Search
  • Follow NativePlanet
Share
» » పంచేంద్రియాల తోట లో పలు రకాల ఆకర్షణలు !!

పంచేంద్రియాల తోట లో పలు రకాల ఆకర్షణలు !!

ఢిల్లీ నగరం కొన్ని విశేష ఆకర్షణలు కలిగి వుంది. వాటిలో కొన్ని చెప్పాలంటే, అవి పంచేంద్రియాల తోట, ఇందిరా గాంధీ మ్యూజియం, ఖూని దర్వాజా, ఎయిర్ ఫోర్సు మ్యూజియం వంటివి. పంచేంద్రియాల తోట లేదా గార్డెన్ అఫ్ ఫైవ్ సెన్సెస్ అనే దానిని మొఘల్ గార్డెన్ .

దీనిని సందర్శకులకు తమ దృష్టి, వాసన, వినికిడి, రుచి, స్పర్శ అనబడే పంచేంద్రియాల అనుభవాలకు గాని నిర్మించారు.

మరి ఢిల్లీ నగరం లోని విశిష్ట ఆకర్షనలలో ఒకటైన ఈ పంచేంద్రియాల తోట గురించిన కొన్ని చిత్ర సహిత విశేషాలను తెలుసుకోనండి.

ఢిల్లీ హోటల్ వసతుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పంచేంద్రియాల తోట పలు ఆకర్షణలు !

పంచేంద్రియాల తోట పలు ఆకర్షణలు !

పంచేంద్రియాల తోట ఎక్కడ వుంది ?
ఢిల్లీ లోని పంచేంద్రియాల తోట సాకేత్ ఎదురుగా సయ్యద్ ఉల్ ఆజైబ్ గ్రామం లో మేహరౌలి - బాదర్ పూర్ రోడ్ లో కలదు. సాకేత్ మెట్రో స్టేషన్ నుండి ఒక కి. మీ. దూరంలో కలదు.

Photo Courtesy: Kprateek88

 పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

కన్నులకు విందు
రంగు రంగుల ఈ తోట నిజంగా సందర్శకులకు ఒక కను విందు. వివిధ రకాల పూవులు కల తోట. సుమారు రెండు వందలకు పైగా కల అనే క మొక్కలు, కదంబ, కలపాక, కేంఫర్ మరియు రుద్రాక్ష వంటి ఔషధ మూలికల చెట్లు. తోటంతా రంగుల మయంగా వుండి కన్నులకు విందు చేస్తుంది.
Photo Courtesy: Rajkumar1220

 పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

ముక్కులకు సువాసన
తోటలోని మొక్కల సుగంధపు వాసనలు మీ ముక్కులకు అమోఘంగా వుంటాయి. వాసనల ఆఘ్రానతలకు మరిన్ని సంవత్సరాలు జీవించాలనే కోరిక పుడుతుంది. Photo Courtesy: Rajkumar1220

 పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

నోటికి రుఛి
ప్రధాన తోట భాగంలో ఒక ఫుడ్ కోర్ట్ కలదు. ఇక్కడ మీరు కోరే అద్భుత రుచుల ఆహారాలు మీ నోటి రుచులు ఊరేలా చేస్తాయి. కూర్చుని తినేందుకు ప్రత్యేక అమరికలు కల ఏర్పాట్లు అమోఘంగా వుంటాయి. కూర్చుని విశ్రాంతిగా రుచులు ఆనందిస్తూ వివిధ రకాల డిష్ లు ఆరగించండి.
Photo Courtesy: Eddie Welker

 పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

చెవులకు వీనుల విందు
ఇక్కడ ఒక పెద్ద చెట్టు కలదు. దానికి లెక్క లేనన్ని మృదు మధుర గంటలు కలవు. అవి చేసే మెత్తటి ధ్వనులు లేదా సంగీతం మీరు ఈ పంచేంద్రియాల తోటలో పూర్తి విశ్రాంతి పొందేందుకు సహకరిస్తాయి,

Photo Courtesy: Prabhat nhpc

 పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

స్పర్శ ఆనందం
పంచేంద్రియాల తోటలో స్పర్శ ఆనందం పొందాలనుకుంటున్నారా ? ఈ ఇరవై ఎకరాల తోటలో విహరించండి. అక్కడ పూవులా, ఔషధ మొక్కల స్పర్శలను అనుభవించండి. ప్రకృతిలో మమేకం అవండి. ఢిల్లీ లోని ఈ పంచేంద్రియాల తోట ఒక అద్భుత ఆకర్షణ. Photo Courtesy: Rajkumar1220

 పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

పంచేంద్రియాల తోట లో పలు ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు
పంచేంద్రియాల తోటలో ఇతర ఆకర్షణలు, సంస్కృతి కేంద్ర మ్యూజియం (1 కి.మీ.), మేహరౌలి అర్కేలాజికల్ పార్క్ (2 కి.మీ.) ఛాత్రపూర్ టెంపుల్ (2.1 కి. మీ.).

ఢిల్లీ ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

Photo Courtesy: Nikhilchandra81

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X