Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు సమీపంలోని ఫిషింగ్ మరియు నేచర్ క్యాంప్ లు !

బెంగళూరు సమీపంలోని ఫిషింగ్ మరియు నేచర్ క్యాంప్ లు !

By Mohammad

కావేరి నది ... భారత దేశ ప్రధాన నదుల్లో ఒకటి మరియు జీవనది కూడా. కర్నాటక లోని పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉన్న కొడుగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం కావేరి నది జన్మస్థానం. కేవలం కర్నాటకకే కాదు తమిళనాడుకీ ఈ నది ప్రధానమే. కావేరి నది పరివాహ ప్రాంతాలు చాలానే ఉన్నాయి కానీ వాటిలో కొడుగు(కూర్గ్), శ్రీరంగ పట్టణం, బృందావన్ గార్డెన్, శ్రీరంగం, కుంభకోణం వంటి ప్రదేశాలు కొన్ని.

కర్ణాటకలో కావేరి నది చేసే సవ్వడులు అంతా ఇంతా కాదు. ఈ నది సహజ సిద్ధ ప్రకృతి అందాలకు నెలవు. దీని గుండా వీరప్పన్ దాగున్న చందనం అడవులు, జలపాతాలు ప్రకృతి ప్రేమికులకు వరమే. కావేరి నది ఒడ్డున యాత్రికులు ఆటపాటలు, ఫిషింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ మరియు అనేక సాహస క్రీడలు చేయవచ్చు. మరి ఇవన్ని చేయటానికి ప్రదేశాలు ఉండాలి కదా ?

ఇది కూడా చదవండి : కొత్త జంటల విహార కేంద్రం !

బెంగళూరు సమీపంలోని ఫిషింగ్ మరియు నేచర్ క్యాంప్ లు

పైన పేర్కొన్న అన్ని క్రీడలు కావేరి నది ఒడ్డున చేయటానికి కర్ణాటకలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవి భీమేశ్వరి, దొడ్డమాకలి, గాలిబోర్. ఈ ప్రదేశాలకు ఎక్కువగా యాత్రికులు ఫ్రెండ్స్ తో వస్తుంటారు. వచ్చిన వారికి నది పక్కనే బస (గుడారాలు), భోజనం ఏర్పాటు చేస్తారు. వీకెండ్ లో ఈ ప్రదేశాలకు మీరు ఫ్రెండ్స్ తో గాని, ఫ్యామిలీ తో గాని వెళ్ళి రోజువారి జీవితం నుండి ఉపశమనం, ఉత్సాహాన్ని పొందండి.

ట్రెక్కింగ్, ఫిషింగ్ క్యాంప్ లు

ట్రెక్కింగ్, ఫిషింగ్ మరియు క్యాంప్ చేయాలనుకొనే వారికి ఈ ప్రాంతాలు ఎంతో సురక్షితం. భీమేశ్వరి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డమాకలి వరకు ట్రెకింగ్ చేయవచ్చు. ఈ ట్రెక్కింగ్ మార్గంలో మీకు ఎన్నో రకాల పక్షులు విహరిస్తూ కనిపిస్తాయి. అలాగే భీమేశ్వరికి 16 కి.మీ. దూరంలో ఉన్న గాలిబోర్ కూడా ట్రెక్కింగ్ కు అనుకూలమే. ఈ మార్గంలో కావేరి నది వెంట అడవులలో ట్రెకింగ్ చేయవచ్చు. ఎంతో ఆనందకరమైన ఈ ట్రెకింగ్ మిమ్మల్ని మధురానుభూతులలోకి నెట్టి వేస్తుంది.

భిమేశ్వరి

భిమేశ్వరి

భీమేశ్వరి మంద్య జిల్లాలో ఒక చిన్న పట్టణంగా ఉంటుంది. బెంగుళూరు నుండి భీమేశ్వరి 100 కి.మీ. దూరంలో ఉంది. వారాంతపు సెలవులలో విహరించేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. మేకేదాటు మరియు శివనసముద్ర జలపాతాల మధ్య కల ఈ విహార ప్రదేశం వివిధ ఆకర్షణలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Ashwin Kumar

మీరు సాహసవంతులా?

మీరు సాహసవంతులా?

కావేరి నదిలో చేపలు పట్టడం ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం. ప్రత్యేకించి భీమేశ్వరిలో ఆటలాడే మహసీర్ చేపలు ఎంతో వినోదాన్ని కలిగిస్తాయి. ఈ ప్రదేశం ఒక చేపల స్వర్గం అని తెలియడంతో ఇక్కడ అనేక చేపల వేట కేంద్రాలు వెలిశాయి.

