Search
  • Follow NativePlanet
Share
» »శిల్పకళా కాణాచి ... మహోబా !

శిల్పకళా కాణాచి ... మహోబా !

ఎన్నో స్మారక చిహ్నాలకు, భవనాలకు అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలకు మహోబా ఒక నివాసం.

By Mohammad

భారతదేశంలో ఖజురహో శిల్పాల భంగిమలు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది చూసొచ్చేది కూడా మధ్య ప్రదేశ్ లోని చందేలా రాజులు నిర్మించిన ఈ అపురూప శిల్పకళా సౌందర్యాన్నే. ఈ రాజులు క్రీ.శ. 9 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకు బుందేల్ ఖండ్ రాజాన్ని పాలించారు. అప్పట్లో వారికి ఖజురహో తో పాటు మరో రెండు ప్రాంతాలు రాజధానిగా ఉండేవి. అవి కలంజర, మహోబా. వీరి అధికారిక భాష సంస్కృతం. మహోబా కూడా శృంగారభరిత శిల్పాలకు పేరు గడించింది.

చందేలా రాజు

చందేలా రాజు

చిత్రకృప : Anshulmahoba

ఘనమైన చారిత్రక కీర్తి ఉన్న మహోబా ఉత్తర ప్రదేశ్ లోని చిన్న జిల్లా. చందేలా పాలనలో సృష్టించబడిన శృంగారభరితమైన శిల్పాలు అలాగే గుహలకి ప్రసిద్దమైన ఖజురహో తో బందేల్ ఖండ్ ప్రాంతం లో ఉన్న మహోబా సాంస్కృతిక మూలాలు కలుస్తాయి. బందేల్ ఖండ్ ప్రాంతాన్ని పాలించిన చందేల్ రాజ పుత్రుల రాజధానిగా మహోబా వ్యవహరించేది. 'మహోత్సావ్ నగర్' (పండుగల నగరం) అనే పదం నుండి మహోబా అనే పదం వచ్చింది. ఎన్నో స్మారక చిహ్నాలకు, భవనాలకు అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలకు మహోబా ఒక నివాసం.

జౌంపూర్ పోదాం .. సాహసాలు చేద్దాం !

మహోబా లో ఉన్న పర్యాటక ఆకర్షణ

గొఖర్ పర్వత్

మహోబా కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నది గోఖర్ పర్వత్. పిక్నిక్ లకు వచ్చేవారిని మరియు పర్వతారోహణ చేసేవారిని ఈ పర్వతం ఆకర్షిస్తుంది. హిందువులకు, బౌద్ధులకు మరియు జైనులకు చెందిన దేవాలయాలతో పాటు జలపాతాలు, ఆకట్టుకొనే గ్రానైట్ రాతి ఆకృతి ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

యజ్ఞ కుండ్

యజ్ఞ కుండ్

చిత్రకృప : Rohit Saxena

ఒకప్పటి గురు గోరఖ్నాథ్ మరియు అతని శిష్యులు ఈ పర్వతంపై గుహలను ఏర్పాటు చేసుకొని నివాసం ఉన్నారు. ఇప్పటికీ పర్వతం పైభాగాన అందుకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి.

కన్నౌజ్ - భారత 'పెర్ఫ్యూమ్' రాజధాని !

గొఖర్ పర్వత్ చుట్టుప్రక్కల చూడవలసిన ఇతర దర్శనీయ ప్రదేశాలు : కక్రమధ్ ఆలయం, బారి చంద్రికా దేవి ఆలయం, సూరజ్ కుర్ద్, మదన్ సాగర్ సరస్సు, తాండవ భంగిమలో శివుని విగ్రహం కలిగిన శివుని ఆలయం, రహీలా సాగర్ సన్ టెంపుల్ మొదలుగునవి దర్శించదగ్గవి.

భైరవనాథ్ ఆలయం

భైరవనాథ్ ఆలయం

చిత్రకృప : Raj sachg

మనియ దేవి టెంపుల్

చందేల రాజ వంశీకుల రక్షకురాలిగా పరిగణించబడే మనియా దేవి విగ్రహం కలిగిన ఆలయం మనియ దేవి ఆలయం. మదన్ సాగర్ నది ఒడ్డున పీర్ ముబారక్ షా విగ్రహంకి సమీపంలో ఈ ఆలయం ఉంది. 18 అడుగుల ఎత్తు మరియు 1. 75 అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్ స్తంభము ఈ విగ్రహం యొక్క ముఖ్య లక్షణం.

