అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

Written by: Venkata Karunasri Nalluru
Updated: Friday, June 23, 2017, 17:12 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: ఈ దేవాలయంలో దేవత మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు. ఈ బారి విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.

ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది. అనంత పద్మనాభస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరు నుండి తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్థాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: మహారాష్ట్రలోని ఈ మూడు ప్రసిద్ధ దేవాలయాలు

శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

1. 108 దివ్యాదేశములు

ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం.

చిత్రకృప: sreepadmanabhaswamytemple official website

2. పవిత్ర ఆలయం

'తిరు అనంతపురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది.

చిత్రకృప: sreepadmanabhaswamytemple official website

3. తిరువనంతపురం

క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది.

చిత్రకృప: Shishirdasika

4. తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయం

ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది.

ఇది కూడా చదవండి:బాహుబలి 2

 

 

 

చిత్రకృప:rusticus80

 

5. తమిళ ఆళ్వారుల దివ్యప్రబంధం

శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది.

ఇది కూడా చదవండి: బాహుబలి 2 షూటింగ్ జరిగిన ప్రదేశాలు

 

 

చిత్రకృప:Maheshsudhakar

6. పద్మనాభస్వామి అనంతశయనం

ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు.

భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !

చిత్రకృప: Ks.mini

7. టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం తిరుమల శ్రీనివాసుని ఆలయం. ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంతపద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది.

చిత్రకృప:Aravind Sivaraj

8. నేల మాళిగ

ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు.

చిత్రకృప:Ilya Mauter

9.ట్రావెంకూర్

1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యం అనంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు.

గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

చిత్రకృప: Ilya Mauter

10. సంపన్న క్షేత్రం

ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమై సంపద బయటపడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచబడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది.

ఇది కూడా చదవండి: పెళ్లిళ్లు నిర్ణయించే ప్రసిద్ధ ఇడగుంజి వినాయకస్వామి!

చిత్రకృప:Aravind Sivaraj

11. బయల్పడిన సంపద

బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు వున్నాయి.

చిత్రకృప:Manveechauhan

 

12. శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు

పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయాయి.

ఇది కూడా చదవండి: జి ఆర్ ఎస్ ఫాంటసీ పార్క్

చిత్రకృప:Hans A. Rosbach

13. సంపద

అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నో ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.

చిత్రకృప:Ilya Mauter

14. మార్గం

తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని. తిరువనంతపురంను త్రివేండ్రం అని కూడా అంటారు. చెన్నై-తిరువనంతపురం రైలు మార్గము. తిరువనంతపురము సెంట్రల్ స్టేషన్ నుండి 1 కి.మీ.

చిత్రకృప:Aravind Sivaraj

15. సమీప ప్రాంతాలు

ఈ దేవస్థానంకు దగ్గరగా వున్న"యానైమలై", అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ చూడదగినవి.

చిత్రకృప:Hans A. Rosbach

English summary

Hidden Secrets Of Padmanabhaswamy Temple

Padmanabhaswamy Temple is located in Thiruvananthapuram, Kerala. It is the richest Hindu temple in the world.
Please Wait while comments are loading...