అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఆలయాల రహస్యం ... అంతా గప్చుప్

Written by: Venkatakarunasri
Updated: Monday, May 22, 2017, 12:24 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: క్రేజీ బుల్లెట్ (బాబా) మహిమలు!

దెయ్యాల కిచెన్.. ఎక్కడవుందో తెలుసా..

ఆ ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక పామును పెంచుతారు !

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ లో !

కపిలతీర్ధానికి మహత్యం ఉందా?

భారతదేశంలో ఎక్కడ చూసిన దేవాలయాలు దర్శనం ఇస్తాయి. అయితే, వీటిలో కొన్ని క్షేత్రాలు మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. పురావస్తు శాఖకు సైతం చెప్పలేని ఎన్నో అద్భుతాలను మన పూర్వీకులు అప్పట్లోనే కట్టడాల రూపంలో చేసి చూపించారు. మీలో అంతులేని ఆలోచనాతరంగాలను రేకెత్తించే కొన్ని పుణ్యక్షేత్రాల విశేషాలు, మిస్టరీలు మీకోసం ...

ఇండియా మిస్టరీల గుట్ట. ఎక్కడ ఎప్పుడూ ఏ మిస్టరీ జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు.అంతా గుప్చుప్. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ భారతదేశంలో పుట్టినవే. వీటిలో కొన్ని చూసి తరించేవిగా ఉంటే .. మరికొన్ని ఆశ్చర్యాన్ని, అద్భుతాలని కలిగించేవిగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : కర్నూలులో ఒక్కరోజు బైక్ యాత్ర !!

ఆలయాల రహస్యం ... అంతా గప్చుప్

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

మమ్మీలు

మమ్మీలు .. అంటే గుర్తొచ్చేది ఈజిప్టు. కానీ హిమాచల్ ప్రదేశ్ లోని 'గ్యూ' అనే గ్రామంలో 500 ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది. సంఘా టెంజింగ్ అనే టిబిట్ కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చొని ఉంది. అది కూడా చెక్కుచెదరని చర్మం, జుట్టుతో ఈ మమ్మీ కనిపిస్తుంది.

చిత్ర కృప : Richard Weil

తాజ్ మహల్

తాజ్ మహల్ ఉన్న ప్రదేశంలో పూర్వం శివుని ఆలయం ఉండేదట. దాన్ని తేజో మహాలయం అనేవారట. ఈ విషయాన్ని ఢిల్లీ లోని ప్రొఫెసర్ గట్టిగా సమర్ధిస్తున్నాడు. సుప్రీం కమాండర్ నుంచి ఈ ఆలయాన్ని తీసుకొని షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడని, మొఘల్ చక్రవర్తులు ఆలయాలను ఆక్రమించుకొని మసీదులు, మహల్స్ కట్టుకున్నారని వారు వాదిస్తున్నారు.

చిత్ర కృప : Ramesh NG

అమ్రోహ

ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహ, ఫార్పుద్దీన్ షా విలాయత్ కు ప్రసిద్ధి చెందినది. ఈ పుణ్య క్షేత్రం చుట్టూ రక్షణగా తేళ్లు ఉంటాయి. ఇవి ఎవ్వరినీ కుట్టవు. ఇక్కడికి వచ్చే సందర్శకులు వీటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి ఆలయ మరొకటి ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా, కోడుమూరు పట్టణంలో కలదు. అక్కడ కూడా తేళ్లు ఎవ్వరినీ ఏమీ చేయవు. ఊరి జాతర సమయంలో ఆలయాన్ని దర్శించవచ్చు.

చిత్ర కృప : NADEEM NAQVI

శ్రావణబెళగొళ

శ్రావణబెళగొళ లోని గోమఠేశ్వర విగ్రహం (బాహుబలి విగ్రహం) దేశంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి. దీని ఎత్తు 60 అడుగులు ఉంటుంది. గోమఠేశ్వరుడు జైనుల గురువు. దిగంబరులు, శ్వేతాంబరులు వచ్చి తమ గురువుకు పూజలు చేస్తుంటారు. 30 KM ల దూరము నుండి కూడా విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది.

చిత్ర కృప : sree314

ఖబీస్ బాబా ఆలయం

ఉత్తరప్రదేశ్ లోని సితాపూర్ జిల్లాలోని ఖబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం కలిగిస్తుంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.. పూజారీ ఉండరు. ఈ ఆలయం 150 ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు చెబుతారు. ప్రచండమైన శివ భక్తుడు ఖబీస్ బాబా ఇక్కడ ఉంటారు. ఇతను సాయంత్రం భక్తులు సమర్పించే మద్యం సేవించి.. భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం.

షోలాపూర్

మహారాష్ట్రలోని షోలాపూర్ బెడ్ షీట్ లకు పెట్టింది పేరు. జిల్లాలోని షేప్టల్ గ్రామంలో పాముల పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు ప్రత్యేకంగా కొంత ప్రదేశం కల్పిస్తారు. ప్రతి ఇంట్లో మనుషులు మాదిరిగా... పాములు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎవరినైనా పాము కరిచినట్లు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.

