Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లోని శక్తి దేవాలయాలు !!

ఇండియా లోని శక్తి దేవాలయాలు !!

ఇండియా లో మహిళలకు విశేష స్థానం వుంది. మహిళలను గౌరవించటం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. ఒక మహిళా శక్తి స్వరూపిణి అని, సర్వ శక్తి సంపన్నురాలని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రతి పురుషుడి వెనుకా, లేదా పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ మూర్తి వుంటుంది అనేది ప్రతి అధిక సంఖ్యాకులు విశ్వసించే దేశం ఇది. ఎక్కడ స్త్రీలు పూజించబదతారో అక్కడ దేవతలు ఉంటారనేది కూడా ప్రతీతి. పురుషుడి జీవితంలో జననం మొదలు మరణం వరకూ ఒక తల్లిగా, స్నేహితగా, భార్యగా, మహిళా పురుషుడికి ప్రతి విషయం లోనూ అండ దండలు అందిస్తుంది. మన హిందూ పురాణాలూ, కావ్యాలూ, ఇతి హాసాలూ కూడా మహిళా యొక్క గొప్ప దానాన్ని వివిధ రీతులలో గుర్తిస్తూ ఆమెను ఒక శక్తి శాలిగా గుర్తించాయి. ఇక దేవతలలో సైతం శక్తి స్వరూపినులను అధిక శక్తి శాలులుగా కొలుస్తారు. కాలి, సరస్వతి, లక్ష్మి, దుర్గ, పార్వతి, మీనాక్షి మొదలైన దేవతలను విశేషంగా కొలుస్తారు. మాత అనుగ్రహం పొంది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. జగద్గురువు ఆది శంకరులు వారు సైతం దేశంలో వివిధ ప్రదేశాలలో శక్తి పీఠాలను స్థాపించి శాక్తేయ పీత సంస్కృతిని అభివృద్ధి చేసారు. ఈ వ్యాసంలో మీకు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో కల ప్రసిద్ధి చెందినా శక్తి దేవస్థానాల గురించి క్లుప్తంగా చిత్ర సహితంగా అందిస్తున్నాం. చూడండి, చదవండి, మాతల ఆశీర్వాదాలు పొందండి.

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాతా రాణి లేదా వైష్ణవి
మాత వైష్ణోదేవి దేవాలయం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లో కలదు. భారత దేశంలో ప్రసిద్ధి చెందిన శక్తి పీటాల లో వైష్ణో దేవి దేవాలయం ఒకటి. భారత దేశంలో అధిక భక్తులు వచ్చే రెండవ శక్తి దేవాలయంగా కీర్తి గాంచినది.

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

శక్తి దేవాలయం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గద్వాల్ ప్రదేశంలో అలకా నంద నదీ తీరంలో వెలసిన శక్తి దేవి దారి దేవి. శ్రీ నగర్ - బదరినాద్ హై వే లోని కల్యసౌర్ ప్రదేశంలో కల ఈ దేవాలయంలో దేవి ముఖ భాగం మాత్రమే విగ్రహంగా చూడవచ్చు. ఇక్కడి స్థల పురాణం మేరకు, దేవి విగ్రహం కాలానికి తగినట్లువివిధ రూపాలలో కనపడుతుందని చెపుతారు.

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లలో కల నైనా దేవి మరొక శక్తి స్వరూపిణిగా కీర్తిన్చబడుతోంది.

ఫోటో క్రెడిట్: Ekabhishek

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మైసూరు నగరానికి 13 కి. మీ. ల దూరంలో కల చాముండి కొండపై కల చాముండేశ్వరి మరొక శక్తి స్వరూపిణి.

ఫోటో క్రెడిట్: Sanjay Acharya

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

దక్షిణ కన్నడ జిల్లాలో కల ఒక చిన్న పట్టణం కటీలు. ఇక్కడ దుర్గా పరమేశ్వరి అనే పేరుతో మాత భక్తులను ఆశీర్వదిస్తోంది.

ఫోటో క్రెడిట్: Premkudva

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలోని కొల్లూరు పట్టణంలో కల జగన్మాత మూకాంబికా దేవి కొల్లూరు మూకాంబిక పేరుతో భక్తులను అనుగ్రహిస్తోంది. ఫోటో క్రెడిట్: Vaikoovery

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

అన్నదానం మహాదానంగా మనం కీర్తిస్తాము. అన్నాన్ని పూజిస్తాము. మరి అందరకూ అన్నాన్ని ప్రసాదించే దేవి అన్నపూర్ణేశ్వరి ఒక శక్తి స్వరూపిణిగా కర్నాటక రాష్ట్రంలోని హొరనాడు లో కలదు. ఇక్కడ నిత్యాన్నదానం ఒక విశేషం.

