Search
  • Follow NativePlanet
Share
» »హనుమంతుని విగ్రహం తలక్రిందులుగా ఉన్న ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

హనుమంతుని విగ్రహం తలక్రిందులుగా ఉన్న ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినీ నగరానికి 30కి.మీ ల దూరంలో వున్న సేన్వేర్ అనే ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ఒక హనుమాన్ ఆలయం వుంది.

By Venkatakarunasri

సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్యకిరణం ఆలయగర్భగుడిలోకి ప్రవేశించే ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !డా. దాసరి నారాయణరావుగారు పుట్టిన ఊరు విశేషాలు మనం తెలుసుకుందామా !

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినీ నగరానికి 30కి.మీ ల దూరంలో వున్న సేన్వేర్ అనే ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ఒక హనుమాన్ ఆలయం వుంది. ఈ ఆలయాన్ని "ఉల్టే హనుమాన్ టెంపుల్" అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో పూజలందుకునే హనుమంతుని విగ్రహం తల్లక్రిందులుగా వుండటం ఈ క్షేత్రానికి ప్రత్యేకతగా చెప్పాలి.

ఈ ఆలయం త్రేతాయుగంలో నిర్మించబడిందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ క్షేత్రానికి ఒక విశేషమైన స్థల పురాణం వుంది. అదేంటంటే త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో రావణాసురుడి మేనమామలు, సోదరులు యుద్ధంలో విజయం లభించటం కోసం తమ తాంత్రిక శక్తులతో వానరసైన్యంలోని వానరులుగా రూపం ధరించి వానర సైన్యంలో కలసిపోయి ఆ తర్వాత ఒక రాత్రి సమయంలో రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళారు. తెల్లవారిన తర్వాత ఈ విషయం వానరసైన్యానికి తెలిసింది.

తలక్రిందుల హనుమాన్ విగ్రహం

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

రామ లక్ష్మణులు

రామ లక్ష్మణులు

తమ నాయకులైన రామ లక్ష్మణులు అదృశ్యం కావడంతో వానరసేన భయాందోళనకు గురైంది.

pc: youtube

హనుమంతుడు

హనుమంతుడు

ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ తలను నేలకుంచి,కాళ్ళను గాలిలోకి లేపి ఆపై నేలను చీల్చుకుని పాతాళంలోకి చేరుకుని అక్కడ ఐహీరావణ సోదరులతో యుద్ధం చేసి వాళ్ళను సంహరించి ఆ తర్వాత రామ లక్ష్మణులను తీసుకుని భూమిమీదకొచ్చాడు. ఆనాడు హనుమంతుడు తల క్రిందులుగా నిలబడి ఈ సేన్వేర్ ప్రదేశం గుండానే పాతాళలోకానికి వెళ్ళాడని భక్తులు భావిస్తున్నారు.

pc: youtube

ఉల్టే హనుమాన్

ఉల్టే హనుమాన్

ఆ కారణంగానే ఈ క్షేత్రంలోని హనుమ విగ్రహం తలక్రిందులుగా వుండేలా ఏర్పాటుచేయబడినది. ఈ క్షేత్రంలో తలక్రిందులుగా వున్న హనుమాన్ ను "ఉల్టే హనుమాన్" అని పిలుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా తలక్రిందులుగా వుండే హనుమాన్ విగ్రహం మనకు కనపడదు.

pc: youtube

అతి ముఖ్యమైన విశేషం

అతి ముఖ్యమైన విశేషం

ఈ క్షేత్రం యొక్క అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి 3 లేదా 5 మంగళ వారాలు ఈ స్వామివారిని దర్శించి స్వామికి ఎర్రని గుడ్డని సమర్పించినట్లయితే ఆ వ్యక్తి కోరే కోర్కె ఎలాంటిదైనా సరే తప్పక తీరుతుంది.

pc: youtube

అన్ని సమస్యలు తీరుపోతాయి

అన్ని సమస్యలు తీరుపోతాయి

కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ హనుమ యొక్క ఆలయాన్ని ఒకసారి కంటితో చూసినా సరే అన్ని సమస్యలు తీరుపోతాయని తెలుస్తుంది.

pc: youtube

రామ, లక్ష్మణ, సీతా, శివపార్వతుల విగ్రహాలు

రామ, లక్ష్మణ, సీతా, శివపార్వతుల విగ్రహాలు

ఈ ఆలయంలో ప్రాచీన కాలానికి చెందిన రెండు పారిజాత వృక్షాలు కూడా వున్నాయి. ఈ ఆలయంలో హనుమ విగ్రహంతో పాటు రామ, లక్ష్మణ, సీతా, శివపార్వతుల విగ్రహాలు కూడా వున్నాయి.

pc: youtube

సాన్వర్‌

సాన్వర్‌

ఉజ్జయిని ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉల్టాగా... అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్‌ సమీపాన ఉన్నది.

pc: youtube

ఆంజనేయస్వామి విగ్రహం

ఆంజనేయస్వామి విగ్రహం

ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత. విగ్రహం తలక్రిందులుగా ఉన్నది కాబట్టే ఆ ఆలయానికి ఉల్టే ఆంజనేయ స్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.

pc: youtube

సాన్వర్‌ గ్రామ వాసులు

సాన్వర్‌ గ్రామ వాసులు

ఈ ఆలయంలో విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదీ తలక్రిందులుగా. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, రామాయణ కాలం నాటిదని సాన్వర్‌ గ్రామ వాసులు అంటున్నారు.

వాయుపుత్రుని విగ్రహం

వాయుపుత్రుని విగ్రహం

రామలక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళ లోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళ లోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు తలక్రిందులుగా పాతాళలోకాని కి వెళ్లినదానికి నిదర్శనంగా ఆలయంలో వాయుపుత్రుని విగ్రహం తలక్రిందులుగా స్థిరపడిపోయిందని చెబుతారు స్థానికులు.

వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని

వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని

ఈ ఆలయంలోని వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్టు చరిత్ర చెబుతున్నది.

మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు

మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు

ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు పురాతన పారిజాత వృక్షాలు ఉన్నాయి. పురాతన గాథల ప్రకారం ఈ చెట్టులో వీరహనుమాన్‌ కొలువై ఉన్నాడట. ఈ పారిజాత చెట్టుపై లెక్కలేనన్ని చిలుకలు కూర్చుని ఉంటాయి.

రామచిలుక రూపంలో అవతారం

రామచిలుక రూపంలో అవతారం

ఒకానొక బ్రాహ్మణుడు రామచిలుక రూపంలో అవతారం దాల్చాడని పురాణ గాథ చెబుతున్నది. వీర హనుమాన్‌ చిలుక రూపంలోకి మారి, తులసీదాసు రాముడిని కలిసేందుకు వాహకంగా మారాడని పురాణ కథనం.

ప్రజల విశ్వాసం

ప్రజల విశ్వాసం

ఆలయంలోపల సీతారాములు, లక్ష్మణుడు, శివపార్వతి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి మంగళవారం సిందూరాన్ని ఆంజనేయస్వామి విగ్రహానికి పూస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆంజనేయస్వామిపై ప్రగాఢ విశ్వాసం వలన ఈ ఉల్టా ఆలయానికి భక్తులు విశేషంగా ఆకర్షితులవుతుంటారు.

ఎలా చేరాలి

ఎలా చేరాలి

రోడ్డు మార్గంలో ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో, ఇండోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ప్రాంతానికి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X