Search
  • Follow NativePlanet
Share
» »కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పక్షి అభయారణ్యాలు !

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పక్షి అభయారణ్యాలు !

By Mohammad

పక్షులను చూస్తే ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి. పిల్లలు, పెద్దలు అందరూ పక్షులను చూసి మురిసిపోతారు. చిన్నప్పుడు పల్లెటూర్లలో ఉదయాన్నే పక్షులు చేసే సందడి అంతా ఇంతా కాదు. రామచిలుక మాటలు, కోయిల తీసే రాగాలు మనము మరిచిపోతామా ? ఇప్పుడైతే వీటి అరుపులు అరుదుగా వినిపిస్తున్నాయి, ఆ పక్షులు కూడా అరుదుగానే కనిపిస్తున్నాయి.

కేరళ ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడి వాతావరణం ఎవ్వరినైనా యిట్టె ఆకర్షిస్తుంది. 'గాడ్స్ ఓన్ కంట్రీ' గా పేరుగాంచిన కేరళలో కొన్ని ప్రత్యేకమైన పక్షి అభయారణ్యాలు ఉన్నాయి. ఈ అభయారణ్యాలలో లెక్కలెన్నన్ని పక్షులు ఉన్నాయి. దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన రంగురంగుల పక్షులను పక్షిప్రేమికులు చూడవచ్చు. కేరళలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి 4 పక్షి అభయారణ్యాలు.

లిటిల్ గ్రీన్ బీ ఈటర్

లిటిల్ గ్రీన్ బీ ఈటర్, చిత్రకృప : PROLip Kee

తట్టెకాడ్ బర్డ్ సంక్చురి

తట్టెకాడ్ బర్డ్ సంక్చురి, కేరళ లోని ఎర్నాకులం జిల్లాలో కలదు. దీనినే సలీం అలీ బర్డ్ సంక్చురి అని కూడా పిలుస్తారు. రకరకాల పక్షులను చూసి ఆనందించాలనుకొనేవారికి ఈ సంక్చురి అద్భుతమైన సందర్శనానుభూతిని కలిగిస్తుంది.

కనువిందు చేసే పక్షులు : పెనిన్సులర్ బే ఓల్, మలబార్ గ్రే హార్న్ బిల్, రోజ్ బిల్డ్ రోలర్, క్రిమ్సన్ త్రోటెడ్ బార్బర్, క్రేస్టేడ్ సేర్పెంట్ ఈగల్, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ మరియు ఫెయిరీ బ్లూ బర్డ్ మరియు మొదలుగునవి. పక్షులతో పాటు టాక్సీ డెర్మిక్ మ్యూజియం కూడా సందర్శించదగినది.

బుల్ బుల్ పిట్ట

బుల్ బుల్ పిట్ట, చిత్రకృప : PROLip Kee

సందర్శన సమయం : అక్టోబర్ నుండి మార్చి వరకు

తెరిచే సమయం : ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

<strong>కర్ణాటక రాష్ట్రంలోని పక్షి అభయారణ్యాలు !</strong>కర్ణాటక రాష్ట్రంలోని పక్షి అభయారణ్యాలు !

ఎలా చేరుకోవాలి : కొచ్చి సమీప ఎయిర్ పోర్ట్. అలువా సమీప రైల్వే స్టేషన్. 60 కి. మీ ల దూరంలో ఉన్న కొచ్చి నుండి, 50 కి. మీ ల దూరంలో ఉన్న అలువా నుండి తట్టెకాడ్ బర్డ్ సంక్చురి చేరుకోవచ్చు.

వసతి : జంగిల్ బర్డ్ హోమ్ స్టే, సోమా బర్డ్స్ లాగూన్ రిసార్ట్, డాలర్ బర్డ్ లేక్ రిసార్ట్ మరియు హార్న్ బిల్ క్యాంపు లు తట్టెకాడ్ బర్డ్ సంక్చురి సమీపాన కలవు.

కుమారకోమ్ బర్డ్ సంక్చురి

కుమారకోమ్ బర్డ్ సంక్చురి, చిత్రకృప : Ashwin Kumar

కుమారకోమ్ బర్డ్ సంక్చురి

కేరళలోని కుమారకోమ్ అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక. కేరళలో అతి పెద్ద మంచి నీటి సరస్సు గా గుర్తించబడ్డ వెంబనాడ్ సరస్సు ఒడ్డున కుమారకోమ్ బర్డ్ సంక్చురి కలదు. హిమాలయాలు, సైబీరియా వంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చే పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి.

కనువిందు చేసే పక్షులు : కోకిల, నీటిపక్షులు, కొంగ, నీటికాకి, గుడ్లగూబ, టేల్, భరద్వాజ పక్షి, ఎగ్రేట్, మూర్హెన్, సైబేరియన్ కొంగ,డార్టర్, బ్రాహ్మినీ గడ్డ, చిలుక, ఫ్లై కాచర్ వంటి వి ఇక్కడ ప్రధానంగా కనిపించే పక్షి జాతులు.

