Search
  • Follow NativePlanet
Share
» »కర్నాటక రాష్ట్రంలో గోల్ఫ్ ఆటలు !

కర్నాటక రాష్ట్రంలో గోల్ఫ్ ఆటలు !

గోల్ఫ్ ఆట ఇండియా లో ఇపుడిపుడే ప్రాచుర్యం పొందుతోంది. అయితే, ఈ ఆట, ఆంద్ర ప్రదేశ్ కు పొరుగునే కల కర్ణాటకలో మంచి ఆదరణ కలిగి వుంది. గోల్ఫ్ ఆటపై ఆసక్తి కల క్రీడాకారులు కర్నాటక పర్యటనలో అక్కడి ఆకర్షణలు చూడటంతో పాటు, వారు దిగిన రిసార్ట్ లకు సమీపంలో కల గోల్ఫ్ కోర్స్ లను కూడా ఆనందించవచ్చు. కర్ణాటక లోని గోల్ఫ్ కోర్స్ లు కొద్ది ఎకరాల గ్రౌండ్స్ లో ఉన్నప్పటికీ, జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ లను ఎన్నింటినో నిర్వహించాయి. ఈ పచ్చటి మైదానాలు అనుభవజ్ఞులైన క్రీడాకారులను ఆకర్షించటమే కాక, ఆటకు కొత్తవారిని కూడా ఆహ్వానిస్తాయి. ఇక్కడ కల అన్ని గోల్ఫ్ కోర్స్ ల లోను ప్రొఫెషనల్ కోచింగ్ కలదు. మరి అటువంటపుడు, గోల్ఫ్ కోర్స్ సమీపంలో కల రిసార్ట్ లో మీరు దిగితే, మీ వెకేషన్ మరింత ఆనందంగా గడిచి పోతుంది. మంచి సౌకర్యాలు కల కర్న్తాటక గోల్ఫ్ కోర్స్ లను పరిశీలిద్దాం.

రైల్ గోల్ఫ్ క్లబ్
కర్ణాటకలోని ఈ గోల్ఫ్ కోర్స్ 9 రంధ్రాల కోర్స్. దీనినే 18 రంధ్రాల కోర్స్ గా కూడా ఉపయోగించవచ్చు. హుబ్లి లోని రైల్వే కాలనీలో కల ఈ గోల్ఫ్ కోర్స్, వారాంతంలో బిజిగా వుంటుంది. గోల్ఫ్ కోర్స్ పక్కనే ఒక క్లబ్ హౌస్ క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో వుంది. చక్కగా నిర్వహించబడే ఈ గోల్ఫ్ కోర్స్ కు కర్ణాటకలో అధిక డిమాండ్.

పిలికుల గోల్ఫ్ క్లబ్

పిలికుల గోల్ఫ్ క్లబ్ మంగళూరు లో వుంది. ఈ గోల్ఫ్ కోర్స్ సుమారు 60 ఎకరాల నేలలో విస్తరించి వుంది. ఇది 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ చుట్టూ పచ్చదనం. ఇక్కడ నిర్వహించే టోర్నమెంట్ లకు కేరళ, తమిల్ నాడు రాష్ట్రాల నుండి కూడా క్రీడాకారులు వస్తారు. ఇక్కడ రెస్టారెంట్ మరియు బార్ లు కలవు. 7 గెస్ట్ హౌస్ లు కలవు. పార్కింగ్ ప్రదేశం విశాలంగా వుంటుంది.

కర్నాటక గోల్ఫ్ అసోసియేషన్

కర్నాటక గోల్ఫ్ అసోసియేషన్ బాగా పేరొందినది. ఈ గోల్ఫ్ కోర్స్ ను బెంగుళూరులో కొంత మంది క్రీడాకారులు 1973 లో స్థాపించారు. ఈ గోల్ఫ్ కోర్స్ సుమారు 11 7 ఎకరాలలో 18 రంధ్రాల కోర్స్ గా విస్తరించి వుంది. దీనికి అనుబంధంగా, జిం, స్విమ్మింగ్ పూల్, హెల్త్ క్లబ్, రెస్టారెంట్ లు కూడా కలవు. కొత్తగా నేర్చుకునే వారికి శిక్షణ నిస్తారు. కనుక మీరు మీ వెకేషన్ లో ఈ క్రీడ ఆనందించవచ్చు.

