Search
  • Follow NativePlanet
Share
» »మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కొరకు ఈ నగరానికి విచ్చేస్తారు. నవీన రోడ్లన్నీ ప్రాచీనకట్టడాలను తొలగించి ఏర్పరచినవే.

By Venkatakarunasri

శివునికి చేపలకూర నైవేద్యంగా ఎక్కడ పెడతారో తెలుసా !శివునికి చేపలకూర నైవేద్యంగా ఎక్కడ పెడతారో తెలుసా !

గుడి స్తంభాల మీద వుండే రహస్య జంతువు యొక్క రహస్యం ఏంటో తెలుసా !గుడి స్తంభాల మీద వుండే రహస్య జంతువు యొక్క రహస్యం ఏంటో తెలుసా !

మక్కా లేదా మక్కాహ్ 'మక్కతుల్-ముకర్రమా' ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో గలదు. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) గలదు. ఈ మసీదులోనే పరమ పవిత్రమైన కాబా గృహం గలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయంలోని 'కాబా గృహం చుట్టూ ఏడు తవాఫ్ (ప్రదక్షిణ) లు' చేస్తారు.

జెద్దా నుండి 73 కి.మీ. ఎర్ర సముద్రము నుండి 80 కి.మీ. ఇరుకైన లోయప్రాంతంలో గలదు. సముద్రానికి 910 అడుగల ఎత్తున గలదు. ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర కొరకు ఈ నగరానికి విచ్చేస్తారు. ఈ నగరంలో వేలాది ముస్లిమేతర కుటుంబాలు కుడా నివసిస్తున్నాయి.

మక్కా నగరము సముద్రమట్టానికి 910 అడుగుల ఎత్తులో "ఫారాన్ పర్వతపంక్తు"ల మధ్యలో గలదు. ఈ నగరపు నడిబొడ్డున మస్జిద్-అల్-హరామ్ గలదు. ఈ మస్జిద్ చుట్టూ నగరం వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. ఈ మసీదు సమీపానగల ప్రాంతం పాత మక్కా నగరం. ఈ మసీదుకు ఉత్తరాన అల్-ముద్దాహ్ మరియు సుఖ్-అల్-లైల్ వీధులు గలవు. దక్షిణాన అస్-సుఘ్-అస్-సఘీర్ వీధులు గలవు. నవీన రోడ్లన్నీ ప్రాచీనకట్టడాలను తొలగించి ఏర్పరచినవే. ప్రాచీన గృహాలన్నీ ప్రాంతీయ శైలిలోని రెండు లేక మూడు అంతస్తుల రాతికట్టడాలు.

మక్కా గురించి మీకు తెలియని నిజాలు !

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

జనసాంద్రత

జనసాంద్రత

తక్కిన దేశమంతటితో పోల్చితే, మక్కాలో జనసాంద్రత ఎక్కువ. అతి ప్రాచీన జనావాసం పాతబస్తీలోగలదు. ఎక్కువమంది హజ్ పరిశ్రమలో పనిచేసేవారే.

PC: youtube

హజ్ యాత్ర

హజ్ యాత్ర

వీరెప్పుడూ హజ్ కొరకు తయారుగా వుంటారు. ప్రతియేటా దాదాపు 40 లక్షలమంది ముస్లింలు హజ్ కొరకు మక్కాను సందర్శిస్తారు. మక్కా రాష్ట్రం యొక్క రాజధాని మక్కానగరం. ఈప్రాంతంలోనే 'జెద్దా' నగరం గూడా గలదు.

PC: youtube

నాలుగువేల నంవత్సరాల క్రితం

నాలుగువేల నంవత్సరాల క్రితం

ఈ నగర ఆవిర్పావo నాలుగువేల నంవత్సరాల క్రితం జరిగినది . కొండల నడుమ నిర్జలంగా ఏ వనరులూ లేక నిర్జీవంగా వన్న బంజరుభూమిలో ఇబ్రహీం తన భార్య పోజిరాను కుమారుడు ఇస్మాయిల్ను వదిలేసి వెళ్ళిపోతాడు "నిర్థవమైన నిర్జలమైన నిరామయంగా వన్న యీ ప్రదేశంలో మమ్మల్ని వదిలివెళతారా." అని భార్య పోజిరా అడిగితే "అవును. ఇది దైవాజ్ఞ" అని ఇబ్రహీం చెప్పాడట.

