అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

వెస్ట్ బెంగాల్ లో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు !!

Written by:
Published: Wednesday, February 8, 2017, 13:13 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

సంగ్రహాలయం (మ్యూజియం) సమాజవసరాల కోసం ఉద్దేశించబడిన ఒక సంస్థ. సంగ్రహాలయాలు మానవజాతికి సంబందించిన దృశ్య, అదృశ్య విషయాలను భద్రపరుస్తాయి. ప్రజలకు విజ్ఞానం, వినోదం అందించడంలో మ్యూజియం ల పాత్ర గణనీయమైనది. వీటిని సందర్శిస్తే గతవైభవాలు గుర్తుకురావటం ఖాయం. భారతదేశంలో కూడా అనేక మ్యూజియాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలకు విజ్జ్ఞానాన్ని, వినోదాన్ని పంచిపెడుతుంటాయి.

పశ్చిమబెంగాల్ లో మ్యూజియంలు అధికం. బ్రిటీష్ ఇండియాలో బెంగాల్ ప్రావిన్స్ రాష్ట్రం గా ఉన్న ఈ స్టేట్ లో తెల్లదొరలు అనేక కట్టడాలను నిర్మించారు. అలాటి కట్టడాలతో ఒకటి ఇంగ్లాండ్ రాణి కోసం కట్టించింది విక్టోరియా మహల్.

పశ్చిమబెంగాల్ టూరిజం లో భాగంలో ప్రముఖంగా చెప్పుకోవలసినవి మ్యూజియాలు. ఇక్కడనేక ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కలవు. భారతీయ చరిత్ర, సంస్కృతికి ఇవి దర్పణాలు. ఇందులో పెయింటింగులు, చారిత్రక శిలాశాశనాలు, అరుదైన శిల్పాలు, వస్తువులు వంటివి చూడవచ్చు. మరి వెస్ట్ బెంగాల్ లో ప్రముఖంగా చూడవలసిన మ్యూజియంల విషయానికి వస్తే ...

కూచ్ బిహార్ పాలస్ మ్యూజియం

కూచ్ బిహార్ అనేది ఒక రాయల్ ప్రదేశం. ఇక్కడ ఒక మ్యూజియం కలదు. ఈ పాలస్ మ్యూజియంలో మహారాజులు ఉపయోగించిన అనేక వస్తువులు కలవు.

చిత్రకృప : Amartyabag

రైల్వే హెరిటేజ్ మ్యూజియం

రైల్వే హెరిటేజ్ మ్యూజియంలో బెంగాల్ దోయర్స్ మరియు కూచ్ బీహార్ స్టేట్ రైల్వేకు చెందిన వివిధ వస్తువులు, డాక్యుమెంట్ లు ప్రదర్శిస్తుంది. ఉత్తర బెంగాల్ ప్రాంత తెగల ప్రజల జీవన శైలికి సంబంధిన అనేక వివరాలు తెలుసుకోవచ్చు.

చిత్రకృప : Pravin Jha

ది ఇండియన్ మ్యూజియం

కోల్కతాలో కల 'ది ఇండియన్ మ్యూజియం' ఇండియా లో ప్రసిద్ధి చెందినది. ఇది దేశ సాంస్కృతిక హెరిటేజ్ పై దృష్టి పెట్టినందున దీనికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలవని చెప్పవచ్చు. ఇది ఒక సమాచార కేంద్రం మాత్రమే కాక, సెమినార్లు, ట్రైనింగ్ ప్రోగ్రాములు నిర్వహిస్తుంది.

చిత్రకృప : Mjanich

హజార్ దువారి పాలస్ మ్యూజియం

హజార్ దువారి పాలస్ మ్యూజియం ముర్షిదాబాద్ లో కలదు. విలాసవంత భవనం లో కల ఈ మ్యూజియం ఇపుడు అర్కేయోలాజికల్ సర్వే అఫ్ ఇండియాచే నిర్వహించ బడుతోంది. గ్రీక్ డిజైన్ లో కల ఈ మ్యూజియంలో అరుదుగా సేకరించబడిన అనేక మార్బుల్ విగ్రహాలు, మెటల్ మరియు పింగాణీ వస్తువులు, ఇటాలియన్, డచ్, ఫ్రెంచ్ దేశాల కొన్ని ఓల్డ్ మాప్ లు, వంటివి కలవు.

చిత్రకృప : njanam92

ఆర్కియోలాజికల్ మ్యూజియం

ఆర్కియోలాజికల్ మ్యూజియం వెస్ట్ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో తమ్లుక్ లో కలదు. తమ్లుక్, రాష్ట్రంలో ఒక పురాతన నగరం. ఈ నగరం గురించి పాళీ మరియు సంస్కృత సాహిత్యాలలో కూడా కలదు. ఈ మ్యూజియం 1975 లో స్థాపించబడినది. దీనిలో చరిత్ర పూర్వ కాలం నాటి బోన్ టూల్స్, ఆరో హెడ్స్ , కాపర్ కాయిన్ లు, హర్పూన్, ఫిష్ నైఫ్, విక్టోరియా మెమోరియల్ వంటి వస్తువులు ప్రదర్శించారు.