సందర్శన సమయం : అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు

లోటెన్స్ సన్ బర్డ్

లోటెన్స్ సన్ బర్డ్ , చిత్రకృప : Lip Kee

తెరిచే సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

ఎలా చేరుకోవాలి : కొట్టాయం 15 కి. మీ ల దూరంలో కలదు. కొట్టాయం, కొచ్చి నుండి ప్రతి రోజూ బస్సులు నడుస్తుంటాయి మరియు కొట్టాయం లో రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైళ్లు వస్తుంటాయి. కొచ్చి సమీప ఎయిర్ పోర్ట్.

వసతి: ఇల్లికలం సరస్సు వద్ద గల కాటేజీలు, కోకోబే రిసార్ట్, లక్ష్మి హోటల్ మరియు రిసార్ట్, మనోర్ బ్యాక్ వాటర్ రిసార్ట్ మరియు ఇతర హోటళ్లు సంక్చురి సమీపాన కలవు.

కదలుండి పక్షి అభయారణ్యం

కదలుండి పక్షి అభయారణ్యం , చిత్రకృప : Dhruvaraj S

కదలుండి పక్షి అభయారణ్యం

చిన్న చిన్న ద్వీపాల సమూహంతో విస్తరించి ఉన్న కదలుండి పక్షి కేంద్రం మలప్పురం జిల్లాలో కలదు. కదలుండి నది అరేబియా సముద్రాన్ని కలిసే సంగమ స్థలికి కూత వేటు దూరంలో ఈ పక్షి కేంద్రం ఉన్నది. విహంగ వీక్షకులకు ఒక మరుపురాని అనుభూతి ఈ కేంద్రం.

<strong>ఎపి లోని పక్షి అభయారణ్యాలు !</strong>ఎపి లోని పక్షి అభయారణ్యాలు !

కనువిందు చేసే పక్షులు : మలబార్ ఇబెరితలు , వడ్రంగి పిట్టలు, డార్టర్స్, వింబ్రెల్స్, కాకులు , కొంగలు, ఉల్లంకులు, ప్లోవెర్స్, లకుముకిపిట్టలు, భాహ్మినీ గద్దలు లాంటి వివిధ పక్షి జాతులను ఇక్కడ చూడవచ్చు.

కదలుండి

కదలుండి, చిత్రకృప : PRODhruvaraj S

సందర్శన సమయం : అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు

తెరిచే సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

ఎలా చేరుకోవాలి : కాలికట్ కు 21 కి.మీ ల దూరంలో ఉంది కదలుండి పక్షి అభయారణ్యం.

వసతి : కాలికట్ ఒక పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఉండటానికి అనేక హోటళ్లు, రిసార్ట్ లు కలవు. హైసన్ హెరిటేజ్, ది రాబిజ్ రిసార్ట్ అండ్ స్పా, హోటల్ అస్మా టవర్, హోటల్ మోనాడ్ మరియు ఇతర హోటళ్లు కాలికట్ సమీపాన కలవు.

మంగళవనం లోపలి భాగం

మంగళవనం లోపలి భాగం, చిత్రకృప : Parambikulam Tiger Conservation Foundation

మంగళవనం బర్డ్ సంక్చురి

పక్షుల మీద పరిశోధనలు చేసేవారికి, వాటి మీద ఆసక్తి గలవారికి మంగళవనం బర్డ్ సంక్చురి సూచించదగినది. ఎర్నాకులం హై కోర్ట్ పక్కనే ఈ సంక్చురి కలదు. అరుదైన వలస పక్షులను, స్థానిక పక్షులను ఇక్కడ గమనించవచ్చు.

సందర్శించు సమయం : జనవరి నుండి మర్చి వరకు

ఎలా చేరుకోవాలి ? కొచ్చిలో హై కోర్ట్ పక్కనే ఉంది. కనుక నగరంలోని అన్ని ప్రాంతాల నుండి సంక్చురి కి ఆటో రిక్షాలు, లోకల్ బస్సులు మరియు టాక్సీ/ క్యాబ్ లు తిరుగుతాయి.

<strong>కేరళ బ్యాక్ వాటర్ హౌస్ బోట్ - మరుపురాని అనుభూతి !</strong>కేరళ బ్యాక్ వాటర్ హౌస్ బోట్ - మరుపురాని అనుభూతి !

వసతి : బేవాచ్ బీచ్ హోమ్, ఫోర్ట్ గార్డెన్ రెసిడెన్సీ, సోనెట్టా రెసిడెన్సీ, గ్రీన్ వుడ్స్ బెత్లేహెం హోటల్ మరియు ఇతర హోటళ్లు కొచ్చిలో కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X