Search
  • Follow NativePlanet
Share
» »శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు !

శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఖజురహో శిల్పాలు !

ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. ఆగ్రా - ఖజురహో 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండో- ఆర్యన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను, శిల్పాలను మనము ఇక్కడే చూస్తాం.

By Mohammad

ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో. ఆగ్రా - ఖజురహో 420 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండో- ఆర్యన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను, శిల్పాలను మనము ఇక్కడే చూస్తాం. దేవాలయ శిల్పకళకు, అపూర్వ కళాఖండాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశం ఖజురహో. ఈ దేవాలయాల సమూహాన్ని నిర్మించటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కాలానికే వదిలేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే .. ఉత్తర భారతాన్ని అతితక్కువ కాలం పాటు పాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేలా రాజులు ... ఇంతటి అద్భుతమైన కళాఖండాలను ఎలా చెక్కారో అని !!

చండేలా రాజుల కాలంలో అనగా క్రీ.శ. 9 - 11 వ శతాబ్దంలో 85 ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 25 దేవాలయాలే ఉండటం చరిత్రకారులకు, పర్యాటకులకు ఒకింత విస్మయానికి గురిచేసే అంశం. ఖజురహో దేవాలయాల మీద చెక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినాయి. ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి. ఇక్కడి మరిన్ని విశేషాలు ఒకసారి తెలుసుకుంటే ..!

ఖజురహో

ఖజురహో

మధ్య ప్రదేశ్ లోని చట్టర్పూర్ జిల్లాలో ఖజురహో గ్రామం ఉన్నది. నర్మదా, చంబల్ నదీపరీవాహ ప్రాంతం, వింధ్యా పర్వత శ్రేణులు ఈ గ్రామానికి ఎల్లలుగాఉన్నాయి.

చిత్రకృప : Patty Ho

దేవాలయాలు

దేవాలయాలు

ఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు వందేళ్లు పట్టింది. కళాత్మక నైపుణ్యానికి, దర్పణానికి ఈ గుహాలయాలు తార్కాణాలు. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికే నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే.

చిత్రకృప : Liji Jinaraj

కొబ్బరి కాండాలు

కొబ్బరి కాండాలు

ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారం రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి.

చిత్రకృప : Christopher Kray

19 వ శతాబ్దం

19 వ శతాబ్దం

ఖజురహో దేవాలయాలు క్రీ.శ. 16 వ శతాబ్దంలో ఖజురహో వైభవం అంతా తుడిచిపెట్టుకుపోయింది. మరలా బ్రిటీష్ వారి హయాంలో 19వ శతాబ్దంలో కనిపెట్టబడింది.

చిత్రకృప : Liji Jinaraj

దేవాలయాలు

దేవాలయాలు

ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాష నుండి మూలంగా వచ్చినది. హిందీలో ఖజూర్‌ అనగా ఖర్జూరము.

చిత్రకృప : Liji Jinaraj

 ఖజురహో

ఖజురహో

భారతీయ సంసృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్‌లో ఉంది. శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు.

చిత్రకృప : David Dominguez

జీవం, శిల్పకళా సంపద

జీవం, శిల్పకళా సంపద

సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు... ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యాయి, దాడులపాలయ్యాయి. అయినా మిగిలిన ఆలయాలలో మాత్రం అప్పటి జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈ నాటికీ సందర్శకులను ముగ్ధులను చేస్తోంది.

చిత్రకృప : Abhishek Singh Bailoo

బ్రిటీష్ హయాంలో

బ్రిటీష్ హయాంలో

16 వ శతాబ్దానికే అంతా కనుమరుగైపోయింది ఖజురహో. మరలా బ్రిటీష్ వారి హయాంలో 1839 లో వెలుగు చూసింది. చండేలా రాజులు నిర్మించిన ఈ ఆలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమే కాదు శృంగారాన్నీ రేకెత్తించేవిగా ఉంటాయి.

చిత్రకృప : pupilinblow

పర్యాటకులు

పర్యాటకులు

వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

చిత్రకృప : ASIM CHAUDHURI

క్లాస్

క్లాస్

మహాత్మా గాంధి ఈ ఆలయాలను చూసి ‘'చాలా జుగుప్సాకరమైన శిల్పాలనీ వీటిని వెంటనే తొలగించేయాలని ‘'హితవు పలికాడు .దానికి స్పందించిన గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ‘'ఖజురహో జాతీయ నిధి అని దాన్ని కూల్చేయమనటం అవివేకమని, అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది ‘'అని గాంధీకే ‘'క్లాస్ ‘'పీకాడు.

చితకృప : Henry Flower

ఆదినాథ దేవాలయం

ఆదినాథ దేవాలయం

జైన తీర్ధాందకరుడు ఆది నాధుడికి అంకితమైన ఆలయం ఇది. ఆలయ గోడలు ప్రాంగణ సంగీతకారుల భంగిమలను, చిత్రాలను వర్ణించే అందమైన చెక్కుళ్ళను కలిగిఉంది. గోడలపై స్త్రీల చెక్కడాలు అందంగా చెక్కబడి ఉన్నాయి.

