అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ లో సమ్మర్ థ్రిల్ రైడ్స్ !

Written by: Venkata Karunasri Nalluru
Updated: Friday, March 31, 2017, 14:17 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ మైసూర్ నగర కేంద్రం నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో మైసూర్ రింగ్ రోడ్, కెఆర్ ఎస్ ప్రధాన రహదారిలో ఉంది. బస్సులు, క్యాబ్లు లేదా ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చును. జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ శ్రీ రంగపట్టణ రింగ్ రోడ్ నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కొలంబియా హాస్పిటల్ కు కుడివైపున ఉంది.

ఎలా చేరుకోవాలి?

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ లో చూడదగినవి

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ కు ఎలా వెళ్ళాలి?

బెంగుళూరు నుండి అయితే బెంగుళూరు సిటీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మద్దూరు, మద్దూరు నుండి మాండ్య, మాండ్యా నుండి జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ కు చేరుకొనవచ్చును.
బెంగుళూరు సిటీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి సుమారు 2గం.ల.42ని. లు పడుతుంది. ఎన్ హెచ్ 275 ద్వారానయితే 2గం.ల.51ని పడుతుంది.

pc:Google Maps

2. టికెట్టు ధర

ఇక్కడ సెలవు రోజుల్లో మరియు వారాంతాల్లో టికెట్టు ధరలు పెంచటం లేవు. సంవత్సరమంతా ఒకే విధంగా వుంటుంది.

pc: GRS Fantasy Park official site

3. సౌకర్యాలు

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ ప్రతి ఒక్కరికీ ఒక చిరస్మరణీయ అనుభూతి. ఇక్కడ ప్రత్యేక వాష్ రూమ్స్, వికలాంగులు మరియు పెద్దవారి కోసం వీల్ చైర్ ట్రాక్లు మరియు ఇతర సౌకర్యాలు కలిగి ఉన్నాయి.

pc: GRS Fantasy Park official site

 

4. పార్క్ టైమింగ్స్

వారంలో అన్ని రోజులు తెరిచి వుంటుంది.

సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 గం ల నుండి సాయంత్రం 6:00 గం ల వరకు తెరచివుంటుంది.

ఆదివారం మరియు జాతీయ సెలవు దినాలలో 10:30 గం ల నుండి సాయంత్రం 7:00 గం ల వరకు తెరచివుంటుంది.

pc: GRS Fantasy Park official site

5. ఇక్కడ ఆకర్షణలు

జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్ లో సమ్మర్ థ్రిల్ రైడ్స్ !

pc: GRS Fantasy Park official site

6. డ్రాగన్స్ డెన్

రైడ్ దేశంలో చాలా అభివృద్ధి చెందినది. అత్యంత వినూత్న రైడ్. 2003 జాతీయ అవార్డు గెలుచుకుంది.

pc: GRS Fantasy Park official site

 

7. జురాసిక్ యుగం

ఈ రైడ్ లో మీరు నేరుగా వేటాడే జురాసిక్ యుగం నాటి సూపర్ అగ్ని శ్వాస భూతాలతో రైడ్ చేయవచ్చును.

pc: GRS Fantasy Park official site

 

8. కొలంబియా

ఈ రైడ్ లో మీరు హాయిగా కూర్చుని తేలికపాటి థ్రిల్ ను ఆనందించవచ్చును. ఈ రైడ్ లో మీ బాల్యస్మృతులు గుర్తుతెచ్చుకుంటారు.

pc: GRS Fantasy Park official site

9. ఆక్వా టొర్నడో (వాటర్ రైడ్)

900 మంది గంటకు టొర్నాడోలో వాటర్ రైడ్ చేస్తారు. మీకు వారిలో ఒకరిగా వుండాలని వుంది కదూ!

pc: GRS Fantasy Park official site

 

10. ఆక్వా రేసర్

మీరు ఆక్వా రేసర్ డౌన్ రేసుల్లో మీ స్నేహితులతో సవాలు చేయవచ్చును. ఇందులో మీరు పై నుండి క్రిందికి సొరంగం ద్వారా రేస్ చేయవచ్చును.

pc: GRS Fantasy Park official site

 