ఫోటో క్రెడిట్: Gnanapiti

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

కర్నాటక లోని కోలారు పట్టణంలో కల మరొక శక్తి స్వరూపిణి కోలారమ్మ.తప్పక దర్శించదగిన దేవాలయం

ఫోటో క్రెడిట్: Hariharan Arunachalam

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మహారాష్ట్ర లోని కొల్లాపుర పట్టణంలో కొలువైన మహాలక్ష్మి ప్రసిద్ధి చెందిన మరొక శక్తి స్వరూపిణి

ఫోటో క్రెడిట్: tanny

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

మాత అనుగ్రహిస్తే...అంతా మంచే!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం దేవస్థానంలో కల భ్రమరాంబా దేవి మరొక శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతోంది.

ఫోటో క్రెడిట్: Chintohere

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

శ్రింగేరి శారదా దేవి ఒక శక్తి స్వరూపిణి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

తమిళనాడు లోని కాంచీపురా కామాక్షి ఒక శక్తి స్వరూపిణి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

ఆంధ్ర ప్రదేశ్ లోని మహబూబ్ నాగ జిల్లా ఆలంపూర్ పట్టాన జోగులాంబ ఒక శక్తి స్వరూపిణి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

తూర్పు గోదావరి జిల్లా , పీతాపురంలోని పురుహూతికా దేవి ఒక శక్తి స్వరూపిణి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

ఒడిష లోని కటక్ లో కల దేవాలయం లొనీ చండి మాత ఒక శక్తి స్వరూపిణి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని పార్వతి అవతారం మాణిక్యాంబ

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

అస్సాం లోని గౌహతి లో కల కామాఖ్య దేవి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

కేరళ లోని తిరువనంతపురం జిల్లాలో కల పాలక్కావు భగవతి దేవాలయ భద్రకాళి ఒక శక్తి స్వరూపిణి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

కేరళ లోని తిరువనంతపురంలో కల శర్కరా దేవి దేవాలయ మాత శర్కరా దేవి

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

కర్నాటక లోని బాగల్కోట జిల్లా లో కల బాదామి పట్టణంలోని బనశంకరి అమ్మవారు

 మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మహారాష్ట్ర లోని ఉస్మానాబాద్ జిల్లాలో కల తులజా పూర్ పట్టన దేవాలయంలో మాత ఉగ్ర రూపంలో భవానీ మాత పేరుతో పూజలు అందుకుంటోంది. ఈ మాతను దర్సించేందుకు, ఉత్తర కర్నాటక మరియు ఆంద్ర ప్రదేశ్ ల నుండి కూడా భక్తులు వస్తారు. ఈ క్షేత్రం 51 శక్తి పీటా లలో ఒకటిగా విరాజిల్లుతోంది. ఫోటో క్రెడిట్: Anjali Sajan

 మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

శక్తి పీటం అయిన శాఖంబరి దేవి ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్పూర్ పట్టణానికి 40 కి. మీ. ల దూరంలోని జన్స్కౌర్ అనే గ్రామంలో కొలువై వుంది. ఇక్కడ కల రెండు దేవాలయాలు, ఒకటి శాఖంబరి, మరి ఒకటి భురా దేవి మాతలవి చూడవచ్చు.

 మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

ఉత్తర కర్నాటక లో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థలం, మరియు శక్తి క్షేత్రం సౌదట్టి. ఇక్కడ కల రేణుకా దేవి దేవస్థానం. ప్రసిద్ధి చెందినది. ఈ మాతను ఎల్లమ్మ అని కూడా అంటారు.

 మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

శక్తి స్వరూపిణి పార్వతి మాత అవతారమైన విశాలాక్షి దేవి భారత దేశ ఆధ్యాత్మిక రాజధాని అయిన వారణాసి లో కొలువై పూజలు అందుకుంటోంది. ఫోటో క్రెడిట్: Ekabhishek

 మాతా ....మన్నించి ఆశీర్వదించు!

మాతా ....మన్నించి ఆశీర్వదించు!

చత్తీస్ ఘర్ రాష్ట్రం లోని జగదల్పూర్ నుండి 80 కి. మీ. ల దూరంలో కల దంతే వాడా లో నెలకొన్న దేవి దంతేస్వరి దేవి. ఒక పురాణ కదా మేరకు సతీ దేవి పళ్ళు ఇక్కడ పడిన కారణంగా ఈ మాత ఇక్కడ నెలకొని వుంది. ఇది 51 శక్తి పీటా లలో ఒకటిగా విలసిల్లు తోంది.

ఫోటో క్రెడిట్: dantewada.ni.in

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X