Search
  • Follow NativePlanet
Share
» »హేవ్ లాక్ ఐలాండ్ - ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ !!

హేవ్ లాక్ ఐలాండ్ - ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ !!

భారతదేశంలో ఉన్న హేవ్ లాక్ ఐలాండ్ ద్వీపము చూడటానికి చిన్నపాటి స్వర్గంలా కనిపిస్తుంది. ఈ ద్వీపంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి బీచ్లు, అక్కడ నిర్వహించే నీటి క్రీడలు.

By Mohammad

వేసవి సెలవులు వస్తే సముద్రతీర ప్రాంతాలను పర్యాటకులు కోరుకోవడం సహజం. బీచ్ ఒడ్డున కూర్చొని సముద్ర హోరులను, అలలను గమనిస్తూ అందులో దిగి ఆనందించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి !! చుట్టూ నాలుగువైపులా సముద్రం మధ్యలో భూభాగం కలిగిన ప్రదేశాలకు వేసవి కాలంలో భలే డిమాండ్. అక్కడకు వెళ్ళి సెలవును గడపడం అంటే పిల్లలు, పెద్దలూ వయసుతో సంబంధం లేకుండా ఎగిరి గంతేస్తారు. లాంగ్ వీకెండ్ లకు ఇటువంటి ప్రదేశాలు సరిగ్గా సరిపోతాయి. సముద్రంలో ప్రయాణం, బీచ్ ఒడ్డున రిసార్ట్ లో వసతి, నీటి క్రీడలు ఇలా ఎన్నో సుఖాలను పొందాలనుకుంటే పోదాం పదండి హేవ్ లాక్ ఐలాండ్ !!

ఇది కూడా చదవండి : అండమాన్ నికోబార్ దీవులు !!

హేవ్ లాక్ ఐలాండ్ భూమిపై స్వర్గంలా ఉంటుంది. ఈ ప్రదేశానికి బ్రిటిష్ పాలనలోని ఒక జనరల్ అయిన హెన్రీ హేవ్ లాక్ పేరు పెట్టారు. పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ ద్వీపాన్ని సందర్శిస్తారు. ఈ ప్రదేశంలో అయిదు ప్రధాన గ్రామాలు వాటి పేర్లతో బీచ్ లు కలవు. ఆ గ్రామాల పేర్లు వరుసగా, గోవంద నగర్, రాధా నగర్, బిజయ్ నగర్, శ్యామ్ నగర్, క్రిష్ణనగర్, రాధా నగర్. వీటినే బీచ్ లు గా కూడా చెపుతారు. ఈ బీచ్ లను ఆసియా ఖండంలోనే అత్యుత్తమ బీచ్ లుగా టైమ్ మేగజైన్ 2004 లో ప్రకటించింది.

ముందుగా పోర్ట్ బ్లెయిర్

ముందుగా పోర్ట్ బ్లెయిర్

హేవ్ లాక్ ఐలాండ్ చేరుకోవాలంటే ముందుగా పర్యాటకులు పోర్ట్ బ్లేయిర్ చేరుకోవాలి. పోర్ట్ బ్లెయిర్ చేరుకోవటానికి వైజాగ్, చెన్నై ల నుండి ఓడలు, విమానాలు కలవు. పోర్ట్ బ్లెయిర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కలదు.

చిత్రకృప : Romil Lehakra

ఫెర్రీ ప్రయాణం

ఫెర్రీ ప్రయాణం

హేవ్ లాక్ ఐలండ్ పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంగా 55 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజూ పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్ లాక్ కు ఫెర్రీ లు నడుస్తాయి. ఫెర్రీ టికెట్లు 5 నుండి 8 అమెరికా డాలర్లుగా ఉంటాయి. కేటమరాన్ ఫెర్రీలు కొద్దిగా అధిక ధర. త్వరగా చేరుకోవాలంటే పోర్ట్ బ్లెయిర్ నుండి హేవ్ లాక్ కు హెలికాప్టర్లు కూడా కలవు.

చిత్రకృప : Harvinder Chandigarh

నడక మంచిదేగా !!

