Search
  • Follow NativePlanet
Share
» »రెండవ హనీమూన్ ఎక్కడకు వెళ్ళాలి ?

రెండవ హనీమూన్ ఎక్కడకు వెళ్ళాలి ?

జీవితంలో రొమాన్స్ అనేది మరచి పోతున్నాం ! ఈ విషయం ఎంతమంది ఒప్పుకుంటారు ? నేటి జీవనం అంతా ఉరుకులు, పరుగులు శృంగారం అనేది వెనుకంజ వేసింది. సంపాదన, కెరీర్ వంటివి దూసుకు వెళుతున్నాయి. మరి మా నేటివ్ ప్లానెట్ సూచించే ఈ ప్రదేశాలను సందర్శించి మీలోని ఈ రొమాన్స్ వేడి మరొక్కసారి వెలిగించండి. కుటుంబాన్నించి దూరంగా, మీరు మీ జీవిత భాగస్వామి ఇరువురూ ఇండియా లో ఆనందించ దగిన ప్రదేశాలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేకం.

ఇక్కడ సుమారు 20 ప్రదేశాలను మీకు అందిస్తున్నాం. మరి పరిశీలించి మీకు అనుకూలమైన ప్రదేశానికి మరోమారు లగేజ్ సర్ది సరికొత్త ఆనందాలు పొందండి.

శ్రీనగర్

శ్రీనగర్

శ్రీనగర్ ను జమ్మూ , కాశ్మీర్ యొక్క సమ్మర్ కేపిటల్ గా చెపుతారు. ఇక్కడకల మొగల్ గార్డెన్స్, సరస్సులు, ఇతర ఆకర్షణలు జంటలకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.

గుల్మార్గ్

గుల్మార్గ్

మీరు కనుక అడ్వెంచర్ ఇష్టపడే జంట అయితే, గుల్మార్గ్ లో మరోసారి రొమాన్స్ బాగుంటుంది. ఈ ప్రదేశం జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా లో కలదు.

లడఖ్

లడఖ్

లడఖ్ ప్రదేశ అందాలు, సహజ పరిసరాలు మీకు ఎంతో ప్రశాంత సమయాన్ని ఇస్తాయి. మీరు ఈ ప్రదేశంలో మీ ప్రియమైన వారితో ఎంత సేపైనా సమయం గడిపేయవచ్చు.

Photo Courtsey: hamon jp

మనాలి

మనాలి

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రదేశం ఒక బెస్ట్ టూరిస్ట్ స్పాట్. ఇండియా లోనే అత్యధికంగా సందర్శించ బడే హనీమూన్ ప్రదేశం. శృంగార సమయానికి మనాలి ఖచ్చితమైన ప్రదేశం.

ధర్మశాల

ధర్మశాల

జమ్మూ కాశ్మీర్ కు శ్రీనగర్ ఒక సమ్మర్ కేపిటల్ అయితే, హిమాచల్ ప్రదేశానికి ధర్మశాల వింటర్ కేపిటల్ గా చెప్పాలి. సహజ సుందర దృశ్యాల ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన కాంగ్రా వాలీ కి ప్రవేశ ద్వారంగా వుంటుంది.

ఔలి

ఔలి

తెల్లని మంచులో సాహస క్రీడలు ఇష్టపదేవారికి ఔలి చక్కటి ప్రదేశం. ఒడి ఒక మంచి స్కైఇంగ్ ప్రదేశం. తెల్లని మంచుచే కప్పబడిన ఈ ప్రదేశానికి మీరు వెళితే, స్కైఇంగ్ తప్పక ప్రయత్నం చేయండి.

ఫోటో క్రెడిట్ : Mandeep Thander

నైనిటాల్

నైనిటాల్

ప్రకృతి ప్రియులకు నైనిటాల్ ఒక స్వర్గం లా వుంటుంది. ఈ ప్రదేశాన్ని పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. ఎన్నో సరస్సులతో, సుందర దృశ్యాలతో నైనిటాల్ సరస్సుల జిల్లా గా పేరు పొందింది. ప్రకృతితో మమేకం అవ్వాలంటే, జంటలకు నైనిటాల్ చక్కటి ప్రదేశం.

జైసల్మేర్

జైసల్మేర్

బంగారు నగరం గా ప్రసిద్ధి చెందినా జైసల్మేర్ మీ రెండవ హనీమూన్ మధుర క్షణాలకు అద్భుతంగా వుంటుంది. ఇక్కడ కల ఎన్నో చారిత్రక రాజ భవనాల లో మీరు ఆనందించవచ్చు. ఎడారులలో ఒంటరిగా విహరించవచ్చు.

ఉదయపూర్

ఉదయపూర్

నీలి రంగు తో ఆకర్షణీయంగా వుండే ఉదయపూర్ ఇండియా లో తప్పక చూడదగిన ప్రదేశం. ఈ నగరంలో సరస్సులు ఆహ్లాదకరం. రాత్రులు నగరంలో వెలుగులతో నిండి, రొమాన్స్ కు సరైనవిగా వుంటాయి.

