Search
  • Follow NativePlanet
Share
» »గోపాల్పూర్ - ఒక పర్యాటక స్వర్గం !

గోపాల్పూర్ - ఒక పర్యాటక స్వర్గం !

గోపాల్పూర్ ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దు లైన్ల పై ఉన్న కోస్తా పట్టణం. ఈ ప్రదేశం బంగాళాఖాతానికి సమీపంలో ఉంది, ఇది ఈ రాష్ట్రంలోని మూడు పసిద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారు. ఆకర్షణీయంగా ఉండే ఈ స్థలాన్ని చూడడానికి ప్రతినెలా వేలాదిమంది ప్రజలు ఇక్కడికి వస్తారు. ఈ ప్రదేశం బెర్హంపూర్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ రేవుపట్టణం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి అధీనంలో పునర్నిర్మాణంలో ఉంది.

గోపాల్ పూర్ బీచ్

గోపాల్ పూర్ బీచ్

ఇంతకుముందు, గోపాల్పూర్ చిన్న మత్యకారుల గ్రామంగా ఉపయోగపడేది, కానీ బ్రిటీష్ వారి దాడితో దాని భవిష్యత్తు మార్చబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ రేవుపట్టనాన్ని వర్తక కేంద్రంగా ఉపయోగించుకునేవారు. Image source: commons.wikimedia.org

వాణిజ్య వ్యాపారాలు

వాణిజ్య వ్యాపారాలు

ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్టానికి సమీపంలో ఉంది, అందువల్ల ఆ ప్రదేశానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒరిస్సా లోని ఈ వ్యాపార కేంద్రం నుండి ఇతర దక్షిణ రాష్ట్రాలతో రోజువారీ వ్యాపారాలు నడుస్తున్నాయి.

 చుట్టుపక్కల పర్యాటక ప్రదేశు

చుట్టుపక్కల పర్యాటక ప్రదేశు

గోపాల్పూర్ పర్యాటకం అనేక పర్యాటక ఆకర్షణ కల ప్రదేశాలను అందిస్తుంది. మా తారా తరిణి హిల్ మందిరం, బాలా కుమారి ఆలయం, శ్రీ శ్రీ శ్రీ సిద్ధివినాయక్య పీఠం తోపాటు ధార్మిక ఆశక్తి గల ప్రదేశాలు కూడా ఉన్నాయి. సోనెపూర్ బీచ్, అర్యపల్లి బీచ్, గోపాల్పూర్ బీచ్ సందర్శనకు ప్రతిరోజూ వందలమంది వస్తారు. పొతగర్హ సందర్సన తరలనటి గోపాల్పూర్ కధలను వర్ణిస్తుంది.

డాల్ఫిన్ అభయారణ్యం

డాల్ఫిన్ అభయారణ్యం

గోపాల్పూర్ పరిసర గ్రామాలైన పంచమ, బల్లిపదర్ వాటి సాంప్రదాయ జీవన శైలిని పండుగ వేడుకలతో పునరుద్ధరిస్తాయి. గోపాల్పూర్ పర్యాటకం సటపడి డాల్ఫిన్ అభయారణ్యం, బంకేశ్వరి వంటి ఇతర ప్రధాన ప్రదేశాలను సందర్శకులకు అందిస్తుంది.

 గోపాల్పూర్ లో షాపింగ్

గోపాల్పూర్ లో షాపింగ్

గోపాల్పూర్ పట్టణం సిటీ మార్కెట్ ప్రాంతం నుండి కొత్తవస్తువులు కొనుగోలుచేయడానికి షాపింగ్ ప్రియులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఈ ప్రదేశం సముద్రపు గవ్వలు, పట్టుచీరల నుండి తయారుచేసే హస్తకళలకు ప్రసిద్ది చెందింది. సముద్రపు గవ్వలు, చేతితో తయారుచేసిన అందమైన అంశాలను స్థానికుల ద్వారా అమ్మకానికి పెడతారు. సముద్రపు గవ్వల నుండి తయారుచేసే బ్రస్లేట్లు, నెక్లెస్ లు, ఇతర త్రిన్కెట్లు వంటి స్మ్రుతి చిహ్నాలను సేకరించవచ్చు.

 చేరుకోవడం ఎలా

చేరుకోవడం ఎలా

గోపాల్పూర్ భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానంలో చేరుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని దీనికి సమీపంగా ఉండే బెర్హంపూర్ రైల్వే స్టేషన్ నుండి కూడా చేరుకోవచ్చు, రాష్ట్రమంతటా బాగా కలుపబడిఉన్న ప్రైవేట్ కార్లు, బస్సుల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

 సందర్శనకు ఉత్తమ సమయం

సందర్శనకు ఉత్తమ సమయం

గోపాల్పూర్ ఏడాది పొడవునా వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే అందమైన ప్రదేశం, కానీ అక్టోబర్ నుండి ఏప్రిల్ మాసాలలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం మంచిది.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X