చిత్ర కృప : Srinayan Puppala

అజంతా ఎల్లోరా

అజంతా ఎల్లోరా సమీపంలోని కైలాస ఆలయం నిర్మాణాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్య పోవాల్సిందే! కొండలని తొలచి శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.

చిత్ర కృప : MizieB

శని శింగాపూర్

శని శింగాపూర్, మహారాష్ట్రలో కలదు. ఊర్లోని ఏ ఒక్క ఇళ్ళకి తలుపులు ఉండవు. ఇంత వరకు ఇక్కడ దొంగతనాలు జరిగిన దాఖలాలు లేవు. ఒకవేళ దొంగతనం జరిగిన, అక్కడి శనిదేవుడే శిక్షిస్తాడని అంటారు. ఇంకో విషయం ఏమిటంటే డబ్బులను దాచిపెట్టె బ్యాంక్ లకు కూడా తాళాలు వేయరట.

చిత్ర కృప : Vithu.123

పూరీ జగన్నాథ ఆలయం

పూరీ జగన్నాథ ఆలయంలో నీడ ఏ సమయంలో కనిపించదు. అంతేనా, పూరీకి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉందని తెలుసుకదా ..! ఆ సముద్ర ఘోష (శబ్దం) కూడా ఇక్కడ వినిపించదట. ఆలయ సింహ ద్వారం (ప్రధాన ద్వారం) ప్రవేశం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోనికి వెళితే శబ్దం వినిపించదు. బయటికి వస్తే ఆ శబ్దం మరళా వినిపిస్తుంది.

చిత్ర కృప : Ajay Goyal

తెప్పేరుమనల్లూర్

తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివారాధన చేయడం అందరినీ విస్తుపోయేలా చేసింది. 2010 లో ఒక రోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం గమనించారు. తర్వాత ఆ పాము ఆలయంలో ఉన్న బిల్వ చెట్టు ఎక్కి బిల్వ పత్రాలు సేకరించి.. తర్వాత శివలింగం దగ్గరకు చేరుకుని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి సమర్పించింది.

తంజావూర్

తంజావూర్ లోని బృహదీశ్వరాలయం ఇప్పటికీ ఒక అంశం రహస్యంగానే ఉన్నది. దీనిని రాజరాజ చోళుడు క్రీ.శ. 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఆలయంలో ప్రధాన రహస్యం నీడ.గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు' కనిపించవు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. అలాగే ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ ఎక్కడ నుండి తీసుకొచ్చారో కూడా తెలీదు.

చిత్ర కృప : Amit Rawat

ద్వారేశ్ దర్గా, పూణే

90 కేజీల రాయి పూనెలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ కరెక్ట్ గా 11 మంది ఒక రాయిని కేవలం ఒక వేలుతో పైకి లేపాలి. రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమర్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకి ఎత్తాలి. ఇలా చేసిన వెంటనే ఆ రాయి 10 నుంచి 11 అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూ ఉంటుంది.

చిత్ర కృప : Kamal Khan abkamalkhan

లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్

అనంతపురం జిల్లాలో ఉంది లేపాక్షి. ఇక్కడ ఉన్న స్తంభాలు మిస్టరీగా మిగిలాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో విజయనగర స్టైల్లో నిర్మించారు. ఇక్కడ స్తంభం కింద క్లాత్ ని ఈజీగా పట్టించవచ్చు. అంటే.. స్తంభానికి, కింద ఫ్లోర్ కి గ్యాప్ ఉంటుంది. స్తంభం కింద ఫ్లోర్ సపోర్ట్ లేకుండానే ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం, గ్రౌండ్ కి తాకకుండా.. ఆలయాన్ని ఎలా మొస్తుందో .. ఎవరికీ తెలీదు.

చిత్ర కృప : Karthik Abhiram

యాగంటి

యాగంటి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఉమామహేశ్వర ఆలయంలోని నంది విగ్రహం ఇక్కడి మిస్టరీ. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రానురాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంటుదని స్థానికుల నమ్మకం. అయితే, రాయి స్వభావం స్వభావం పెరిగే గుణాన్ని కలిగి ఉన్నదని అందుకే ప్రతి 20 ఏళ్లకు ఆ రాయి 1 ఇంచు చొప్పున పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చిత్ర కృప : Rama Mahendravada

గురుద్వార్

గురుద్వార్ పంజాబ్ లోని మొహాలీ లో ఉన్నది. సిక్కుల ఏడో గురువు గురు హర్ రాయ్ ఈ ప్రాంతాన్ని 16 వ శతాబ్దంలో సందర్శించాడు. గురుద్వార్ లో ఆశ్చర్యం కలిగించే విషయం ... ఇక్కడున్న మామడి చెట్టు. సాధారణంగా మామిడి ఎండాకాలంలో కాస్తుంది. కానీ ఇక్కడున్న మామిడి చెట్టు సంవత్సరంలో అన్ని రోజులూ, సీజన్లతో సంబంధం లేకుండా కాస్తుంది.

చిత్ర కృప : Rochelle Stuve

English summary

Famous Indian Temples And Mysteries !

Where ever you go in India, may find different religious places. Some places are quite different and some other places are mysterious.
Please Wait while comments are loading...