టాటా కాఫీ గోల్ఫ్ క్లబ్
టాటా కాఫీ గోల్ఫ్ క్లబ్ పచ్చటి కాఫీ తోటల మధ్య వుంది. ప్రతిష్టాత్మక ఈ గోల్ఫ్ క్లబ్ టాటా గ్రూప్ వారి స్వంతం. సుమారు 20 ౦౦౦ ఎకరాల నెలలో విస్తరించి 9 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ గా వుంది. ఇక్కడ గోల్ఫ్ రిసార్ట్ లు, బంగళాలు కలవు. వీటిలో ఒక కుక్, బట్లర్ కూడా మీకు సేవలు అందించేందుకు వుంటారు.
కే. జి.ఎఫ్. జిమ్ ఖానా గోల్ఫ్ క్లబ్
ఈ గోల్ఫ్ క్లబ్ కోలార్ జిల్లా లోని రాబర్ట్ సన్ పేట లో కలదు. ఒకప్పుడు ఈ గోల్ఫ్ కోర్సు కర్నాటక లో మొదటి స్థానంలోను, ఇండియాలో 4 వ ప్రాచీన క్లబ్ గాను వుండేది. దీనిని బ్రిటిష్ వారు స్థాపించారు.
జింఖానా గోల్ఫ్ క్లబ్
జింఖానా గోల్ఫ్ క్లబ్ 12 రంధ్రాల గోల్ఫ్ కోర్స్. దీనిని కోలార్ లోని మైనర్లు స్థాపించారు.
క్లోవర్ గ్రీన్ గోల్ఫ్ క్లబ్
ఈ గోల్ఫ్ కోర్స్ 200 ఎకరాలలో విస్తరించి వుంది. బెంగుళూరు పొలిమేరలలో కల ఈ కోర్సు లో ఒక క్లబ్ హౌస్ కూడా కలదు. ఇక్కడకు ఎక్కువగా చెన్నై క్రీడాకారులు వస్తారు. మంచి శిక్షకులు ఇక్కడ కలరు. జిం, స్నాక్ బార్ ఇతర సౌకర్యాలు.
కర్ణాటక ఆర్మీ ఇన్ఫాంట్రీ
ఇక్కడ కల గోల్ఫ్ కోర్స్ 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్. ఇది బెల్గాం లో కలదు. దీనిలో రెస్టారెంట్, కూల్ డ్రింక్ షాప్ లు కలవు. పార్కింగ్ ప్రదేశాలు కలవు.
బేలూర్ గోల్ఫ్ క్లబ్
బేలూర్ గోల్ఫ్ క్లబ్ 9 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ ఇది కూర్గ్ లోని సోమవార్పేట్ లో కలదు. దీనిని 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ గా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక క్లబ్ హౌస్ కలదు. ఇతర క్రీడలైన బిలియర్డ్స్, బాడ్మింటన్, లు కూడా కలవు.
ఈగల్టన్ గోల్ఫ్ కోర్స్
కర్ణాటకలో ఈగల్టన్ గోల్ఫ్ కోర్స్ ప్రసిద్ధి చెందినది. ఇక్కడకు గోల్ఫ్ క్రీడాకారులే కాదు, పక్షి అభిమానులు కూడా వస్తారు. బెంగుళూరు లో కల ఈ 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ పరిసరాలు, పచ్చటి ప్రదేశాలతో, నీటి కొలనులతో, పెయింటింగ్ వలే వుంటుంది. ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్ లో మీకు వసతి, ఆహారం, బిజినెస్ సౌకర్యాలు, అన్నీ కలవు. ఇతర క్రీడలైన అర్చరీ, బిల్లియర్డ్స్, హార్స్ రైడింగ్ మరియు క్రికెట్ కూడా కలవు.

గోల్ఫ్ ఆటలకు ఎక్కడకు వెళ్ళాలి?

జయచామరాజ ఒడయార్ గోల్ఫ్ క్లబ్
జయచామరాజ ఒడయార్ గోల్ఫ్ క్లబ్ మైసూరు లో కలదు. దీనిని దివగంత మహారాజ నల్వాడి కృష్ణరాజ ఒడయార్ 1906 లో స్థాపించారు. ఇది సుమారు 110 ఎకరాలలో చాముండి హిల్స్ దిగువ భాగంలో కలదు. ఇది 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్. ఇందులో మీకు ఫిట్నెస్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్, అన్ని వసతులు కల గోల్ఫ్ రిసార్ట్ కలవు.

కూర్గ్ గోల్ఫ్ లింక్స్
కూర్గ్ గోల్ఫ్ లింక్స్ ను 1987 లో స్థాపించారు. చుట్టూ కొండలతో ఆకర్షణీయంగా వుంటుంది. ఇది 9 రంధ్రాల గోల్ఫ్ కోర్స్. ఇందులో జిం , బార్, క్లబ్ హౌస్, డైనింగ్ రూమ్, కార్డ్ రూమ్ కలవు. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుండి ఇది 242 కి. మీ. లు, మైసూరు రైల్వే స్టేషన్ నుండి 101 కి. మీ. ల దూరం వుంటుంది.

బెంగుళూరు గోల్ఫ్ క్లబ్
కర్నాటక లో ఈ క్లబ్ చాలా పురాతనమైనది. మొదట్లో 12 రంధ్రాల గోల్ఫ్ కోర్స్ గా వుంది, తర్వాత 18 రంద్రాల గోల్ఫ్ కోర్సు అయింది. సౌకర్యవంతమైన పార్కింగ్, చేంజ్ రూమ్స్, వాష్ రూమ్స్, లాకర్ సౌకర్యం కలవు.

మేర్కారా డౌన్స్ గోల్ఫ్ క్లబ్
ఈ గోల్ఫ్ క్లబ్ కూర్గ్ లోని సుందర, ప్రశాంత ప్రకృతి లో కలదు. మడికేరి కి ఇది 6 కి. మీ. ల దూరం. సిటీ నుండి తేలికగా చేరవచ్చు. పచ్చటి ప్రదేశం, తాజా గాలి అనుభవిస్తూ గోల్ఫ్ ఆడ వచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X