Search
  • Follow NativePlanet
Share
» »గ్వాలియర్ - మధ్య ప్రదేశ్ పర్యాటక రాజధాని !

గ్వాలియర్ - మధ్య ప్రదేశ్ పర్యాటక రాజధాని !

ఎన్నో ప్రసిద్ధ టెంపుల్స్, పురాతన ప్రదేశాలు, సుందర దృశ్యాలు కలిగి గత వైభవాలను గుర్తు చేస్తూ గ్వాలియర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఒక పర్యాటక రాజధానిగా వుంది.

By Mohammad

గ్వాలియర్ పట్టణం ఆగ్రా కు దక్షిణంగా 122 కి. మీ. ల దూరంలో కలదు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం లో ఒక పర్యాటక రాజధాని. ఎన్నో ప్రసిద్ధ టెంపుల్స్, పురాతన ప్రదేశాలు, సుందర దృశ్యాలు కలిగి గత వైభవాలను గుర్తు చేస్తూ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో నాల్గవ అతి పెద్ద పట్టణంగా వుంది. హింద్ యొక్క కోటల నెక్లస్ లో గ్వాలియర్ ను ఒక ముత్యం గా అభివర్ణిస్తారు. ఈ ప్రదేశం గ్వాలియర్ కోటకు ప్రసిద్ధి చెందినది.

సింధియా రాజుల వేసవి కేంద్రం ... శివపురి !

ఆధునికతలతో కలిశే ప్రదేశం గ్వాలియర్ ప్రదేశం లో చరిత్ర మరియు ఆధునికత రెండూ కలసి వుంటాయి. చారిత్రక స్మారకాలు, కోటలు, మ్యూజియం లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఆధునిక ఇండియా లో గ్వాలియర్ ఒక విశిష్టతను కలిగి వుంది.

గ్వాలియర్ ఫోర్ట్

గ్వాలియర్ ఫోర్ట్

ఇండియా లోనే అతి పెద్ద చారిత్రక స్మారకం అయిన గ్వాలియర్ ఫోర్ట్ నగరం మధ్య లో ఒక కొండపై వుంది. పూర్తి నగరాన్ని పై నుండి చక్కగా చూపుతుంది. దీని మార్గంలో రాళ్ళ తో చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలుంటాయి.

చిత్రకృప : Politvs

గ్వాలియర్ ఫోర్ట్

గ్వాలియర్ ఫోర్ట్

కోట నిర్మాణంలో చైనీయుల శిల్ప తీరు కనపడుతుంది. కోట స్తంభాలపై కల డ్రాగన్లు ఆనాటి చైనా...భారత సంబంధాలను సూచిస్తాయి. గ్వాలియర్ కోటను 'జిబ్రాల్టార్ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. ఈ కోట వద్దే రాణి ఝాన్సి, తాంతియా తోపే లు బ్రిటిష్ వారితో భయంకర యుద్ధాలు చేసారు.

చిత్రకృప : Abhishek Dwivedi

హాథి పూల్

హాథి పూల్

హాథి పూల్ అనేది గ్వాలియర్ కోటకు ప్రధాన ప్రవేశ ద్వారం. కోట యొక్క ఆరు ప్రవేశ ద్వారాలు దాటి దీనికి చేరాలి. దీనిని దాటితే రాజు మాన్ సింగ్ నిర్మించిన సుందరమైన మాన్ మందిర్ చేరవచ్చు. నిర్మాణం గుండ్రంగా ఉండి ఆకర్షణీయంగా వుంటుంది

చిత్రకృప : Gyanendrasinghchauha...

జై విలాస్ పాలస్

జై విలాస్ పాలస్

జై విలాస్ పాలస్ సిందియ వంశస్తుల నివాసం. ఇపుడు దీనిలో కొంత భాగం మ్యూజియం చేసారు. ఈ భవనం అద్భుతమైన శిల్ప కల కలిగి వుంటుంది. దీనిలో అనేక కళా కృతులు, సిందియ పాలనా కు చెందిన పత్రాలు, ఔరంగజేబ్, షా జహాన్ ల ఆయుధాలు ఇక్కడ ఉంచారు. ఇక్కడ కల బెల్జియం చాన్దిలియర్లు ఒక ప్రత్యేక ఆకర్షణ.

చిత్రకృప : Gyanendrasinghchauha

తాన్ సేన్ సమాధి

తాన్ సేన్ సమాధి

ఇది తాన్ సేన్ సమాధి. ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు. హిందూస్తాని సంగీత విద్వాంసుడు తాన్ సేన్ అక్బర్ ఆస్థానంలో గాయకుడు. తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే వర్షం పడేదని చెపుతారు. సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.

చిత్రకృప : Varun Shiv Kapur

ఫూల్ బాగ్

ఫూల్ బాగ్

గ్వాలియర్ రైలు స్టేషన్ సమీపం లో కల అందమైన తోట ఫూల్ బాగ్. దీనిని ఆనాటి పాలకుడు మాధవ రావ్ షిండే నిర్మించగా, 1922 లో ప్రిన్సు అఫ్ వేల్స్ తన ఇండియా పర్యటనలో ఆవిష్కరించారు. గ్వాలియర్ జూ , గురుద్వారా టెంపుల్, మసీదు లు కూడా ఫూల్ బాగ్ ఆవరణలో కలవు.

