Search
  • Follow NativePlanet
Share
» »గాంధీనగర్ - గుజరాత్ రాష్ట్ర రాజధాని !!

గాంధీనగర్ - గుజరాత్ రాష్ట్ర రాజధాని !!

చండీగఢ్ తరువాత, గాంధీనగర్ భారతదేశంలో రెండవ ఉత్తమ ప్రణాళికాబద్ధమైన నగరం. ప్రముఖ సందర్శనీయ స్థలాలు : అక్షరధామ్ ఆలయం, అదాలాజ్ మెట్ల బావి, డైనోసార్ పార్క్.

By Mohammad

పర్యాటక ప్రదేశం : గాంధీనగర్

రాష్ట్రం : గుజరాత్

ప్రముఖ సందర్శనీయ స్థలాలు : అక్షరధామ్ ఆలయం, అదాలాజ్ మెట్ల బావి, డైనోసార్ పార్క్

సబర్మతి నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న గాంధీనగర్ గుజరాత్ కి కొత్త రాజధాని. పాత బాంబే రాష్ట్రము మహారాష్ట్ర, గుజరాత్ గా విభజించబడి, 1960 లో స్వతంత్రం వచ్చిన తరువాత గాంధీనగర్ గుజరాత్ రాజధానిగా ఎ౦పికచేయబడింది.

జామ్ నగర్ - 'సిటీ ఆఫ్ జామ్స్' !!జామ్ నగర్ - 'సిటీ ఆఫ్ జామ్స్' !!

రెండవ ఉత్తమ ప్రణాళికాబద్ధమైన నగరం

గాంధీనగర్ అన్ని విభాగాలలో, రోడ్లు, మార్కెట్లు, సరైన నివాస ప్రాంతాలతో వాస్తురీత్యా బాగా ప్రణాళిక చేయబడిన నగరం. ఈ నగరం భారతదేశ వాస్తుశిల్పులైన హెచ్.కే.మేవాడా, ప్రకాష్ ఎమ్ ఆప్టే అనే ఇద్దరు వాస్తు శిల్పుల ఆధ్వర్యంలో ప్రణాళికను తయారుచేసి, నిర్మించారు. చండీగఢ్ తరువాత, గాంధీనగర్ భారతదేశంలో రెండవ ఉత్తమ ప్రణాళికాబద్ధమైన నగరం.

అక్షరధామ్ ఆలయం

అక్షరధామ్ ఆలయం

అక్షరధామ్, గుజరాత్ లోని గొప్ప ఆలయాలలో ఒకటి. ఇది భక్తి, నిర్మాణ౦, కళలు, ప్రదర్శనల అరుదైన కలయిక. శ్రీమన్నారాయణుడు ఈ ఆలయ ప్రధాన దేవత. గాంధీనగర్ సందర్శించే పర్యాటకులు ఈ ఆలయం వంటి, ఆశ్చర్యపరిచే అందమైన ఈ కట్టడాన్ని తప్పక చూస్తారు.

చిత్రకృప : Harsh4101991

ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్కు

ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్కు

భారతదేశ జురాసిక్ పార్కుగా పిలువబడే ఇంద్రోడా డైనోసార్, ఫాసిల్ పార్కు మరో ఆసక్తికరమైన పర్యాటక కేంద్రం. ఈ ప్రాంతం డైనోసార్ గుడ్లకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉత్పత్తి కేంద్రం. ఈ పార్క్ సబర్మతి నది ఒడ్డున సుమారు 400 హెక్టేర్ల లలో కలదు. ఇది ఇండియా లోని ఒకే ఒక డైనోసార్ మ్యూజియం.

చిత్రకృప : FabSubeject

మహాత్మా మందిర్

మహాత్మా మందిర్

జాతిపిత మహాత్మా గాంధీ కి అంకితం చేసిన ఈ మహాత్మా మందిర్, గుజరాత్ ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన ఒక కేంద్రం. మహాత్మా గాంధీ గురించి, సాహిత్యం గురించి, బాపూజీ జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ ప్రదర్శన ఉపయోగపడుతుంది.

చిత్రకృప : Adityamadhav83

సరిత ఉద్యాన్

సరిత ఉద్యాన్

సరిత ఉద్యాన్, గాంధీనగర్ లో 9 సెక్టార్ లో ఉంది. ఇది ప్రయాణీకులు, పర్యాటకులలో ప్రసిద్ధ విహార స్థలం. ఈ ప్రాంతం ప్రత్యేకంగా వినోద కార్యకలాపాల కోసం నిర్మించబడింది. సంవత్సరం పొడవునా సరిత ఉద్యాన్ ని సందర్శించవచ్చు.

చిత్రకృప : Raj Odedra

ఆదాలాజ్ మెట్ల బావి

ఆదాలాజ్ మెట్ల బావి

గాంధీనగర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదాలాజ్ మెట్ల బావి హిందూ భావి. ఇది అద్భుతమైన నిర్మాణానికి, కష్టమైన చేక్కుళ్ళకు పేరుగాంచింది. దీని అనూహ్యమైన నిర్మాణ శైలి కారణంగా, మధ్యాహ్నం సమయంలో కొంతసమయం మినహా సూర్యరస్మి ప్రత్యక్షంగా సాధారణంగా ఈ మెట్లను తాకదు.

చిత్రకృప : Tin-Tin Azure

శామ్లాజి

శామ్లాజి

గుజరాత్ లోని సబర్కంత జిల్లాలో గాంధీనగర్ దగ్గర శామలాజీ మందిరం ఉంది. సాక్షి గోపాల్ లేదా గదాధరుడు ఈ ఆలయ ప్రధాన దేవత. ఆవుల విగ్రహాలను పూజించే అరుదైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి.

చిత్రకృప : Deepak Patil

కళాకారుల గ్రామం

కళాకారుల గ్రామం

కళాకారుల గ్రామం, గాంధీనగర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెటాపూర్ లో ఉంది. ఒకప్పుడు బాంధిని చీరలకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామం. ఈ చీరెలు ఇక్కడి నుండి సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయబడతాయి.

చిత్రకృప : beccapie

గాంధీనగర్ ఎలా చేరుకోవాలి ?

గాంధీనగర్ ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం

గాంధీనగర్ నుండి సమీపం లోని అహ్మదాబాద్, రాజ్ కోట్ వంటి ప్రదేశాలకు తరచుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు కలవు.

రైల్వే స్టేషన్

గాంధీనగర్ లోని ఖిదోయర్ మందిర్ రైలు స్టేషన్ ఇది.14 కి. మీ. ల దూరం లో కలదు. సమీపం లోని అహ్మదాబాద్ నుండి వివిధ ప్రదేశాలకు రైళ్ళు కలవు.

ఎయిర్ పోర్ట్

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయి పటేల్ ఎయిర్ పోర్ట్ సమీపం గా వుంటుంది. ఇక్కడ నుండి స్థానికంగానే కాక విదేశాలకు కూడా విమానాలు నడుస్తాయి.

చిత్రకృప : Gaurav.raval

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X