నడక మంచిదేగా !!

ఒకసారి మీరు హేవ్ లాక్ దీవి చేరితే ఆ దీవిలో బీచ్ లు, ష్యాక్ లు, షాపింగ్ ప్రదేశాలు చూస్తూ నడక చేయటం మంచిది. రాధా నగర్ బీచ్ లో అందమైన తెల్లని ఇసుక తిన్నెలుంటాయి. వివిధ రుచులు కల సీ ఫుడ్లు కూడా ఆరగించవచ్చు. బీచ్ పక్క మధ్యాహ్నాలు చల్లని గాలులు ఆస్వాదించవచ్చు.

చిత్రకృప : Vineetmbbs

ఎలిఫెంట్ బీచ్

ఎలిఫెంట్ బీచ్

రాధానగర్ బీచ్ నుండి పర్యాటకులు అక్కడే కల మరింత ఆకర్షణీయ బీచ్ ఎలిఫెంట్ బీచ్ నడకలో చేరవచ్చు. నడవలేని వారికి ఆటో రిక్షాలు రెండు డాలర్లు లేదా రూ.100 ధరపై చేరుకోవచ్చు. రిక్షాలే కాక, క్యాబ్ లు లేదా రెండు చక్రాల బైక్ లు రోజు అద్దెలకు దొరుకుతాయి. వీటి అద్దే 4 డాలర్లు లేదా రూ. 200 గా ఉంటుంది.

చిత్రకృప : Foreign Devil Correspondent

స్కూబా డైవింగ్

స్కూబా డైవింగ్

హేవ్ లాక్ ఐలాండ్ లో స్కూబా డైవింగ్ మంచి ఆనందం కలిగిస్తుంది. అండమాన్ దీవులలో స్పీడ్ బోట్లు లేవు. పోర్ట్ బ్లెయిర్ లో ఒక రీ కంప్రెషన్ ఛాంబర్ కలదు. స్కూబా చేసేవారు కొత్త వారైనా, అనుభవం కలవారైనా సరే హేవ్ లాక్ ఐలండ్ లో చేయవచ్చు. ధర సమంజసమే. ఇక్కడ కల వివిధ జాతుల మొక్కలు, జంతువులను వ్యక్తిగతంగా పరిశీలిస్తూ ఆనందించవచ్చు.

చిత్రకృప : Subro89

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

హేవ్ లాక్ ఐలాండ్ లో స్కూబానే కాక, ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. అనేకమంది ట్రెక్కింగ్ గైడ్స్ కూడా లభ్యంగా ఉంటారు.

చిత్రకృప : Shimjithsr

షాపింగ్

షాపింగ్

బీచ్ షికార్లు, ఇసుక తిన్నెలు చాలనుకునేవారు అక్కడే కల విలేజ్ నెంబర్ 3 చేరితే చాలు, అనేక రకాల వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. స్ధానికంగా తయారైన అనేక వస్తువులు అందమైనవి దొరుకుతాయి.

చిత్రకృప : Ananth BS

ఉపశమనం కోసం ..!

ఉపశమనం కోసం ..!

ఈ ప్రదేశంలో అసలు సిసలైన సహజ పానీయం కొబ్బరి బొండాల నీరు తాగటం మరచిపోకండి. పానీయ ప్రియులకు డ్రింక్ లు, బీరు కూడా అనేక రెస్టరెంట్లలో లభిస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతం అవడం వలన ధరలు కూడా సమంజసమే.

చిత్రకృప : Harvinder Chandigarh

వసతులు

వసతులు

అండమాన్ నికోబార్ లోని ఇతర ద్వీపాలవలే కాక, హేవ్ లాక్ దీవిలో అనేక హోటళ్ళు, బస వసతులు కూడా కలవు. వీటి రేట్లు అందరికి అందుబాటులో వాటి వాటి నాణ్యతను బట్టి ఉంటాయి. కేఫే డెల్ మార్ మరియు వైల్డ్ ఆర్చిడ్ హోటళ్ళు బాగుంటాయి.

హేవ్ లాక్ ఐలాండ్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : Ankur P

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X