అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

"విమానంలో ప్రయాణం....ఒక్క రోజులోనే ఏడుకొండల వాడి దర్శనం"!

Written by: Venkatakarunasri
Updated: Friday, May 12, 2017, 16:38 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.

Latest:కలియుగ అంతానికి కారణమయ్యే గుడి!

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

ఇది కూడా చదవండి: శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువుగా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు.

ఇది కూడా చదవండి: తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

తిరుపతికి విమానంలో.. రాష్ట్రపర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజి!

1. శ్రీమహావిష్ణువు దర్శనార్ధం

ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు.

ఇది కూడా చదవండి: తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

pc:official website

 

2. ఆనంద పర్వతం

మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది.

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

pc:official website

 

3. వేంకటాద్రి పర్వతం

ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

ఇది కూడా చదవండి: శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా ?

pc:official website

 

4. తిరుపతికి విమానంలో వెళ్దాం!

రాష్ట్రపర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజి ఒక్కరోజులోనే ఏడుకొండలవాడి దర్శనం రాష్ట్రపర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజి, 2 రోజుల క్రితం స్పైస్ జెట్ సేవలు ప్రారంభం, ఒక్కరోజులోనే ఏడుకొండలవాడి దర్శనం, వారం తర్వాతఆన్ లైన్ లో బుకింగ్ సేవలు.

24 గంటల్లో శ్రీశైలం - తిరుపతి దర్శనం ఎలా ?

pc:official website

 

5. "విమానంలో ప్రయాణం"

ఒక్క రోజులోనే ఏడుకొండల వాడి దర్శనం..త్రీస్టార్ హోటళ్ళలో వసతి, భోజనం,కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర.. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించిన ‘తిరుపతి టూర్‌'ప్రత్యేకతలివి. టూరిజం శాఖ స్పైస్‌ జెట్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

తిరుపతిలో కొలువైన వెంకటేశ్వరుడు !!

pc:Ashok Prabhakaran

6. టూరిజం శాఖ

సేవలను ఈ నెల ఐదున లాంఛనంగా ప్రారంభించింది. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. ఒక రోజు ప్యాకేజీ విలువ రూ.9,999. రెండు రోజుల ప్యాకేజీ ధర రూ.12,999. టికెట్లు టూరిజం శాఖ కార్యాలయాల్లో బుక్‌ చేసుకోవచ్చు. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు.

తిరుపతి సమీప జలపాతాలు !

pc:Babin.sap

 

7. ప్యాకేజీలు ఎలా వుంటాయంటే..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 6:55 గంటలకు గగనతల యాత్ర మొదలవుతుంది. ఉదయం 8:10గంటలకి తిరుపతికి, 9:30లోపు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం తర్వాత సాయం త్రం 5:30కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి. రాత్రి 7:45కు హైదరాబాద్‌ వస్తారు.

ఇది కూడా చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడండి ... తరించండి !

pc:Athlur

 

8. ప్యాకేజీలు ఎలా వుంటాయంటే..

రెండు రోజుల ప్యాకేజీలో ఉద యం 9:25కి హైదరాబాద్‌లో ప్రయాణం మొదలవుతుంది. అదే రోజు శ్రీకాళహస్తి, కాణిపాకం సందర్శన, మరుసటి రోజు శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటాయి. సాయంత్రం 6:35కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7:45కు హైదరాబాద్‌ చేరుకోవచ్చును.

ఇది కూడా చదవండి :తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడ వుందో మీకు తెలుసా ?

pc:Ashwin Kumar

 

9. బుకింగ్‌ కోసం సంప్రదించాల్సిన నంబర్లు..

టికెట్లు బుక్‌ చేసుకోవాలనుకునే వాళ్లు సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌:9848540371, 040- 29801039, ట్యాంక్‌బండ్‌-9848125720, పర్యాటక భవన్‌- 9848306435, శిల్పారామం- 9666578880, కూకట్‌పల్లి- 9848540374, సికింద్రాబాద్‌ యాత్రి నివాస్‌- 9848126947, వరంగల్‌-08702562236, నిజామాబాద్‌ 08462224403లను సంప్రదించవచ్చు.

అలిపిరి నుండి తిరుమలకు మెట్ల మార్గం !

pc:Athlur

 

10. ఎలాంటి ఇబ్బందులు ఉండవు!

తిరుపతికి గగనతల ప్యాకేజీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా టూరిస్టులను హైదరాబాద్‌కు చేరుస్తారు. అందులో భాగంగానే ట్రావెల్‌ ఏజెన్సీలు, హోటళ్లు, ఆలయాల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వసతులు కూడా ఏర్పాటు చేశారు. నాణ్యమైన సేవలు అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తిరుపతి సమీప జలపాతాలు !

pc:Praveen

 

English summary

Fly to Tirumala Tirupati - Telangana Tourism Special Flight Package !

Tirumala is a census town in Chittoor district of the Indian state of Andhra Pradesh. The town is a part of Tirupati Urban Development Authority and located in Tirupati (rural) mandal of Tirupati revenue division.It is a hill town where Tirumala Venkateswara Temple is located, which is the abode of Lord Venkateswara.
Please Wait while comments are loading...