చిత్రకృప : Varun Shiv Kapur

సింధియా వంశియుల చ్చత్రీలు

సింధియా వంశియుల చ్చత్రీలు

చ్చత్రీలు అంటే రాజ వంశీకుల సమాధులు. సిందియా వంశీకుల ఈ సమాధులు గ్వాలియర్ సిటీ పొలిమేరలలో కలవు. జీవాజీ రావు సిందియా, దౌలత్ రావు సిందియ జన్కోజి రావు సిందియ ల సమాధులు ప్రధానమైనవి. ఈ సమాధులు, శివపూరి లో కలవు. ఈ సమాధులు అందమైన శిల్ప శైలి కలిగి వుంటాయి.

చిత్రకృప : Jolle

దర్గా

దర్గా

ఖ్వాజా కానూన్ సాహిబ్ మార్వార్ నుండి గ్వాలియర్ వచ్చి ఇక్కడ మరణించాడు. ఈయన ఒక సూఫీ సెయింట్. ఈ దర్గా ను 40 రోజుల పాటు దర్శిస్తే కోరిన కోరికలు తీరతాయని స్థానికులు నమ్ముతారు. సంవత్సరం పొడవునా ఇక్కడకు భక్తులు వస్తూనే వుంటారు.

చిత్రకృప : Md.abdulnabi92

దేవో ఖో

దేవో ఖో

దేవో ఖో ప్రదేశం సహజమైన ప్రకృతి దృశ్యాల సమూహం. ఇక్కడ అనేక జంతువులు, పక్షులు నివసిస్తాయి. కనుక జంతు , పక్షి ప్రియులు దర్శించవచ్చు. ఇక్కడ ఒక ప్రసిద్ధ శివాలయం కూడా ఒక కొండపై కలదు.

చిత్రకృప : Arpit chhonker

గుజారి మహల్

గుజారి మహల్

గ్వాలియర్ లో ఇది ఒక ప్రసిద్ధ పురావస్తు మ్యూజియం. ఈ భవనాన్ని రాజా మాన్ సింగ్ తన భార్య మ్రిగానాయని జ్ఞాపకార్ధం నిర్మించాడు. 1922 లో దీనిని పురావస్తు శాఖ ఒక మ్యూజియం గా మార్చి అనేక పురావస్తు కలాక్రుతులను ప్రదర్శనలో పెట్టింది.

చిత్రకృప : Gyanendrasinghchauha...

గురుద్వారా బండి చోద్

గురుద్వారా బండి చోద్

గురుద్వారా బండి చోద్ అనేది ఆరవ శతాబ్దానికి చెందిన సిక్కు గురువు హరగోవింద్ సాహిబ్ స్మారకం. చరిత్ర మేరకు గురు హర గోవింద్ సాహిబ్ చక్రవర్తి జహంగీర్ చే గ్వాలియర్ కోటలో సుమారు రెండు సంవత్సరాలు అతని విప్లవ ధోరణి కారణంగా నిర్భందించ బడ్డాడు. గురు హర గోవింద సాహిబ్ నే దత్త బండి చ్చోడ్ అని కూడా పిలుస్తారు.

చిత్రకృప : Gyanendrasinghchauha...

జుహార్ కుండ్

జుహార్ కుండ్

జుహార్ కుండ్ కు కూడా చారత్రక ప్రాధ్యానత కలదు. ఇది మాన్ మందిర్ లోపల కలదు. జోహార్ అంటే ఆత్మహత్య అని అర్ధం. శత్రువుల చేతిలో తమ భర్తలు మరణించగా వారి రాజ పుత్ర భార్యలు, సమూహంగా ఈ కొలనులోకి దూకి ఆత్మహత్యలు చేసుకునేవారు.

చిత్రకృప : Nagarjun Kandukuru

కళా వేదిక

కళా వేదిక

ఈ ప్రదేశం గొప్ప సంగీతకారుల సంగీత సాధనాలను ప్రదర్శించే ఒక వేదిక. ఇక్కడే కొన్ని కుడ్య చిత్రాలు కూడా కలవు. ఘరానా సంగీతం ఇక్కడే పుట్టింది. దీనిని ఇపుడు ఒక మ్యూజియం గా మార్చారు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఒక గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తుంది. చరిత్ర, కళలు పట్ల ఆసక్తి కలవారు దీనిని తప్పక చూడాలి.

చిత్రకృప : Niksrules

వసతి

వసతి

గ్వాలియర్ లో బస చేయాలనుకొనే పర్యాటకులు ఇక్కడి హోటళ్ళులో వసతి పొందవచ్చు. గదులు సులభంగానే అద్దెకు దొరుకుతాయి. రేట్లు కూడా తక్కువే.

చిత్రకృప : Gyanendra_Singh_Chau...

గ్వాలియర్ ఎలా చేరుకోవాలి ?

గ్వాలియర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : గ్వాలియర్ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి తరచూ ఢిల్లీ, వారణాసి, ఇండోర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం : గ్వాలియర్ లో రైల్వే జంక్షన్ కలదు. ముంబై, కోల్కతా, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళు స్టేషన్ లో ఆగుతాయి.
రోడ్డు మార్గం : ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వంటి ప్రదేశాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.

చిత్రకృప : Nikhilb239

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X