Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక లో ఎక్కడ ఎక్కడ ఏమి తినాలి ?

కర్నాటక లో ఎక్కడ ఎక్కడ ఏమి తినాలి ?

నూరు ఊరించు కుంటూ తిండ్లు తినే వారికి కర్నాటక రాష్ట్రం ఎంతో రుచికరమైన డిష్ లు అందిస్తుంది. రుచికరమైన ఈ డిష్ లు కొన్ని ప్రదేశాలలో మాత్రమే రుచికరంగా వుంటాయి. ఆ ప్రదేశాలు ఆయా వంటకాలకు ప్రసిద్ధి చెందాయి. కనుక కర్ణాటకలో ట్రావెల్ చేసేటపుడు, ఈ డిష్ లు తినటం మరచిపోకండి.

మైసూరు పాక్

మైసూరు పాక్

కమ్మని నెయ్యి, షుగర్, శనగ పిండి లతో తయారు చేసే తీపి మైసూరు పాక్ తింటే మైసూరు లో తినాలి. పాక్ లేదా పాకం అంటే తియ్యనైన షుగర్ పాకం అని అర్ధం. చరిత్ర మేరకు ఈ మైసూరు పాక్ ను ఒకప్పుడు మైసూరు వంటశాల లో మైసూరు మహారాజు తినటం కొరకు చేసేవారు. అద్భుతమైన ఈ రుచికి మెచ్చిన మైసూరు రాజు ఈ స్వీట్ ను సామాన్యులకు కూడా పాలస్ లో బయటి దుకాణాలలో లభ్యంగా ఉంచమని ఆర్డర్ వేశాడట.

 దావనగిరి ...వెన్న దోసె

దావనగిరి ...వెన్న దోసె

వెన్న దోసెలు పుట్టింది దావనగిరి నగరంలో. వెన్న అంటే ఇంగ్లీష్ లో బటర్ అంటారు. ఇది సాధారణ దోసె కంటే కొంచెం పెద్దదిగా వుండి అదనంగా వెన్న పూయబడుతుంది.
Pic credit: Wiki Commons

మద్దూర్ ...వడ

మద్దూర్ ...వడ

మద్దూర్ వడకు ఆ పేరు మండ్య జిల్లాలోని మద్దూర్ అనే ఊరు పేరు పై వచ్చింది. నోరూరే రుచులు కల దీనిని బియ్యపు పిండి, మినపప్పూ, మైదా పిండి కలిపి తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, తురిమిన కొబ్బరి, ఇంగువ లతో కలిపి చేస్తారు.
Pic credit: Wiki Commons

జోళద రొట్టె

జోళద రొట్టె

ఈ రొట్టి ఉత్తర కర్నాటక రాష్ట్రంలో ఫేమస్. పలుచగా, మెత్తగా వుండి తేలికగా తినేలా వుంటుంది. దీనిని జొన్నలతో తయారు చేస్తారు. ఇది ఉత్తర కర్నాటక వారి ప్రధాన ఆహారం. దీనిని ఇతర కూరలు, పచ్చళ్ళు తో కలిపి తింటారు.
Pic credit: Wiki Commons

 ధారవాడ పేడ

ధారవాడ పేడ

కర్నాటక లోని ధారవాడ వెలుతున్నారా...? అక్కడి పేడ తినటం మరువకండి. ఈ స్వీట్ కు 175 సంవత్సరాల చరిత్ర కలదు. 19 వ శతాబ్దంలో ఠాకూర్ కుటుంబం మధ్య ప్రదేశ్ లోని ఉన్నావో నుండి ధార్వాడ కు వలస వచ్చిన తర్వాత వారి స్వీట్ అయిన ఈ పేడ ఈ ప్రాంతంలో తయారు చేయబడి శ్రీ రాం రతన్ సింగ్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇతని మనుమడు బాబు సింగ్ ఠాకూర్ కూడా ఈ స్వీట్ కు గల పేరు పెంపొందించాడు. ఈ పేడ తయారీలోని రహస్యాలు చాలా కాలం ఎవరికీ తెలియదు.
Pic credit: Wiki Commons

మంగళూరు గోలి బజ్జి

మంగళూరు గోలి బజ్జి

మధ్యాహ్నాలు టీ తాగేట పుడు తినే ఈ గుండ్రటి, చిన్న గోలీలా వంటి స్నాక్స్ మంగళూరు గోలి బజ్జి. దీనిని మైదా, పెరుగు, బియ్యపు పిండి, తరిగిన ఉల్లి, కొత్తిమీర ఆకులు, కొబ్బరి, జీర,గ్రీన్ చిల్లి , సాల్ట్ లతో చేస్తారు. ఒకటి తినటం మొదలు పెడితే చాలు, ఎన్ని అయినా సరే తినేయ బుద్ధి వేస్తుంది.
Pic credit: Wiki Commons

బిడది తట్టే ఇడ్లి

బిడది తట్టే ఇడ్లి

బిడది బెంగుళూరు - మైసూరు హై వే లో కల ఒక చిన్న టవున్. రామానగరం తాలూక కిందకు వస్తుంది. ఇక్కడ పొటాటో సాగు మరియు రెడ్ చట్నీ అంటే ఎండు మిర్చి, వెల్లుల్లి కలిపి చేసిన చట్నీ లతో కలిపి ఇచ్చే ఈ డిష్ తింటే నోరు ఊరాల్సిందే. మరీ మరీ తినాల్సిందే.
Pic credit: Wiki Commons

నీర్ దోసెలు

నీర్ దోసెలు

నీర్ దోసె కు అర్ధం చెప్పాలంటే, 'నీటి దోసె' అని చెప్పాలి. రుచికరమైన ఈ వంటకం కర్నాటక లోని తుళు నాడు ప్రదేశానిది. మంచి రుచికల ఈ దోసె ఒక్కటి తింటే, కడుపు నిండి పోతుంది.
Pic credit: Shutterstock Images

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X