చిత్ర కృప : CraftmaticAdjustableBed

భీమేశ్వరి లో ఏజెన్సీలు

భీమేశ్వరి లో ఏజెన్సీలు

భీమేశ్వరిలో అనేక పర్యాటక ఏజన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఈ అటవీ ప్రాంతాన్ని తేలికగా సందర్శించి అక్కడ ఉండే లేళ్ళు, జింకలు,గుంటనక్కలు, చిరుతలు, ఎలుగులు, మొసళ్ళు వంటి జంతువులను ఎన్నింటినో సందర్శించి ఆనందించవచ్చు. ఈ ప్రదేశం దట్టమైన పచ్చటి అడవులు కలిగి ఎంతో లోతైన లోయలు కూడా కలిగి ఉంది.

చిత్ర కృప : telugu native planet

బల్లకట్టు ప్రయాణం

బల్లకట్టు ప్రయాణం

సాహసవంతులకు నదిపై బల్లకట్టు ప్రయాణం భీమేశ్వరిలో ఎంతో సురక్షితం. భీమేశ్వరి ఒక అద్భుత వినోద ప్రదేశం సహజ అందాలు, సాహసకార్యాలు కలబోసి ఉంటాయి. విశ్రాంతిగా అడవిలో జంతువులను చూసి ఆనందించవచ్చు. చేపలు పట్టవచ్చు. ట్రెక్కింగ్ చేయవచ్చు. కావేరీ నదిలో తెప్పల పడవలు వేసుకొని కావేరి నదిలో చేపలు పట్టటం ఒక మాధురానుభూతి.

చిత్ర కృప : Priya Singh

వసతి

వసతి

భీమేశ్వరి లో బస చేయటానికి వెదురు గుడిసెలు, కలప గుడిసెలు, గుడారాలు, కాటేజీ లు ఉన్నాయి. భోజనాలు చేయటానికి రెస్టారెంట్లు, హోటళ్లు వంటివి కూడా ఉన్నాయి. చేపలంటే ఇష్టపడేవారు వివిధ పద్దతుల్లో తయారుచేసిన రుచికరమైన చేపలను తినవచ్చు.

చిత్ర కృప : Zahid H Javali

సందర్శన సమయం

సందర్శన సమయం

భిమేశ్వరి ని సందర్శించటానికి అనువైన సమయం జూన్ నుండి ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి. ఇక్కడ మీరు చేపలు పట్టి ఆనందం చెందాలే తప్ప వాటిని మీ వెంట తీసుకెళ్లరాదు.

చిత్ర కృప : CraftmaticAdjustableBed

దొడ్డమకాలి

దొడ్డమకాలి

దొడ్డమకాలి కర్నాటక రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన విహార స్ధలం. ఈ ప్రాంతం భీమేశ్వరి ఫిషింగ్ కేంప్ నుండి 7 కి.మీ. ల దూరంలో ఉంది. బెంగుళూరు నగరానికి (132 కి.మీ.) దూరంలో ఉంది కనుక వీకెండ్ లో కార్యాలయాల్లో, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఎంతో తేలికగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.

చిత్ర కృప : Parth Bhatt

పర్యాటకులు దొడ్డ మకాలి ఎందుకు సందర్శిస్తారు?

పర్యాటకులు దొడ్డ మకాలి ఎందుకు సందర్శిస్తారు?

వన్య జీవుల సంచారం, పక్షుల విహారం మరియు మరెన్నో పక్షుల విహారాలకు నెలవుగా ఉంది. పక్షి ప్రియులకు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. అరుదైన బ్లాక్ బెల్లీడ్ రివర్ టెర్న్, ఓస్ప్రే, గ్రే ఫిష్ ఈగిల్, కింగ్ ఫిషర్, వడ్రంగి పిట్టలు, మైనాలు, బాతులు వంటివి ఎన్నో ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : Bharat Patil

జంతువుల సందర్శనకు ...

జంతువుల సందర్శనకు ...

జంతువుల సందర్శనకు దొడ్డమకాలి ప్రదేశం ఎంతో బాగుంటుంది. ఎలుగు బంటి, సంబార్, మచ్చల జింకలు, ఉడుతలు, చిరుతపులులు, ఏనుగులు, మలబార్ ఉడతలు, గుంట నక్కలు, పాములు మొసళ్ళు, తాబేళ్ళు, ఊసర వెల్లులు ఎన్నో కనపడతాయి.

చిత్ర కృప : Abhilash

చేపలు పట్టడం

చేపలు పట్టడం

మెల్లగా పారుతున్న కావేరి నదీ తీరం దొడ్డమకాలి లో చేపలు పట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. చేపలు పట్టడం, మరల వదిలేయడం ఇక్కడ అనేకమందిని ఆకర్షిస్తున్నది. మహసీర్ మరియు మరికొన్ని స్ధానిక జాతి చేపలు ఇక్కడ దొరుకుతాయి. చేపలు పట్టటానికి అవసరమయ్యే శిక్షణ కూడా లభిస్తుంది.

