌండు, మీడోస్, మాన్సియర్, పేషన్, రోటండా, సాంక్‌చ్యురీ, సయోనారా, స్కించి, సియేర, స్ప్రిండేల్, సన్ బ్రెల్లా, సన్ ఫౌంటెన్, టు టెంపోల్, ట్వింకిల్, ట్విస్టర్, అంబ్రెల్లా.

pc:Bhargavinf

19. వీధులు

19. వీధులు

ఎయిర్‌ పోర్ట్ పార్కింగ్, అక్బర్ రోడ్, ఏంజల్ అండ్ ట్వింకిల్, చరిష్మా, బ్రాడ్వే, ఫాంటసీ స్ట్రీట్, ఫ్రెండ్లీ లేన్స్, గురునానక్ స్ట్రీట్, హైవే రోడ్, ఇషి డోరా, లవ్లీ లేన్, మసీద్ గల్లీ, పేరేడ్ టొ దబా, ప్రిన్సెస్ స్ట్రీట్, రాంబోర్స్ హిందు గల్లి, సెటినల్స్, సితారా టొ వి ఐ పి గేట్, సితారా టొ తారా, స్మాల్ టౌన్ రోడ్, టెంపుల్ రోడ్, ట్వింకిల్ టొ పేరేడ్, ట్వింకిల్ టు విలేజ్, విలేజు రోడ్, వి ఐ పి గేట్.

pc:Rameshng

20. ఫ్లోర్స్ అండ్ స్టేజెస్

20. ఫ్లోర్స్ అండ్ స్టేజెస్

షూటింగ్ ఫ్లోర్స్, స్టేజ్ ఏ టు ఎస్, స్మాల్ స్టేజెస్.

pc:Rameshng

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X