Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

నగరంలో ఇంత ఎత్తులో కల ఈ ఓంకార్ కొండలు చాలా మందికి తెలియవు. ఈ ప్రదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలు అద్భుతంగా వుంటాయి. ఇంత అద్భుత దృశ్యాలే కాక ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కలదు.

By Mohammad

బెంగుళూరు ను 'సిలికాన్ వాలీ అఫ్ ఇండియా' అంటారు. ఇది కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇక్కడ ప్రపంచంలో నలుమూల నుండి ప్రజలు వచ్చి ఐ.టి. రంగంలో, వ్యాపార రంగంలో మరియు ఇతర రంగాలలో ఉపాధిని సంపాదించుకొని జీవిస్తూ ఉన్నారు. ఈ నగర సౌకర్యాలు, సుఖాలు, ప్రదేశాలు ఎటువంటి వారినైనా సరే యిట్టె కట్టిపడేస్తాయి. పర్యాటకులు సైతం బెంగుళూరు నగర పర్యటనకు మరలా మరలా రావటానికి ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.

ఎప్పుడు వచ్చినా పర్యాటకులు తప్పక సందర్శించే ప్రదేశాలు బెంగళూరు లో కొన్నే ఉన్నాయి. మరి ఎల్లపుడూ చూసిన ప్రదేశాలే కాక, ఇక్కడ అనేక ప్రదేశాలు అరుదుగా చూసేవి కొన్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాం చదివి ఆనందించండి.

బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

మహాబోధి సొసైటీ

మహాబోధి సొసైటీ బెంగుళూరు లోని గాంధీనగర్ లో ఒక బిజి ప్రాంతంలో కలదు. ఒక్కసారి ప్రవేశిస్తే చాలు, మీ బిజి లైఫ్ టెన్షన్ లు అన్నీ మాయం అయినట్లే. ఈ భవనంలో ఒక పెద్ద సమావేశపు హాలు, ఒక స్తూపం, ఒక బోధి చెట్టు వుంటాయి. బోధి చెట్టు కింద అందమైన బుద్ధ విగ్రహం ఒకటి వుంటుంది. ఈ ప్రదేశం అతి విశాలమైనది కాకపోయినప్పటికీ పరిసరాలు మీకు బిజి లైఫ్ నుండి ప్రశాంతతకు జీవం పోస్తాయి. అక్కడ కల బౌద్ధ సన్యాసులు, చిరునవ్వులు చిందించే విద్యార్ధులు, ఆత్మ జ్ఞానం కోరే భక్తులు, ప్రశాంత కొరకు వచ్చే సందర్శకులు, అంతా కలిపి మరో ప్రపంచంగా వుంటుంది.

బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

చిత్రకృప : Sagar Sakre

ఓంకార్ హిల్స్

నగరంలో ఇంత ఎత్తులో కల ఈ ఓంకార్ కొండలు చాలా మందికి తెలియవు. ఈ ప్రదేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలు అద్భుతంగా వుంటాయి. ఇంత అద్భుత దృశ్యాలే కాక ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కలదు. దీని కింద అనేకమంది భారతీయ ఋషుల విగ్రహాలు కలవు. మరో ఆకర్షణగా ఇక్కడ పెద్ద గడియారం కలదు. ప్రతి గంటకు గంటలు కొడుతుంది. ప్రపంచంలోని అతి పెద్ద బిగ్ బెన్ క్లాక్ తర్వాత ఈ క్లాక్ పెద్దదని చెపుతారు. ఇటీవలే ఇక్కడ నిర్మించబడిన జ్యోతిర్లింగ దేవాలయం మహాశివరాత్రి రోజు వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

చిత్రకృప : Pranabandhu Nayak

పిరమిడ్ వాలీ

పిరమిడ్ వాలీ కనకపుర తాలుక హరోహళ్లి లో కలదు. బెంగుళూరు నగర సరిహద్దులలో వుంటుంది. దీనిని మొదటగా మైత్రేయ - బుద్ధ విశ్వాలయం అనేవారు. వాడుకలో ఇపుడు పిరమిడ్ వాలీ అంటున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ధ్యాన పిరమిడ్ ఇక్కడ కలదు. ఇది ఒక అంతర్జాతీయ ధ్యాన కేంద్రం. ఏ సమయంలో అయినా సరే, సుమారు 5,000 మంది ధ్యానులు ఒకేసారే ఈ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేయవచ్చు. విశ్వశాంతి వ్యాప్తికి ప్రతి ఒక్కరూ ఒక సారి ఈ ప్రదేశం లో కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఇక్కడి నిశ్శబ్దత, ప్రశాన్తతలు మీ మనస్సుకు ప్రశాంతతను చేకూర్చి, మరువలేని తాజా అనుభూతులను ఇస్తాయి. చల్లని నీడనిచ్చే వృక్షాలు, వివిధ రకాల రాళ్ళు, నీటి ప్రవాహాలు, చక్కని గాలులు కల ఈ వాతావరణం మిమ్మల్ని ధ్యాన లోకాలకు తీసుకు వెళుతుంది.

బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

చిత్రకృప : Krishansubudhi

బిగ్ బనయాన్ ట్రీ

పెద్ద మర్రి చెట్టు. దీనిని కన్నడ భాషలో దొడ్డ ఆలద మర అంటారు. ఈ ప్రదేశం మీరు బెంగుళూరులో వుంటే వారాంతపు విహారాలకు అనువుగా వుంటుంది. బెంగుళూరు వెస్ట్ లోని రామోహళ్లి గ్రామంలో కల ఈ అతి పెద్ద వృక్షం మూడు ఎకరాల భూమిలో విస్తరించి వున్నది. ఈ చెట్టు 400 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. నిర్వహణ సరిగా లేకపోయినప్పటికీ ఈ చెట్టు అనేకమందికి నీడ నిచ్చి పర్యాటకులకు ఆహ్లాదత కలిగిస్తోంది.

బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

చిత్రకృప : Pavithrah

బెంగుళూరు ఫోర్ట్

బెంగుళూరు ఫోర్ట్ నగర నడిబొడ్డున కలదు. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నప్పటికీ, పర్యాటకులు అరుదుగా వస్తారు. బెంగుళూరు వ్యవస్థాపకుడైన కెంపే గౌడా, ఈ ఫోర్ట్ ను బురద మట్టితో 1537 సంవత్సరంలో నిర్మించాడు. దీనిని తర్వాత హైదర్ ఆలి 1761 సంవత్సరంలో రాతి కోటగా మార్పు చేసాడు. బ్రిటిష్ వారు ఈ కోటలో కొంత భాగాన్ని పడగొట్టారు. నేటికి అక్కడ ఒక ఢిల్లీ గేటు , రెండు కోట బురుజులు మిగిలాయి. కోటలో చాలా భాగం ధ్వంసం అయినప్పటికీ, మిగిలిన అవశేషాలు చరిత్ర ప్రాధాన్యతను గుర్తు చేస్తాయి. అతి పురాతనమైన ఈ చారిత్రక కోటను బెంగుళూరు వారాంతపు సెలవులలో తప్పక చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X