11. ఇతరులతో మీ అనుభవం

మీరు ఇతరులతో మీ అనుభవాన్ని పంచుకోవచ్చు. ఇక్కడ గల ఆరు దారులలో ప్రతి ఒక్క దారిలో ఏదో గమ్మత్తు వుంటుంది!

pc: GRS Fantasy Park official site

 

12. అమెజోనియ రైడ్

అమెజోనియ రైడ్ లో చుట్టూ మందపాటి వర్షారణ్యాలు ద్వారా ప్రవహించే వాగులతో వేగంగా జరిగే రైడ్ ఇది.

pc: GRS Fantasy Park official site

 

13. అద్భుతమైన మరో ప్రపంపంచం

పట్టణీకరణ వదిలి మీరు మీ కుటుంబంతో అమెజాన్ యొక్క అద్భుతమైన ఈ మరో ప్రపంచాన్ని ఎంతో ఉల్లాసంగా ఎంజాయ్ చేయవచ్చును.

pc: GRS Fantasy Park official site

 

14.పెండులం స్లైడ్

గురుత్వాకర్షణ మరియు త్వరణంతో జరిగే ఆటలు నీటి కొలనులో వుంటాయి. ఇందులో మీకు కొన్ని హెచ్చరికలు చేయబడి వుంటాయి.

pc: GRS Fantasy Park official site

 

15. ఫ్రీ ఫాల్ క్రేజీ క్రూజ్

మీ ఊపిరితిత్తులు బిగపట్టి గట్టిగా అరుచుటకు సిద్ధంగా వుండండి. ఇందులో ఊహించని మలుపులు మరియు అనేక స్లయిడింగ్స్ వుంటాయి.

pc: GRS Fantasy Park official site

 

16. వేవీ క్రేజీ క్రూజ్

వావీ క్రేజీ క్రూజ్ వద్ద మీ సమయాన్ని ఎంజాయ్ చేయుటకు సిద్ధంగా వున్నారా! ఎత్తుపల్లాల వక్రతల ఏటవాలు జారు నుండి క్రిందకు నీటిలో పడేలా చేస్తుంది. మీకు ఎంతో సంతోషంతో కేరింతలు కొడతారు.

pc: GRS Fantasy Park official site

 

17. మ్యూజిక్ బాబ్

మీ రోమాలు నిక్కబొడుచుకునేటట్లు వుండే మ్యూజిక్ కి తగ్గట్లుగా వుండే వేగంతో మీరు మరెక్కడా చూడని విధంగా నీటి ఆటలు చాలా హ్యాపీగా వుంటుంది.

pc: GRS Fantasy Park official site

 

18. ఫ్యామిలీ రైడ్

ఫ్యామిలీ రైడ్ లో హవైన్ పారడైజ్, స్వింగ్ చైర్, డాషింగ్ కార్, స్నో స్లెడ్జ్, ఫ్లోట్ స్లైడ్, రెడ్ ఇండియన్ ఫాల్స్, జల్ తరంగ్ (వేవ్ పూల్) వున్నాయి.

pc: GRS Fantasy Park official site

 

19. ఫ్యామిలీ రైడ్ లో మరికొన్ని

ఆక్వా డాన్స్ ఫ్లోర్, లేజీ రివర్, 5 డి వర్చువల్, టెలికొమ్బోట్,రాక్ క్లైమ్బింగ్, థండర్ స్లైడ్, కాటాపుల్ట్, మల్టిలేన్ స్లైడ్ వున్నాయి.

pc: GRS Fantasy Park official site

 

20. కిడ్స్ రైడ్

కిడ్స్ రైడ్లో రంగులరాట్నం, గొంగళి పురుగు, బేబీ ట్రైన్, మినీ ఆక్వా బౌల్, రాంప్ స్లైడ్, ప్లే ఏరియా, కిడ్స్ పూల్, ఆక్వా ట్రైల్, అట్లాంటిస్ వున్నాయి.

pc: GRS Fantasy Park official site

 

English summary

GRS Fantasy Park Summer Thrill Rides !

GRS Fantasy Park is an national award winning amusement water park located just outside the city of Mysore
Please Wait while comments are loading...