PC: youtube

 జలాశయం

జలాశయం

కొడుకు ఇస్మాయిల్ దాహం అని అడిగితే ఆ తల్లికి చుట్టుపక్కల ఎక్కడా వీరు కనవడలేదు. నీటికోసం ఆదుర్ధాగా ఆటూ యిటూ ఆ తల్లి పరిగెడుతుంటే దైవికంగా ఆక్కడో జలాశయం ఏర్పడింది.

PC: youtube

ప్రధాన నివాస ప్రాంతాలు

ప్రధాన నివాస ప్రాంతాలు

జమ్ జమ్ ఆనే పేరుగల వవిత్రమైన దాహం తీర్చుకున్నారు, తర్వాత దైవాజ్ఞ మేరకు ఇబ్రహీం తిరిగి మక్కాకు వచ్చి తనయుడు ఇస్మాయిల్ సహాయంతో "కాబా"ను నిర్మించాడు, తర్వాత అక్కడో గ్రామం వెలిపి. వృద్ధిపొంది నేటి మక్కా నగరంగా రూపుదిద్దుకుంది. 6వ శతాబ్దపు మధ్యకాలంలో ఉత్తర అరేబియాలో మూడు ప్రధాన నివాస ప్రాంతాలుండేవి.

PC: youtube

నైఋతీ దిశ

నైఋతీ దిశ

అవన్నియూ నైఋతీ దిశయందు ముఖ్యంగా ఎర్ర సముద్ర తీరప్రాంతంలోనూ, మరియు ఎర్ర సముద్రానికీ, తూర్పునగల అరేబియా ఎడారికీ మధ్యనగల నివాసయోగ్య ప్రాంతంలోనూ గలవు. ఈ ప్రాంతాన్నే హిజాజ్ అంటారు.

PC: youtube

పర్వత పంక్తులు

పర్వత పంక్తులు

ఈ హిజాజ్ ప్రాంతం నీటి సౌకర్యాలు గల ఒయాసిస్ ప్రాంతం. ఈ హిజాజ్ మధ్య ప్రాంతంలో యస్రిబ్ పట్టణం (ప్రస్తుతం దీని పేరు మదీనా) గలదు. ఈ పట్టణానికి 250 కి.మీ. దక్షిణాన, పర్వత పంక్తులలో తాయిఫ్ పట్టణం గలదు.

PC: youtube

ధనిక ప్రాంతం

ధనిక ప్రాంతం

తాయిఫ్‌కు వాయువ్యాన మక్కా పట్టణం గలదు. మక్కా చుట్టూగల నేల సారవంతమైనది గాకున్నా ధనిక ప్రాంతంగా వర్థిల్లుతూనేవున్నది. మక్కా ప్రముఖ వ్యాపారకేంద్రం గూడా. అరేబియాలోని 3 నివాసయోగ్యప్రాంతాలలో ఒకటి.

PC: youtube

బహువిగ్రహారాధనాకేంద్రం

బహువిగ్రహారాధనాకేంద్రం

మక్కా పట్టణానికి ఆనుకొనే జమ్ జమ్ బావి గలదు. మక్కా మరియు పరిసర ప్రాంతాలకంతటికీ ఈ బావినీరే ప్రధానం. ఇస్లాంలో పరమపవిత్రమయిన క్షేత్రం కాబా, మక్కా నగరంలోనే గలదు. కాబా గృహం మొదట బహువిగ్రహారాధనాకేంద్రం.

PC: youtube

ముహమ్మద్ ప్రవక్త

ముహమ్మద్ ప్రవక్త

ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని ప్రకటించిన తరువాత ఈ కాబాగృహం ఏకేశ్వరోపాసనాకేంద్రంగా ఖ్యాతినొందింది. మక్కానగరం నుండి సిరియా వరకు ఒకే కారవాన్ నడపబడుచుండేది.