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్

మహాబలేశ్వర్ ప్రదేశం నగరానికి దూరంగా వుంది. ప్రకృతి ఒడిలో మిమ్ములను విశ్రమింప చేస్తుంది. ఈ ప్రదేశాన్ని అయిదు నదుల ప్రదేశం గా పిలుస్తారు. ప్రకృతి పాడే సంగీత ధ్వనులలో విహరించాలంటే, ఇది ఒక చక్కని ప్రదేశం.

కూర్గ్

కూర్గ్

కూర్గ్ ప్రదేశం గురించి చెప్పాలంటే, మాటలు చాలవు. బారులు తీరిన కొండలు, ఎగిసిపడే జలపాతాలు కల కూర్గ్ ప్రతి వారిని ఒక కవి గా చేస్తుంది. మీ జీఇత భాగస్వామితో ఈ ప్రదేశం తప్పక ఆనందించండి.

అల్లెప్పి

అల్లెప్పి

అల్లెప్ప్పి లో ఒక హౌస్ బోటు లో మీకు నచ్చిన వారితో కాలక్షేపం ఎంత బాగుంటుంది. తూర్పున కల వెనిస్ నగరంగా చెప్పబడే ఈ ప్రదేశ బ్యాక్ వాటర్స్ లో విహరించండి. ఆనందించండి.

మున్నార్

మున్నార్

కేరళ లో కల మున్నార్ హనీమూన్ కొరకు చాలామంది జంటలు ప్లాన్ చేస్తారు. ఈ ప్రదేశం ప్రపంచ ప్రసిద్ధి. దట్టమైన పచ్చదనం, కొండ ప్రాంతాలు అద్భుతంగా వుంది, జంటల కాలక్షేపానికి అనుకూలంగా వుంటాయి.

ఊటీ

ఊటీ

నీలగిరి కొండలపై కల సహజ దృశ్యాల ఊటీ తప్పక చూడ దగిన ప్రదేశం. ఈ హిల్ స్టేషన్ ఎల్లపుడూ చక్కని పొగమంచుతో, చల్లని గాలులతో ఆహ్లాదకరంగా వుంటుంది. క్వీన్ అఫ్ హిల్స్ గా చెప్పబడే ఊటీ సెకండ్ హనీ మూన్ కు చక్కని ప్రదేశం.

కొడైకెనాల్

కొడైకెనాల్

కొడైకెనాల్ ఊటీ వలే రాణి కాకపోయినా ఒక రాజకుమారి వలే వుంటుంది. పచ్చని అడవులు కల అందమైన ఈ హిల్ స్టేషన్ తప్పక విహరిన్చదగినది.

పూరి

పూరి

మీ భాగ స్వామితో విహారానికి ఓడిషా రాష్ట్రం లో కల పూరి మరొక చక్కని ప్రదేశం. పూరి బీచ్ లో ఉల్లాస పరచే ఒంటె సవారీలు , ఇతర ప్రోగ్రాం లతో చేయవచ్చు. మధురమైన క్షణాలను గడపవచ్చు.

 షిల్లాంగ్

షిల్లాంగ్

ఇండియా లోని ఈశాన్య ప్రాంతంలో కల సుందరమైన ప్రదేశాలలో షిల్లాంగ్ ఉత్తమమైనది. దీనిని స్కాట్ ల్యాండ్ అఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. మంచి సువాసనల పూలు వికసించే ఈ ప్రదేశం లో అనేక సుందర దృశ్యాలూ, పచ్చని పొలాలూ, కొండ ప్రాంతాలు చూసి ఆనందించ వచ్చు.

డార్జిలింగ్

డార్జిలింగ్

బహుశ, డార్జిలింగ్ ప్రదేశాన్ని మీరు ఎన్నో సినిమాలలో చూసి వుంటారు. డార్జిలింగ్ అందాలకు నిదర్శనం ఆ దృశ్యాలు చాలు. డార్జిలింగ్ లోని హిమాలయన్ రైల్వే ప్రయాణం జంటలకు ఆహ్లాదం కలిగిస్తుంది.

పాండిచేరి

పాండిచేరి

మీ జీవిత భాగస్వామి తో కలసి పర్యటించేందుకు పాండిచేరి ఒక చక్కటి ప్రదేశం. ఇది ఒక ఫ్రెంచ్ కాలనీ. ఇక్కడ మీరు నాలుగు అందమైన బీచ్ లు మరికొన్ని ఆకర్షణీయ ప్రదేశాలు చూడవచ్చు. ఈ నగర పర్యటన మీకు విభిన్న సంస్కృతులను చూపుతుంది.

అండమాన్ & నికోబార్

అండమాన్ & నికోబార్

భూమిపై గల జీవనం అద్భుతం అనుకుంటే, అండమాన్ & నికోబార్ దీవులలోని నీటి అడుగు జీవనం మరింత అద్భుతంగా వుంటుంది. ఈ దీవులు సందర్శిస్తే, మీరు ఇక్కడ కల నీటి అడుగు ప్రాణులను కూడా చూసి ఆనందించ వచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X