చిత్రకృప : Biswarup Ganguly

విక్టోరియా మెమోరియల్

విక్టోరియా మెమోరియల్ కోల్కతా నగరంలో ఒక ప్రధాన ఆకర్షణ. వెస్ట్ బెంగాల్ టూరిజంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. విక్టోరియా మెమోరియల్ ప్రస్తుతం ఒక మ్యూజియంలా పని చేస్తోంది. ఈ ప్రదేశంలో క్వీన్ విక్టోరియా చరిత్ర , బ్రిటిష్ రాజ్యంల గురించి తెలుసుకోవచ్చు. ఒక రాయల్ గాలరీ క్వీన్ విక్టోరియా జీవితం గురించి, ప్రిన్సు ఆల్బర్ట్ జీవితం గురించి పెయింటింగ్ ల ద్వారా తెలియ చేస్తుంది.

చిత్రకృప : Pramanick

ఆసియాటిక్ సొసైటీ

ఆసియాటిక్ సొసైటీ ని కోల్కతాలో 1784 సంవత్సరంలో స్థాపించారు. దీనిలో పురాతన గ్రంధాలు, బ్రాంజ్ శిల్పాలు, కాయిన్ లు, లేఖలు, పెయింటింగ్ లు కలవు. ఈ మ్యూజియంలోని లైబ్రరీలో రీసెర్చ్ కి ఉపయోగించ బడే అరుదైన పుస్తకాలు కలవు.

చిత్రకృప : NahidSultan

రవీంద్ర భారతి మ్యూజియం మరియు జోరాసంకో ఠాకూర్ బారి

రవీంద్ర భారతి మ్యూజియం 217 సంవత్సరాలనాటి ఒక పురాతన భవనంలో కలదు. ఈ మ్యూజియం లో మహాకవి రవీంద్ర నాథ్ టాగోర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల కు చెందిన విలువైన డాక్యుమెంట్ లు, పెయింటింగ్ లు, ఫొటోగ్రాఫ్ లు ప్రదర్శిస్తారు.

చిత్రకృప : Kinjal bose 78

నెహ్రు సైన్సు అండ్ టెక్నాలజీ మ్యూజియం

ఈ మ్యూజియం ఐ ఐ టి ఖరగ్పూర్ లో కలదు. దీనిలో అనేక గ్రంధాలు, మోడల్స్, ఎక్స్ పెరి మెంట్స్ కు సంబంధిన రికార్డులు , ఫొటోగ్రాఫ్ లు కలవు. వీటిని వివిధ సంస్థలు ఈ సంస్థకు విరాళంగా ఇచ్చాయి. ఈ మ్యూజియం అంతా సైన్సు అండ్ టెక్నాలజీ కి కేటాయించబడినది.

చిత్రకృప : Saugato Banerjee

నేతాజీ రీసెర్చ్ బ్యూరో

కోల్కతాలోని ఈ మ్యూజియంలో సుభాస్ చంద్ర బోస్ కు చెందిన డాక్యుమెంట్ లు, ఆర్టికల్స్ మరియు ఫొటోగ్రాఫ్ లు వివిధ ప్రపంచ ప్రదేశాలనుండి సేకరించినవి ప్రదర్శిస్తుంది. ఈ చిత్రాలు, లేఖలు సంవత్సరాల క్రమంలో ఆయన జీవితం అనుసరించి ప్రదర్శిస్తారు. ఆయన లైఫ్ లో జరిగిన అనేక సంఘటలను ప్రదర్సిస్తారు.

చిత్రకృప : Ashlyak

నెహ్రు చిల్డ్రన్స్ మ్యూజియం

నెహ్రు చిల్డ్రన్స్ మ్యూజియం కోల్కతలో కలదు. ఈ మ్యూజియం ను పూర్తిగా పిల్లల అంశాలపై ఏర్పరచారు. తక్కువ స్థాయి నుండి, అడ్వాన్సు చెందిన, డెవలప్ అయిన పిల్లల సంరక్షణ కొరకు దీనిని స్థాపించారు. దీనిలో రామాయణ, మహాభారత గ్రంధాలలోని కధలు, బొమ్మలు, చిత్రాల రూపంలో ప్రదర్సిన్చబడతాయి. పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఇతర విధానాలు కూడా ఉపయోగిస్తారు.

చిత్రకృప : Biswarup Ganguly

English summary

Famous Museums In West Bengal

West Bengal has many pioneer museums and prestigious institutions in the state. Some of them are modern while the others are part of the old-heritage time.
Please Wait while comments are loading...