చిత్ర కృప : uskgrub

సాహస క్రీడలు

సాహస క్రీడలు

దొడ్డమకాలి సాహస క్రీడాభిమానులకు మంచి ప్రదేశం. ఈ ప్రాంతంలో నావలు నడపవచ్చు. కయాకింగ్, ర్యాఫ్టింగ్, మౌంటైన్ బైకింగ్, ట్రెక్కింగ్ వంటి ఆటలు దొడ్డమకాలిలో చేయటానికి అనుమతి ఉంది. దొడ్డమకాలి సందర్శించే ప్రకృతి ప్రియులు తరచుగా ఈ ప్రదేశంలో నడక సాగిస్తూ అక్కడే ఉన్న పురాతన శివాలయాన్ని సందర్శిస్తారు.

చిత్ర కృప : Sangamesh R

సందర్శన సమయం

సందర్శన సమయం

దొడ్డమకాలి సందర్శనకు అనుకూల సమయం జూలై, ఆగస్టు మరియు ఫిబ్రవరి నెలలు. వర్షాకాలం తర్వాత కూడా ఈ ప్రదేశం పచ్చగా ఉంటుంది అప్పుడు కూడా సందర్శకులు ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

చిత్ర కృప : vijayasimha_vyakarnam

గాలిబోర్

గాలిబోర్

కర్నాటకలోని బెంగుళూరుకు 110 కి.మీ. దూరంలో ఉన్న గాలిబోర్ కూడా ఫిషింగ్ మరియు నేచర్ క్యాంపులకు నిలయం. సంగం కు 10 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆర్కావతి మరియు కావేరి నదుల సంగమం స్థలం. నది ఒడ్డున ఉన్న పచ్చటి చెట్లు, కొండలు, చుట్టూతా పర్వతాలు, పచ్చని ప్రకృతి ఈ ప్రాంత అందాల్ని మరింత పెంచుతున్నాయి.

చిత్ర కృప : Pawan Rao

గాలిబోర్ పై పర్యాటకులకు ఎందుకు ఆసక్తి కలుగుతుంది?

గాలిబోర్ పై పర్యాటకులకు ఎందుకు ఆసక్తి కలుగుతుంది?

ప్రకృతిమాత ఒడిలో సేదతీరలనుకొనే వారు ఎక్కువగా గాలిబోర్ ప్రదేశానికి తరలివెళ్తారు. గాలమేసి చేపలు పట్టేందుకు ఇది అనువైన ప్రదేశం. ఇక్కడ కూడా చేపలు పట్టడం, వదిలేయటం మామూలుగా జరిగే తంతు. అయితే, పట్టిన చేపతో ఫొటో తీయడం, మరల దానిని నదిలో వదిలేయడం చేస్తారు యాత్రికులు.

చిత్ర కృప : telugu native planet

చేపలు పట్టడం

చేపలు పట్టడం

కావేరి నదిలో ఎక్కువగా మహాసీర్ చేపలను పట్టటానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇవే ఇక్కడ అధికంగా దొరుకుతాయి. దీనితో పాటు ఇంకా కార్ప్, కేట్ ఫిష్ వంటి చిన్న చేపలకు కూడా పట్టటానికి ప్రయత్నిస్తారు. సెలవుల సమయంలో చాలామంది ఇక్కడికి వచ్చి వీటిని పట్టుకొని ఆనందిస్తారు.

చిత్ర కృప : CraftmaticAdjustableBed

గాలిబోర్ ఎప్పుడు సందర్శించాలి?

గాలిబోర్ ఎప్పుడు సందర్శించాలి?

గాలిబోర్ లో బోట్ ప్రయాణాలు చాలా బాగుంటాయి. నీటి ఆట ఔత్సాహికులు అడవిలోతట్టు ప్రాంతాల్లో నదిలోకి వెళ్ళి కూడా ప్రయాణించవచ్చు. గాలిబోర్ ను సందర్శించాలంటే జూన్ మరియు ఆగస్టు నెలలు అనుకూలం. ఈ సమయంలో నీటి ఆధారిత పక్షులు అనేకం అక్కడకు వస్తాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి మే మధ్య వరకు చేపలు పట్టేందుకు అనుకూలమే.

చిత్ర కృప : uskgrub

జలపాతాలు

జలపాతాలు

దొడ్డమకాలికి దగ్గరలో మేకేదాటు జలపాతాలు, సంగం మరియు సింషా జలపాతాలున్నాయి. వీటి వద్దకు వెళ్ళి నీటిలో ఆడుకోవచ్చు.

చిత్ర కృప : Vignesh Ganesan

ఫిషింగ్ క్యాంప్ లకు ఎలా చేరుకోవచ్చు

ఫిషింగ్ క్యాంప్ లకు ఎలా చేరుకోవచ్చు

పైన పేర్కొన్న మూడు శిబిరాలకి దగ్గరి విమానాశ్రయం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. సమీప రైల్వే స్టేషన్ మైసూర్ లో కలదు. రోడ్ జర్ని మరింత సరదాగా ఉండాలంటే ప్రవేట్ లేదా సొంత వాహనాల్లో ప్రయాణించి ఆనందించవచ్చు.

చిత్ర కృప : Sanjib Mitra

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X