PC: youtube

అల్లాహ్

అల్లాహ్

ముహమ్మద్ ప్రవక్త 570 మక్కాలో జన్మించారు. ఇతని జీవితం మక్కా నగరంతో ముడిపడియున్నది. అధికార ఖురైషీయుల తెగ యైన హాషిమీ వంశానికి చెందినవారు. అల్లాహ్ ప్రవచనాలు ప్రకటితమైన తరువాత, పాగన్ (అరేబియాకు చెందిన బహువిగ్రహారాధకులు) లకు వ్యతిరేకంగా తన మిషన్ ను ప్రారంభించారు.

PC: youtube

క్రీ.శ. 622 లో

క్రీ.శ. 622 లో

తరువాత మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్ళారు. క్రీ.శ. 622 లో కొందరు అనుచరగణంతో మక్కావాసులతో బద్ర్ యుద్ధం సాగించి విజయం సాధించి మక్కావాసులలోనూ బెదూయీన్ తెగలలోనూ కీర్తిపొందారు. దీని తరువాత అనేక యుద్ధాలు జరిగాయి, ఉదాహరణకు ఉహుద్ యుధ్ధం మరియ్ ఖందఖ్ యుద్ధం..

PC: youtube

అనుయాయులు

అనుయాయులు

క్రీ.శ. 628 లో ముహమ్మద్ ప్రవక్త శాంతికాములతో, తన అనుయాయులతో మక్కాకు హజ్ కొరకు తీర్థయాత్ర ప్రారంభించారు. ఈ విధంగా ఇస్లాం మతములో హజ్ యాత్ర ఒక ముఖ్యమైన అంశమని విశదీకరించబడింది. మక్కా ప్రజలు మరియు మదీనాలో ఉన్న ముస్లింల మధ్య ఘర్షణలను అంతమొందించడానికి ముహమ్మద్ ప్రవక్త, మక్కావాసులతో ఒక అంగీకారానికి వచ్చి హుదైబియా సంధి కుదుర్చుకున్నారు.

PC: youtube

 హజ్ యాత్ర

హజ్ యాత్ర

ఈ అంగీకారం ప్రకారం ముస్లింలు హజ్ యాత్ర కొరకు సంవత్సరకాలం వేచి వుండవలసి వచ్చింది, మరియు ఎవరైనా మక్కావాసులు మదీనాకెళ్ళినా వారు తిరిగి మక్కాకు రావచ్చు, కాని ఎవరైనా మదీనావాసి మక్కాకెళ్ళిన మహమ్మదు ప్రవక్త పిలిచిననూ మదీనాకు తిరిగిరాకూడదు.

PC: youtube

యాత్ర

యాత్ర

హుదైబియా సంధి ఆ తరువాత పది సంవత్సరాల పాటు యుద్ధాలనుండి విశ్రాంతినిచ్చింది. కాని మక్కావాసులచే ఈ సంధి క్షేధించబడింది, కానీ యుధ్ధానికి బదులుగా మక్కా శాంతియుతంగా ముస్లిముల వశమయింది. ముహమ్మద్ ప్రవక్త తన అనుయాయులతో మరుసటి సంవత్సరం హజ్ యాత్రకు మక్కా బయలుదేరారు.

PC: youtube

క్షమాభిక్ష

క్షమాభిక్ష

మక్కావాసులు ముస్లిముల సంఖ్య మరియు వారి విశ్వాసబలాన్ని చూసి వారిని ఆపలేకపోయారు. మక్కావాసులందరూ తలోదిక్కూ దాక్కొన్నారు. మక్కావాసులెవరికీ ఎలాంటి అపకారం కలుగకుండా క్షమాభిక్ష ప్రసాదింపబడింది. ఆవిధంగా మక్కా శాంతియుతంగా ముస్లిముల వశమయినది.

