అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే మహిమాన్వితమైన దేవాలయం : హాసనాంభ

Written by: Venkatakarunasri
Published: Friday, August 11, 2017, 12:05 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

దేవాలయాలకు మనం తరచుగా వెళ్తూవుంటాం.ఎందుకంటే దీనివలన మనకు శాంతి, నెమ్మది ఆ దైవం ప్రసాదిస్తాడని. దేవాలయానికి వెళ్లేవారికి దైవం రుచికరమైన ప్రసాదాన్ని ఇస్తారనేది సాధారణం. ముఖ్యంగా వైష్ణవదేవాలయాల్లో.ప్రసాదంలో భగవంతుని యొక్క కృప వుంటుందని హిందూభక్తులు బలంగా నమ్ముతారు.

ఈ విషయాన్ని ధృఢంగా నిరూపించే అద్భుతమైన దేవాలయాలు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో వున్నాయి. ఆ మహిమాన్వితమైన దేవాలయమే హాసనాంభ దేవాలయం.బెంగుళూరు నుంచి ఈ దేవాలయానికి సుమారు 185కి.మీ దూరముంది.సుమారు 3గంల సమయం ప్రయాణం చేయవలసివుంటుంది.

ఈ హాసనాంభ దేవాలయాన్ని క్రీ.శ.12 వ శతాబ్దంలో నిర్మించారు.అత్యంత ప్రాచీనమైనది అని చెప్పవచ్చును.ఇక్కడి గర్భగుడిలో హాసనాంభ అనే దేవతను భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తారు.ఈ దేవాలయాన్ని 1 సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు.

ఈ దేవాలయం మహిమ అపారమైనది. ప్రతిఒక్కరు ఈ తల్లి యొక్క మహిమను తెలుసుకోవాలి. ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి.

ప్రస్తుత వ్యాసం మూలంగా ఈ తల్లియొక్క మహిమలు గురించి తెలుసుకుందాం.

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే మహిమాన్వితమైన దేవాలయం : హాసనాంభ

సంవత్సరానికి ఒక్కసారి

ఈ హాసనాంభ దేవాలయాన్ని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. ఆ విశేషమైన రోజు ఏదంటే దీపావళి పండుగ రోజు. దీపావళి పండుగ సమయంలో ఒక్క రోజు మాత్రమే దేవాలయాన్ని తెరుస్తారు.

మూసివేయబడుట

దీపావళి రోజు మాత్రమే తెరిచివుండే ఈ దేవాలయం సంవత్సరమంతా మూసివేయబడివుంటుంది. ఆశ్చర్యమేమంటే ఈ దేవాలయంలో దీపం వెలుగుట. దీంట్లో ఏమి విశేషం అని అనుకుంటున్నారా? అయితే చదవండి...

దీపాలు

ఇక్కడి ఆశ్చర్యకరమైన విషయమేమంటే హాసనాంభ దేవాలయం గర్భగుడిలో దీపావళి పండుగ రాత్రి యందు దీపాలు వెలిగించి అక్కడినుంచి పూజారులు వెళ్ళిపోతారు.

ప్రకాశించటం

దీపాలు వెలిగించిన ఒక సంవత్సరానికి సరిగ్గా అంటే మరొక దీపావళి రోజున దేవాలయం యొక్క గర్భగుడి వాకిలిని తెరవగానే పోయిన సంవత్సరం వెలిగించిన దీపం ఇంకా అలాగే వెలుగుతూ వుంటుంది.

శక్తి

నూనెతో వెలిగించిన దీపం తల్లి గర్భగుడిలో ఒక సంవత్సరమంతా వెలుగుతూనేవుండటానికి ఏ శక్తి సహాయం చేస్తుందనేది ఆ హాసనాంభ దేవికి మాత్రమే తెలుసు.

హాస

హాస అంటే దక్షిణ భారత భాషలో సాధారణంగా చిరునవ్వు అని అర్థం.అట్లయితే హాసన్ లో హాసనాంభ దేవి ఎప్పటికీ తన చిరునవ్వుతో భక్తులను ఆకర్షించే పరాశాక్తిస్వరూపిణీ.

భక్తులు

ఈ హాసనాంభ తల్లిని పూజించినవారికి ఆ తల్లి ఎంతో మంచిని ప్రసాదించింది.నమ్మనివారికి అంతే శౌర్యంతో వుగ్రరూపంలో కనిపిస్తుందని అక్కడి భక్తుల నమ్మకం.

స్థల పురాణం ప్రకారం

హాసనాంభదేవి భక్తురాలిని అత్తగారు ఎల్లప్పుడూ పీడిస్తూవుండేదంట.అత్తని ఈ తల్లి దేవాలయంలో శిలైపో అని శపించింది అని స్థల పురాణంవుంది.

శిల

ఆశ్చర్యం ఏమంటే ఆ శిల కొంచెం కొంచెం జరుగుతూ హాసనాంభ తల్లి దగ్గరకు చేరుతుందంట.

కలియుగ సమయంలో

హాసనాంభ భక్తురాలిని హింసించిన అత్తగారు శిలకు ముక్తి కలియుగం అంతంలోనంట.కలియుగాంతంసమయంలో హాసనాంభ తల్లిసన్నిధిలో అత్తకు ముక్తి లభిస్తుందనేది ఈ క్షేత్రంలోని మహిమాన్విత వృద్ధుడు పలికినమాటలు.

దొంగలు

ఒకసారి హాసనాంభ దేవాలయానికి 4 దొంగలు లోపలికి ప్రవేశించి హాసనాంభ ధరించిన నగలు దొంగిలించడానికి ప్రయత్నించారంట.

రాయి

దీనివలన ఆగ్రహించిన తల్లి ఆ 4దొంగలను రాళ్ళయి పోండి అని శపించిదంట. ఆవిధంగా దేవాలయానికి స్వల్పదూరంలో వున్న కల్లప్ప అనే గుడిలో ఈ నాలుగు రాళ్ళు కనిపించటం విశేషం.

రైలు మార్గం

హాసనాంభ దేవాలయానికి సమీప స్టేషన్ ఏదంటే హరసికెరె రైల్వే స్టేషన్.ఇక్కడి నుండి 38 కి.మీ దూరంలోవుంది.

రహదారిమార్గం

బెంగుళూరు నుంచి హాసన్ కి నేరుగా ప్రైవేట్ మరియు ప్రభుత్వబస్సు సౌకర్యం వుంది.మైసూరు నుంచి 115కి.మీ ల దూరం, బెంగుళూరు నుంచి 172కి.మీ ల దూరంలోవుంది.

విమాన మార్గం

సమీపంలోని విమానాశ్రం ఏదంటే అది మైసూరు విమానాశ్రం.ఇక్కడనుండి హాసన్ కి హాసన్ కి సుమారు 136కి.మీ దూరం వుంది.

English summary

Hasanamba Temple In Hassan

Hasanamba temple is a Hindu temple located in Hassan, Karnataka, dedicated to the Goddess Shakti or Amba. The temple was built in the 12th century and tourists are only allowed to visit the temple once a year during the Hindu festival Deepavali in October. Devotees visit the temple to seek blessings of the Goddess during this week
Please Wait while comments are loading...