Search
  • Follow NativePlanet
Share
» »గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా ఒక గొప్ప పర్యాటక ప్రదేశమే కాదు, అనేక ప్రసిద్ధ చర్చి లు కల ఒక ఆధ్యాత్మిక ప్రదేశం కూడాను. అద్భుతమైన శిల్ప కళలతో నిర్మించబడిన అనేక చర్చి లు కూడా గోవా పర్యటనలో కను విందు చేస్తాయి. గోవా ఆకర్షనలలో ఇంత గొప్పవైన ఈ చర్చి లను చూడ కుండా మీ గోవా పర్యటన పూర్తి కానట్లే.

ఇపుడు మనం గోవా లోని కొన్ని ప్రసిద్ధ చర్చి లను తెలుసుకొని వాటిని తదుపరి పర్యాటక ప్రణాళికలలో తప్పక చేరుద్దాం.

గోవా లో వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

బాసిలికా అఫ్ బం జీసస్
గోవా లో కల బాసిలికా అఫ్ బాం జీసస్ చర్చి క్రిస్టియన్ లకు ప్రపంచ ప్రసిద్ధి. 400 సంవత్సరాల చరిత్ర కల ఈ చర్చి జేస్సూట్ శిల్ప శైలికి ఒక ఉదాహరణ. గోవా లో క్రిస్టియన్ మతం ప్రవేశ పెట్టిన సెయింట్ జావియర్ సమాధి కూడా కలదు. ఈ చర్చి కే యునెస్కో సంస్థ గుర్తింపు కలదు. ఇది గబది సర్కిల్ సమీపంలో కలదు.

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

సెయింట్ కాజేతాన్ చర్చి
సెయింట్ కాజేతాన్ చర్చి పురాతన గోవా లో కలదు. ఇది పూర్తిగా రోమ్ నగరంలోని బాసిలికా అఫ్ సెయింట్ పీటర్ చర్చి ని పోలి వుంటుంది. అద్భుత శిల్ప శైలి కల ఈ చర్చి పర్యాటకులు తప్పక చూడదగిన ఆకర్షణ.

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

సే కేథడ్రాల్ అఫ్ సంతా కతరీనా

ఈ చర్చి ని సే కేథడ్రాల్ అని కూడా అంటారు. గోవా లోని చర్చి లలో ఇది ప్రసిద్ధ చర్చి. 1619 లో పోర్చుగీస్ వారు మొఘల్ సైన్యాలపై సాధించిన విజయానికి గుర్తుగా దీనిని స్థాపించారు. ఈ చర్చి ప్రాంగణం చాలా విశాలమైనది. దీనిలో ఆర్చ్ బిషప్ భవనం, ఒక మ్యూజియం కూడా కలవు.

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

అవర్ లేడీ అఫ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్
గోవా లో ఇది ఒక పురాతన చర్చి. పాన్జిం ప్రదేశంలో కలదు. దీనికి రెండు మంటపాలు కలవు. ఒకటి శిలువ వేయబడిన జీసస్ కొరకు కాగా, మరొకటి లేడీ అఫ్ రోసరి కొరకు. చర్చి లోపలి భాగాలు సామాన్యంగా వుంటాయి. సాయంత్రం అయిందంటే చాలు, చర్చి పూర్తిగా విద్యుత్ దీపాలతో వెలిగి పోయి ఆకర్షణీయంగా వుంటుంది.

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

చర్చి అఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసి
ప్రారంభంలో పోర్చు గీస వారు దీనిని ఒక చాపెల్ గా నిర్మించగా, కాల క్రమేనా ఇది చర్చి స్టేటస్ పొందింది. ఇది పురాతన గోవా లో కలదు. ఇక్కడ ఒక కాన్వెంట్ కూడా కలదు. ఈ చర్చి కూడా విభిన్న శిల్ప శైలులు కలిగి వుంది.

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

గోవా చర్చి లు - గుడ్ ఫ్రైడే వేడుకలు

చర్చి అఫ్ సెయింట్ అన్నే
చర్చి అఫ్ సెయింట్ అన్నే దాని శిల్ప శైలికి ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచినది. దీనిలో భారతీయ దేవాలయ మరియు యూరోప్ శిల్ప శైలి మిశ్రమం గా కనపడుతుంది. ఈ చర్చి కి పర్యాటకులు అధికంగా వస్తారు. ఈ చర్చి సిరి దావో నది ఒడ్డున కలదు. తాలావోలిం కు పది కి. మీ. ల దూరంలో వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X