PC: youtube

మహమ్మదు ప్రవక్త

మహమ్మదు ప్రవక్త

మహమ్మదు ప్రవక్త, హజ్ తరువాత అత్తాబ్ బిన్ ఉసైద్ను మక్కా గవర్నరుగా నియమించి, మదీనా బయలుదేరారు.

PC: youtube

సంపూర్ణవిశ్వాసం

సంపూర్ణవిశ్వాసం

మక్కాయందు గల అనేక తెగలవారి మధ్య సమన్వయాన్ని కలుగజేసి ఏకేశ్వర సంపూర్ణవిశ్వాసాన్ని కలుగజేసి అరేబియా అంతటినీ ఏకత్రాటిపై తెచ్చాడు.

PC: youtube

కాబా

కాబా

కాబా ప్రాచీన రాతి కట్టడం. ముస్లింలదరూ దీనివైపే తిరిగి ప్రార్థనలు (నమాజ్) చేస్తారు. ఈ కాబాగృహం 3000 హిజ్రీ పూర్వం ఇబ్రాహీం ప్రవక్త చేనిర్మింపబడింది. హజ్ మరియు ఉమ్రా చేయువారు దీని చుట్టూ గడియారపు ముల్లు వ్యతిరేకదిశలో (అపసవ్య దిశలో) 7 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణను తవాఫ్ అంటారు.ఈ కాబా గోడలో అమర్చిన రాయిని పరలోకం నుండి వచ్చిన రాయిగా భావించి ముస్లిములు ముద్దు పెట్టుకుంటారు.

PC: youtube

జమ్ జమ్ బావి

జమ్ జమ్ బావి

ఇస్లామీయ ధార్మిక గ్రంథాల ప్రకారం ఈ బావి ఇబ్రాహీం ప్రవక్త మరియు హాజిరాల తనయుడైన ఇస్మాయీల్ పై ప్రకటితమయినది. ఇస్మాయీల్ బాల్యంలో తీవ్రమయిన దప్పికగొన్న సయమంలో హాజిరా నీటికొరకు అన్వేషించింది. అల్లాహ్ ఇస్మాయీల్ పాదాలచెంతనే నీటిని ప్రకటింపజేశాడు.

PC: youtube

 అల్లాహ్

అల్లాహ్

మక్కా ప్రాంతం అతి తక్కువ నీటివనరులుగల ప్రాంతం. ఈ జమ్ జమ్ బావి మక్కా ప్రాంతీయవాసులకు అల్లాహ్ యొక్క వరం. హజ్ యాత్రికులు ఈనీటిని తమతోపాటు తీసుకువస్తారు. ఈనీటిని పరమపవిత్రంగా భావిస్తారు. ఈనీరు దప్పికనేగాక ఆకలిని గూడా తీరుస్తుందని ప్రతీతి.

PC: youtube

సర్వరోగనివారిణి

సర్వరోగనివారిణి

ఈనీరు సర్వరోగనివారిణి అని ముస్లింల ప్రగాఢవిశ్వాసం. ముస్లింలు మరణించినపుడు తమ కఫన్ లను ఈ నీటితో పవిత్రం చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడంవలన తమ పరలోక యాత్ర శుభప్రథమౌతుందని నమ్ముతారు.

PC: youtube

పవిత్రం

పవిత్రం

హజ్ యాత్రికులు తమ ఇహ్రామ్ (హజ్ సమయంలో ధరించే వస్త్రాలు) లను ఈనీటితో తడిపి పవిత్రంచేసి తీసుకువస్తారు. ఈ వస్త్రాలను తమ కఫన్ లుగా ధరించాలని కోరుకుంటారు.

PC: youtube

 రవాణా సౌకర్యాలు

రవాణా సౌకర్యాలు

మక్కాలో విమానాశ్రయం లేదు. జెద్దాలో గల 'కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం' ఇక్కడికి సమీపములో ఉన్న ప్రధాన విమానాశ్రయం. హజ్ మరియు ఉమ్రా కొరకు గల ఇతర రవాణాసౌకర్యాలు అధికంగా కానవస్తాయి.

PC: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X