Search
  • Follow NativePlanet
Share
» »కనివిని ఎరుగని అద్భుతం... సాగర గర్భంలోని ఈ నగరం..

కనివిని ఎరుగని అద్భుతం... సాగర గర్భంలోని ఈ నగరం..

మహాభారతం,రామాయణం పుక్కిట పురాణాలు కాదని వాటికి చారిత్రక ఆధారాలు వున్నాయని అనేక పరిశోధనలలో బయట పడింది. అలాంటి ఒక పరిశోధనలోని శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకానగరం గురించి కూడా వెలుగులోనికి వచ్చింది.

By Venkatakarunasri

మహాభారతం,రామాయణం పుక్కిట పురాణాలు కాదని వాటికి చారిత్రక ఆధారాలు వున్నాయని అనేక పరిశోధనలలో బయట పడింది.

అలాంటి ఒక పరిశోధనలోని శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకానగరం గురించి కూడా వెలుగులోనికి వచ్చింది.

గుజరాత్ సముద్ర తీరంలో 1983వ దశకంలో జరిగిన ఈ పరిశోధనలో ఒక అపూర్వఘట్టం బయల్పడింది.

పశ్చిమాన గోమతీనది వెళ్లి అరేబియా సముద్రంలో కలిసేచోట సముద్రగర్భంలో ఒక మహానగరం బయటపడింది.

ఈ నగరం శ్రీకృష్ణుని ఉనికిని ప్రపంచానికే చాటిచెప్పింది.

ద్వారకా లోని ముఖ్య దేవాలయం అయిన ఈ ద్వారకాదిష్ దేవాలయం జగత్ మందిర్ (విశ్వ పుణ్యక్షేత్రం ) గా కూడా పిలువబడుతుంది.

కనివిని ఎరుగని అద్భుతం

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈ దేవాలయం 2500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కృష్ణుడి రాజ్యం అయిన ద్వారకా మహాభారత యుద్ధం తరువాత నీటిలో మునిగిన తర్వాత శ్రీ కృష్ణుని ముని మనవడుగా చెప్పబడే వజ్రనాభుని చే నిర్మితమయినదిగా చెప్తారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈ దేవాలయం చుట్టుత ఉన్నటువంటి కళాత్మక భవనం 16 వ శతాబ్దంలో నిర్మితమైనదిగా చెప్తారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈద్ దేవాలయపు 43 మీటర్ల ఎత్తుఅయిన శిఖరం , దాని పైన సూర్య చెంద్రుల చిత్రాల జండా 10 కిలో మీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈద్ దేవాలయం మృదువయిన లైం స్టోన్ తో నిర్మితమైనది.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

దేనికున్న రెండు ద్వారాలు స్వర్గ ద్వార మరియు మోక్ష ద్వార గుండా భక్తులు లోనికి మరియు వెలుపలికి చేరుకుంటారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్.ఆర్.రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ఈ మహానగరాన్ని క్రీ.పూ 3150 ఏళ్ల కిందటిదని నిర్దారించారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఆ మహానగరమే ద్వాపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారక.190కి.మీ ల పొడవు,192కి.మీ ల వెడల్పు,మూడు లక్షల అరవై ఎనిమిదివేల అరవైనాలుగు చదరపు కి.మీల విస్తీర్ణంలో బారులుతీరిన వీధులతో కలిగిన ద్వారక ఇప్పుడు సముద్రగర్భంలో వుంది.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

మధురలో శ్రీ కృష్ణుడు కంసుడ్ని సంహరించాడు. దాంతో మగధరాజు,జరాసంధుడు కాల యముడిని సహాయం తీసుకుని మధురపై అనేక సార్లు దాడికి దిగడంతో తనతో వున్న యాదవుల రక్షణకోసం ఆయన గుజరాత్ లోని సౌరాష్ట్రతీర ప్రాంతానికి వెళ్తాడు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈ తీరంలోనే ఒక కోటను నిర్మిస్తాడు. మహాభారతం,వాయుపురాణం, భాగవతం, స్కందపురాణాలలో ద్వారకాక్షేత్రానికి సంబంధించిన అనేక వర్ణనలు మనకి కనిపిస్తాయి.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈ ప్రదేశం అనంతసామ్రాజ్యంలో ఒక భాగం.ద్వారకా నగరాన్ని సామ్రాజ్యం అనేకంటే సంయుక్తరాజ్య సమాహారం అనడం సమంజసమవుతుంది.అంధకులు,వృష్టులు,భోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగాలు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అంటారు.వీరిని మదవులు అనికూడా పిలుస్తారు.ద్వారకలో నివసించిన యాదవులలో ముఖ్యులు శ్రీకృష్ణుడు,బాల రాముడు,కృతవర్మ మొదలైనవారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఆ కాలంలో దీనిని స్వర్ణద్వారక అనే వారు.ద్వారకావతి,కుసస్థలి అనికూడా పిలిచేవారు. మహాభారతయుద్ధం క్రీపూ 3138వ సంలో జరిగిందని ఆ తర్వాత 36ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడని చెప్తారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

అనంతరం యాదవరాజులు పరస్పరం కలహించుకుని చంపుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేహ త్యాగం చేసాడు.శ్రీకృష్ణుడు 150సంలుపాటు జీవించాడని చెప్తారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో ప్రళయం వచ్చిందంట.సునామీ వచ్చి ద్వారకను ముంచెత్తిందని చెప్తారు.ఇక సాగరం ఉవ్వెత్తున ఎగిసివస్తుంటే తాను చూసానని అర్జునుడు మహా భారతంలో కూడా చెప్తాడు.సాగరగర్భంలో ద్వారక మునిగిపోయింది.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

మునిగిపోగా తీరంవెంట కూడా అనేక ఆనవాళ్ళు లభించాయి.ప్రస్తుతం గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో ఈ ఆలయం వుంది.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఇక్కడ వున్న ద్వారకాదీశుని ఆలయాన్నికూడా శ్రీకృష్ణుని మనమడు వజ్రనాభుడు నిర్మించాడని చెబుతారు.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈ విధంగా శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకనగరం ఇప్పుడు సముద్రగర్భం నుంచి కూడా తన ప్రత్యేకతను చాటుతుంది.

pc: youtube

సాగర గర్భంలోని నగరం

సాగర గర్భంలోని నగరం

ఈ దేవాలయం భక్తులకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9.30 వరకు, మధ్యలో 12.30 నుండి 5 గంటల వరకు విరామంతో భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X