యజ్ఞమండపం

యజ్ఞమండపం

చిత్రకృప : Rohit Saxena

విజయ్ సాగర్ పక్షి విహార్

11 వ శతాబ్దం ప్రాంతం లో మధ్యప్రదేశ్ కి చెందిన విజయ్ పాల్ చందేలా ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన విజయ్ సాగర్ నది ఒడ్డున ఉన్న బర్డ్ సాంచురీ విజయ్ సాగర్ పక్షి విహార్. నగరం నుండి ఈ సాంచురీ అయిదు కిలోమీటర్ల దూరం లో ఉంది. ఎన్నో రకాల పక్షి జాతులకి ఈ సాంచురీ నివాసం. జల క్రీడలని ఇష్టపడే వాళ్ళకి అలాగే ఈత ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్రాంతం అనువైనది.

శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు !

కక్రమథ్ ఆలయం

కక్రమథ్ ఆలయం

చిత్రకృప : Dr. Nizam

కక్రమథ్ ఆలయం

మదన్ సాగర్ లేక్ పైన ఉన్న ద్వీపం పై ఈ కక్రమథ్ ఆలయం ఉంది. ఉత్తరప్రదేశ్ లో మహోబా జిల్లాలో ని విష్ణు మూర్తి ఆలయానికి సమీపంలో ఈ ప్రాంతం ఉంది. పిరమిడ్ ని తలపించే నిర్మాణ శైలితో ఈ మందిర నిర్మాణం ఖజురహో ఆలయాలని తలపిస్తుంది. చందేలా సంప్రదాయాలని గుర్తుకుతెచ్చే స్మారక శిల్పం ఇక్కడ ఉంది.

 సన్ టెంపుల్

సన్ టెంపుల్

చిత్రకృప : Deepak Gupta

రహిలా సాగర్ సన్ టెంపుల్

సూర్య దేవుడికి అంకితమివ్వబడిన ఆలయం రహీల సాగర్ ఆలయం. రహీల సాగర్ కి పశ్చిమాన ఈ తొమ్మిదవ శతాబ్దపు ఆలయం ఉంది. పొరుగు రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీ.శ. 890 నుండి క్రీ.శ. 910 పాలించిన చందేలా అనే శక్తివంతమైన రాజు ఈ నిర్మాణాన్ని చేసారు. అద్భుతమైన ఈ గుడి ప్రస్తుతం శిధిలావస్థ లో ఉంది.

ఆలయంలోని శివలింగం

ఆలయంలోని శివలింగం

చిత్రకృప : Rohit klar

శివ తాండవ టెంపుల్

పేరు సూచిస్తున్నట్టుగానే శివ్ తాండవ ఆలయం మహా శివుడికి అంకితమివ్వబడినది. తాండవ భంగిమలో నాట్యం చేస్తున్నటువంటి శివుడి విగ్రహాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఒక నల్లటి గ్రానైట్ రాయి తో ఈ విగ్రహం నిర్మించారు. గోరఖ్ హిల్స్ నుండి రాలుతున్న తెల్లటి నీళ్ళతో అందంగా ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలో శివ తండావ్ బావి కూడా ఉంది.

కుల్పహార్ రైల్వే స్టేషన్

కుల్పహార్ రైల్వే స్టేషన్

చిత్రకృప : Varunkau

మహోబా ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మహోబా కు సమీపాన 55 కిలోమీటర్ల దూరంలో ఖజురహో విమానాశ్రయం కలదు. టాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి మహోబా చేరుకోవచ్చు.

రైలు మార్గం : మహోబా - ఖజురహో మధ్య కొత్త రైల్వే లైన్ మొన్నీమధ్యనే ఏర్పాటుచేశారు. ఢిల్లీ, లక్నో నుండి ఖజురహో వెళ్ళే రైళ్లన్నీ మహోబా లో ఆగుతాయి. 24 కిలోమీటర్ల దూరంలో కుల్పహార్ రైల్వే స్టేషన్ కూడా కలదు.

చంబల్ - ఒక అరుదైన లోయల అభయారణ్యం !

రోడ్డు మార్గం : మహోబా గుండా జాతీయ రహదారి 34 వెళుతుంది. ఆగ్రా నుండి 400 కి. మీ దూరంలో, ఖజురహో నుండి 72 కి. మీ ల దూరంలో ఉంది మహోబా. ఇక్కడికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X