Search
  • Follow NativePlanet
Share
» » మహారాష్ట్ర లో ప్రసిద్ధ గణేశ దేవాలయాలు !

మహారాష్ట్ర లో ప్రసిద్ధ గణేశ దేవాలయాలు !

వినాయకుడి కొరకు ప్రత్యేకంగా చేసే వినాయక చవతి పండుగ గనేషుడి కి ఎంతో ఇష్టమైనది. ఏనుగు తల కలిగిన ఈ గనేషు దేముడిని భాద్రపద శుద్ధ చతుర్ధి నుండి అనంత చతుర్దశి వరకూ పది రోజుల పాటు పూజిస్తారు. ఈ పండుగ దేశ వ్యాప్తంగా చేస్తారు. అయితే, మహారాష్ట్ర లోని ముంబై లో మరింత ఘనంగా జరుగుతుంది. రంగు రంగుల వినాయకుడి విగ్రహాలను పందిళ్ళ లోను, ఇండ్ల లోను పెట్టి వివిధ అలంకరణలు చేసి, దీపాలు వెలిగించి వైభవోపేతంగా వేడుకలు నిర్వహిస్తారు. భక్తి పాటలు, డాన్సులు, మేళ తాళాలు మొదలైనవి గణేశ భక్తులు చేసే వేడుకలలో ప్రధానమైనవి. ముంబై నగరమంతా కూడా ఈ గణేశ ఉత్సవాలు అట్ట హాస అలంకరణలతో నిర్వహిస్తారు.

గనేషుడి ని విద్య బుద్ధులు, ఐశ్వర్యం, అదృష్టం ఇచ్చే దేముడిగా కొలుస్తారు. ప్రయాణాలు లేదా కొత్త పధకాలు చేపట్టాలన్నా ముందుగా విగ్నేస్వరుడిని పూజించి పని మొదలు పెట్టాల్సిందే. మహా రాష్ట్ర సందర్శనలో ఇక్కడ కల ప్రసిద్ధ గణేశ గుడులు తప్పక చూడాలి. ఈ గుడులలో వినాయక చవితి పండుగ వేడుకలు అద్భుతంగా వుంటాయి.

 సిద్ధి వినాయక టెంపుల్, ముంబై

సిద్ధి వినాయక టెంపుల్, ముంబై

ఈ టెంపుల్ ముంబై లోని ప్రభాదేవి ప్రాంతంలో కలదు. గర్భ గుడి పై భాగం బంగారు పూత వేయబడి వుంటుంది. ప్రధాన దైవం గణేశుడు. పక్కనే, హనుమాన్ టెంపుల్ కూడా కలదు. గణేశ పండుగకు ఇక్కడ చేయబడే అలంకరణ దేశ వ్యాప్త భక్తులను ఆకర్షిస్తుంది.

లాల్ బగీచా, ముంబై

లాల్ బగీచా, ముంబై

లాల్ బగీచా రాజా టెంపుల్ సెంట్రల్ ముంబై లో కలదు. ఈ దేవాలయం చాలా పెద్దది. పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది. భక్త్లుల కోర్కెలు తీర్చే ఈ దేముడి ఆశీర్వాదం కొరకు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ గుడి కి వస్తారు. కాలా క్రమేనా ఈ గుడి అధిక ప్రాధాన్యం సంతరించుకుంటూ ప్రముఖ సెలబ్రిటీ లను కూడా ఆకర్షిస్తూ, బంగారు, వెండి కానుకలు అధికంగా స్వీకరిస్తోంది. ఈ టెంపుల్ కు పత్రికలవారు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు.

గణపతి టెంపుల్ , గణపతి పూలే

గణపతి టెంపుల్ , గణపతి పూలే

ఈ దేవాలయ గణపతి విగ్రహం స్వయంభు అంటే, వెలసినదిగా చెపుతారు. ఇది సుమారు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగి వుంది. ఈ టెంపుల్ ను గణేశ పండుగలలో అత్యంత సుందరంగా అలంకరిస్తారు. వేలాది భక్తులు, టూరిస్ట్ లు ఈ గుడి సందర్శనకు వస్తారు.

దాగాదుషేత్ గణపతి టెంపుల్, పూనే

దాగాదుషేత్ గణపతి టెంపుల్, పూనే

ఈ గణేశ గుడి, చారిత్రాత్మక శనివార కోటకు సమీపంలో కలదు. మరాఠా సామ్రాజ్యానికి ఈ కోట రాజధాని గా వుండేది. ఈ ప్రసిద్ధ టెంపుల్ ను ప్రతి సంవత్సరం వేలాది భక్తులు సందర్శిస్తారు. గణేశ పండుగ సమయంలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా ఈ గుడి సందర్శిస్తారు.

రెడి గణపతి టెంపుల్ , రెడి

రెడి గణపతి టెంపుల్ , రెడి

రెడి గణపతి టెంపుల్ లోని విగ్రహం ఆరు అడుగుల ఎత్తు, సుమారు నాలుగు అడుగుల వెడల్పు వుండి ఆకర్షణీయంగా వుంటుంది. ఈ టెంపుల్ అనేక ప్రకృతి సహజ సుందర దృశ్యాల మధ్య కలదు. భక్తులు, టూరిస్ట్ లు ప్రతి సంవత్సరం జరిగే పండుగకు వేల సంఖ్యలో మరియు సంకష్ట చతుర్ధి కి అధిక సంఖ్యలో వస్తారు.

అష్ట వినాయక టెంపుల్

అష్ట వినాయక టెంపుల్

మహారాష్ట్రలో అష్ట వినాయకులు గా పేరొందిన ఈ గుళ్ళు మొత్తంగా ఎనిమిది. మహారాష్ట్ర లోని పూనే కు చుట్టుపట్ల ప్రదేశాలలో కల ఈ ఎనిమిది వినాయక గుడులు చూస్తీ గొప్ప యాత్ర పూర్తి అయినట్లుగా హిందువులు భావిస్తారు. ఈ ఎనిమిది గుడులలో ఆరు పూనే జిల్లా లో వుండగా, మిగిలిన రెండు గుడులు రాయ గడ జిల్లాలో కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X