Search
  • Follow NativePlanet
Share
» »భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

భక్తుల కోర్కెలను తీర్చే ఘటిక సిద్దేశ్వర స్వామి !

By Staff

కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?కోహినూర్ వజ్రం గుంటూరు మారుమూల గ్రామంలో దొరికింది అని తెలుసా ? ఎలా దొరికిందో తెలుసా ?

ఘటిక సిద్దేశ్వరం ... నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్య క్షేత్రం పేరు. ఈ గ్రామంలో ఇష్టకామేశ్వరి సిద్దేశ్వరాలయం ప్రసిద్ధి చెందినది. ఇది పురాతన చరిత్ర కలిగిన ఆలయం. దీనిని కాశీ నారాయణ స్వామి పునరుద్ధరించారు. శ్రీ ఘటికా సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని సిద్దేశ్వరకోన లో కలదు.

ఘటిక సిద్దేశ్వర దేవస్థానం, నెల్లూరు నుండి 110 కిలోమీటర్ల దూరంలో కలదు. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, చెట్లు, ఆకుపచ్చని మైదానాల మధ్య ఘటిక సిద్దేశ్వరం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తుల కోరికలను తీర్చే స్వామిగా ఈ సిద్దేశ్వరుడు ఎంతో ప్రసిద్ధుడు. ఈ స్వామి వారిని దర్శించుకోవటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక, తమిళనాడు, పాండిచ్చేరి నుండి కూడా భక్తులు వస్తుంటారు. నిత్యం ఆలయంలో దేవునికి పూజలు జరుగుతుంటాయి.

ఘటిక సిద్దేశ్వర స్వామి దేవస్థానం

ఘటిక సిద్దేశ్వర స్వామి దేవస్థానం

చిత్ర కృప : YVSREDDY

ఘటిక సిద్దేశ్వరం ఆలయం చరిత్ర

ఘటికా సిద్దేశ్వరం భారతదేశంలోని ప్రాచీన శైవ క్షేత్రాలలో ఒకటి. క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దానికి ముందే ఈ క్షేత్రం వెలసినట్లుగా స్థలపురాణం చెబుతుంది. సప్త ఋషులలో ఒకరైనా అగస్త్య మహర్షి ఈ క్షేత్రం లో తపస్సు చేసి ఉమామహేశ్వరుల కళ్యాణం జరిపినట్లు శ్రీ నిత్యనాథ సిద్దాచార్యులు రస రత్నాకర గ్రంధంలో పేర్కొనబడింది. అటుపిమ్మట క్రీ. శ. 14 వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయానికి ప్రాకార గోడ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. 1974 లో అవధూత కాశీనాయన ఈ క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేశారు.

గర్భగుడిలోని సిద్దేశ్వర స్వామి

గర్భగుడిలోని సిద్దేశ్వర స్వామి

ప్రకృతి సౌందర్యం

ఘటిక సిద్దేశ్వరం ఎతైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాల నడుమ మనసును మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది.

ఇది కూడా చదవండి : పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన మహత్యం !

ఉత్సవాలు, పండుగలు

ఘటిక సిద్దేశ్వరంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

సిద్దేశ్వరం ధ్వజస్తంభం

సిద్దేశ్వరం ధ్వజస్తంభం

చిత్ర కృప : YVSREDDY

శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి సన్నిధానంలో సందర్శించవలసిన ఇతర స్థలాలు

శ్రీ సిద్ధివినాయక స్వామి, శ్రీ ఘటిక సిద్దేశ్వర స్వామి, శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారు, శ్రీ సద్గురు కాశీనాయన స్వామి, శ్రీ వృద్ధ సిద్దేశ్వర స్వామి, నవగ్రహ మండపం, ఏకశిలా ధ్వజ స్తంభం, మహా బిల్వ వృక్షం, అగస్త్య పీఠం, వీరభోగ వసంతరాయలు, కైలాస కోన (తపోవనం), అయ్యప్ప స్వామి గుడి, ధ్యాన మందిరం, సప్త కోనేరులు, పాలకోనేరు, నంది ధార

వసతి సౌకర్యాలు

ఘటిక సిద్ధేశ్వరం వచ్చే భక్తులు సొంత వాహనాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఇక్కడ కొండపై నుంచి ఎల్లప్పుడు నీరు ప్రవహిస్తున్నందు వలన మంచినీటికి ఇబ్బంది లేదు. ఇక్కడకు వచ్చే భక్తులకు అన్నదాన వసతి ఉన్నది. ఇక్కడకు వచ్చిన భక్తులు ఉత్సవాల సమయంలో తప్పక మామూలు రోజుల్లో సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. ఒకవేళ రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తే వసతి సౌకర్యాలకు కొదవలేదు.

ఆలయం లోని కోనేరు

ఆలయం లోని కోనేరు

చిత్ర కృప : YVSREDDY

రవాణా వ్యవస్థ

ఉదయగిరి - సీతారామపురం మార్గం మధ్యలో పోలంగారిపల్లి గ్రామం నుంచి 12.6 కిలోమీటర్లు మెటల్ రోడ్డుపై ప్రయాణం చేస్తే ఘటిక సిద్ధేశ్వరం వస్తుంది. శివరాత్రికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. నెల్లూరు నుండి ఆత్మకూరు, ఉదయగిరి మీదుగ రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X