చిత్రకృప : Airunp

ఘంటాయ్‌ గుడి

ఘంటాయ్‌ గుడి

ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు ఉన్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది.

చిత్రకృప : Chithiraiyan

పార్శ్వనాధ దేవాలయం

పార్శ్వనాధ దేవాలయం

ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజజీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి తీర్ధాంకరుడైన ఆదినాధుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

చిత్రకృప : Marcin Białek

చతుర్భుజ దేవాలయం, దుల్హదేవ్ దేవాలయం

చతుర్భుజ దేవాలయం, దుల్హదేవ్ దేవాలయం

చతుర్భుజ దేవాలయం : విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయమిది.

దుల్హదేవ్ దేవాలయం: ఇది శివాలయం. అప్సర, కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

చిత్రకృప : Chithiraiyan

మతాంగేశ్వర దేవాలయం, లక్ష్మణ దేవాలయం

మతాంగేశ్వర దేవాలయం, లక్ష్మణ దేవాలయం

మాతానాగేశ్వర దేవాలయం: ఇది శివాలయం ఎనిమిది అడుగుల ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి.

లక్ష్మణ దేవాలయం: ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమ్తూరులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. విష్ణుమూర్తి అవతారాలైన నరసింహావతారం, వరాహావతరాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి చెందింది.

చిత్రకృప : Christopher Voitus

విశ్వనాథ దేవాలయం, చిత్రగుప్త దేవాలయం

విశ్వనాథ దేవాలయం, చిత్రగుప్త దేవాలయం

విశ్వనాథ దేవాలయం: మూడు తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది.

చిత్రగుప్త దేవాలయం: ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుడిని దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది.

చిత్రకృప : Airunp

చౌంసత్‌ యోగిని దేవాలయం, కాందారియ మహాదేవ్‌ దేవాలయం

చౌంసత్‌ యోగిని దేవాలయం, కాందారియ మహాదేవ్‌ దేవాలయం

చౌంసత్‌ యోగిని దేవాలయం: ఖజురహోలోని గ్రానైట్‌తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీనకాలానికి అంటే క్రీ. శ. 900 శతాబ్దానికి చెందింది. ఇది కాళిమాతకు చెందిన ఆలయం.

కాందారియ మహాదేవ్‌ దేవాలయం: ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31 మీటర్లు. ఇది శివాలయం.

చిత్రకృప : China Crisis

ఇతర దేవాలయాలు

ఇతర దేవాలయాలు

దేవి జగదాంబ దేవాలయం (దేవి జగదాంబ), జావారి దేవాలయం (విష్ణుమూర్తి) లు కూడా చూడదగ్గవి. గాంగు డ్యామ్, గిరిజన, జానపద కళల రాష్ట్ర మ్యూజియం, ఆర్కియలాజికల్ మ్యూజియం మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : Dennis Jarvis

నృత్యోత్సవాలు

నృత్యోత్సవాలు

ఖజురహో లోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా ఫిబ్రవరి / మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు.

చిత్రకృప : www.khajurahodancefestival.com

సందర్శనీయ స్థలాలు

సందర్శనీయ స్థలాలు

ఖజురహో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా నేషనల్‌ పార్క్‌ ఇక్క డ ముఖ్యమైన విహారకేంద్రం. ఖజురహో నుండి అరగంట ప్రయాణం. చిరుత పులి, పులి, చింకారా, తదితర వన్యమృగాలకు ఈ పార్క్‌ ఎంతో ప్రసిద్ధి. నేషనల్‌ పార్క్‌కు వెళ్లే దారిలో ఉన్న పాండవ జలపాతాలు పర్యాటకుల మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి.

ఇవే కాకుండా చుట్టుప్రక్కల వేణీసాగర్‌ డ్యాం, రాణె జలపాతాలు, రాంగ్వన్‌ సరస్సు, దూబెల మ్యూజియం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పర్యా టక ప్రదేశాలు. అంతేకాకుండా ఇక్కడి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ య్‌గఢ్‌ కోట కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో కొండపైనున్న అ తిపెద్ద కోట ఇది. మరో అత్యంత పురాతన కోట కలింజర్‌. ఇది ఖజు రహో నుండి ఉత్తరదిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

చిత్రకృప : cool_spark

సందర్శించే పర్యాటకులు

సందర్శించే పర్యాటకులు

విమానసదుపాయం : ఖజురహో లో విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి సర్వీసులు నడుస్తాయి.

రోడ్డు మార్గం: సాత్నా, హర్పలూర్‌, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి.

రైలు మార్గం: ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హర్పలూర్‌, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా నుంచి రైళ్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీకులకు ఝ్సానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, వారణాసిల నుంచి వచ్చే వారు ముంబై అలహాబాద్‌ మార్గం ద్వారా సాత్నా నుంచి ఉన్నాయి.

స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధా నంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్‌ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి.

చిత్రకృప : Juan Antonio F. Segal

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X