Search
  • Follow NativePlanet
Share
» »దెయ్యాల కిచెన్ ఎపుడైనా చూసారా ?

దెయ్యాల కిచెన్ ఎపుడైనా చూసారా ?

కొడైకెనాల్ లో దెయ్యాల కిచెన్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

By Mohammad

అవునండీ !! మీరు విన్నది కరక్టే. నేను చెప్పింది కూడా దెయ్యాల కిచెన్ గురించే. ఏమిటీ హిల్ స్టేషన్లు, హనీమూన్ ప్రదేశాలు, గుళ్లు, గోపురాలు వదిలేసి సడన్ గా ఈ దెయ్యాల మీద పడ్డానేంటీ అనుకుంటున్నారా ? ఎప్పుడూ ఉండే ప్రదేశాలే కదా ... అప్పుడప్పుడూ ఇలాంటివి తెలుసుకుంటే మనకు రోటీకు భిన్నంగా, కాస్త వెళ్లిరావటానికి, వినటానికి బాగుంటాయి.

హిల్ స్టేషన్ కు వెళ్ళొచ్చాము అంటే ఎలా ఉంటుంది ? దెయ్యాల కిచెన్ కు వెళ్ళొచ్చాము అంటే ఎలా ఉంటుంది ? ఎదుటోదు థ్రిల్ గా ఫీలవడు. ఎప్పుడూ విననివారు కాస్త కూర్చొని వింటారు. ఈ దెయ్యాల కిచెన్ ఎక్కడో కాదు అందరికీ తెలిసిన ప్రదేశంలోనే ... కొడైకెనాల్ లో ఉంది.

గుణ గుహలు

చిత్రకృప : Brunda Nagaraj

కొడైకెనాల్ కు చాలా మంది సమ్మర్ లో వెళ్ళివుంటారు. ఎందుకంటే ఇది సమ్మర్ హిల్ స్టేషన్ మరియు దక్షిణ భారతదేశంలో ఊటీ తర్వాత ప్రసిద్ధి చెందిన రెండవ పర్యాటక కేంద్రం. రెగ్యులర్ గా హనీమూన్ జంటలు కూడా కొడై ను సందర్శిస్తుంటారు. ఇక్కడే దెయ్యాల కిచెన్ ఉంది. ఇది కొడైకెనాల్ లో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

దెయ్యాల కిచెన్ ను ఆంగ్లంలో డెవిల్ కిచెన్ అని పిలుస్తారు. గుణ కేవ్స్ గా ప్రసిద్ధికెక్కిన ఈ కిచెన్, కొడైకెనాల్ లో ఒక ఆసక్తికరమైన స్థలం. సాహసికులు, ధైర్యం ఉన్నవారు ఈ ప్రదేశాన్ని తరచూ సందర్శిస్తారు. కమల్ హాసన్ నటించిన పాత సినిమా 'గుణ' ఇక్కడే షూటింగ్ జరుపుకొని విజయం సాధించింది. ఆ సినిమా పేరుమీదనే ఈ గుహలకు ఆ పేరొచ్చింది.

గుణ గుహలు

చిత్రకృప : Aruna

ఎక్కడ ఉంది ?

కొడైకెనాల్ లోని గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కు మరియు పిల్లర్ రాక్స్ కు మధ్యన ఉన్న ప్రాంతంలో ఇరుకైన పొడవాటి లోయలో దెయ్యాల కిచెన్ గా పిలువబడే గుణ గుహలు ఉన్నాయి. రోడ్డు అంచున ఉన్న బాటలో 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుంచి కిందకు దిగి వెళితే , ఒక చిన్న కొండ యొక్క దిగువ భాగంలో గుహ కనిపిస్తుంది. ఇక్కడికి సాహసికులు మాత్రమే వెళ్లివస్తుంటారు.

కొడైకెనాల్ లో ఏమేమి చూడాలి ?

గుణ గుహలు చూడటానికి ఇప్పుడైతే అనుమతిస్తున్నారు గానీ పదేళ్ల కిందట అనుమతించేవారు కాదట. దానికి కారణం అప్పట్లో పదుల సంఖ్యలో ప్రేమ జంటలు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకొనేవారు. మొన్నీమధ్యనే పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంచారు.

గుణ గుహలు

చిత్రకృప : Brunda Nagaraj

గుహను బయటి నుండి చూడటానికి మాత్రమే అనుమతి ఉంది. గుహలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు. గుహలు డేంజర్ కనుక చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటారు.

హిందూ పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొంతకాలం పాటు గడిపారని చెబుతారు. గుహ చుట్టుపక్కల ప్రదేశాలు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటాయి. గుబురుగుబురుగా పెరిగిన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం పర్యాటకులను ఆకర్షిస్తాయి. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు, నేచర్ ఫొటోగ్రాఫర్లు కనిపించే ప్రకృతిని, జంతువులను తన కెమెరాలలో బందించవచ్చు.

గుణ గుహలు

చిత్రకృప : sowrirajan s

సందర్శించు సమయం మరియు ప్రవేశ రుసుము :

గుణ గుహలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 : 30 వరకు సందర్శించవచ్చు. దీనిని వారంలో ప్రతిరోజూ తెరిచే ఉంచుతారు. ప్రవేశ రుసుము : ఐదు రూపాయలు.

బెంగుళూరు నుండి కోడై కెనాల్ రోడ్డు మార్గంలో .. !

కొడైకెనాల్ లో గల ఇతర ఆకర్షణలు

కోడై సరస్సు, బేర్ షోల ఫాల్స్, డాల్ఫీన్ నోస్, ఫైరీ ఫాల్స్, సిల్వర్ క్యాస్కెడ్ ఫాల్స్, కొడైకెనాల్ సోలార్ అబ్సర్వేటరీ మరియు చరిత్రకు సంబంధించిన శెబ్బగనూర్ మ్యూజియం మొదలైన అందమైన పర్యాటక ఆకర్షణలను కొడైకెనాల్ లో చూడవచ్చు.

కొడైకెనాల్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

గుణ గుహలు

చిత్రకృప : Brunda Nagaraj

గుణ గుహలు కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి 8. 5 కిలోమీటర్ల దూరంలో, పిల్లర్ రాక్స్ నుంచి 1. 5 కిలోమీటర్ల దూరంలో మోఇర్ పాయింట్ రోడ్ వద్ద కలదు. ఇక్కడికి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ వాహనాలు వస్తుంటాయి. కొడైకెనాల్ ఎలా చేరుకోవాలి ?

గుణ గుహలను ఏ కాలంలో సందర్శించాలి ?

గుణ గుహలను సందర్శించటానికి అనువైన సమయం ఏప్రియల్ - జూన్ మరియు ఆగస్టు - సెప్టెంబర్. అక్టోబర్ - మర్చి మధ్యలో కూడా ఈ గుహలకు వెళ్లిరావచ్చు అయితే స్వేటర్లు, శాలువాలు, ఉన్ని దుస్తులు ధరించి వెళ్ళటం ఉత్తమం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X