Search
  • Follow NativePlanet
Share
» »రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే మిస్టీరియస్ బీచ్: ఒడిషాలోని హైడ్ అండ్ సీక్ బీచ్

రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే మిస్టీరియస్ బీచ్: ఒడిషాలోని హైడ్ అండ్ సీక్ బీచ్

ఒడిషాలో వుండే ఒక బీచ్ రోజుకి రెండు సార్లు కనుమరుగౌతుంది.ఈ బీచ్ చండిపుర సముద్ర తీరంలో హైడ్ అండ్ సీక్ అని కూడా పిలుస్తారు. ఎత్తైన అలలు అదేవిధంగా తక్కువ ఎత్తైన అలలు చూడవచ్చును.

By Venkatakarunasri

ఏంటి రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే బీచ్? అని ఆశ్చర్యపడుతున్నారా? అవును మీరు చదువుతున్నది అక్షరాలా నిజం.ఒడిషాలో వుండే ఒక బీచ్ రోజుకి రెండు సార్లు కనుమరుగౌతుంది.ఈ బీచ్ చండిపుర సముద్ర తీరంలో హైడ్ అండ్ సీక్ అని కూడా పిలుస్తారు. ఎత్తైన అలలు అదేవిధంగా తక్కువ ఎత్తైన అలలు చూడవచ్చును.

ఈ అలలు సుమారు 2 నుంచి 3 కి.మీ పైకి లేస్తుంది. తర్వాత పల్లంగా మారుతుంది. ఈ విచిత్రమైన దృశ్యం ప్రతినిత్యం చూడవచ్చును. కాబట్టి ఈ ఆశ్చర్యకరమైన బీచ్ చూడటానికి దేశ, విదేశాల నుండి పర్యాటకులు వస్తారు.

ప్రస్తుత వ్యాసంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన బీచ్ గురించి తెలుసుకుంటాం.

రోజుకి 2 సార్లు కనుమరుగయ్యే మిస్టీరియస్ బీచ్: ఒడిషాలోని హైడ్ అండ్ సీక్ బీచ్

ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఈ హైడ్ అండ్ సీక్ బీచ్ వుండేది ఒడిషా రాష్ట్రంలో. ఒడిషాలోని భువనేశ్వర్ నుంచి జాతీయరహదారి 5 మరియు 200 కి.మీ ల దూరంలో వుండే బాలసూర్ జిల్లా యొక్క రైల్వే స్టేషన్ నుంచి 16 కి.మీల దూరంలో ఈ సముద్రతీరముంది.

PC:Abinashjenatubulu

హైడ్ అండ్ సీక్

హైడ్ అండ్ సీక్

సాధారణంగా బీచ్ అంటే ప్రతిఒక్కరికీ ఎంతో ఇష్టంగా వుంటుంది.అయితే ఆశ్చర్యపరిచేటట్లు రోజుకి 2 సార్లు స్థానాన్ని మార్చే బీచ్ అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి.ఒక్క సారి చూసివచ్చిన బీచ్ మళ్ళా కనిపించదు అంటే అక్కడ జరిగే వింత చెప్పటానికి సాధ్యంకాదు.

PC:Wikipediaacc

బీచ్ యొక్క సౌందర్యం

బీచ్ యొక్క సౌందర్యం

ఈ బీచ్ ఎంతో అందమైనది. ఈ ఆశ్చర్యకరమైన బీచ్ లో పీతలను చూడవచ్చును.ముఖ్యంగా ఎర్రని పీతలను. సముద్రతీరం యొక్క ఆహారాన్ని ఇష్టపడేవారికి నోరూరించే స్వాధిష్టమైన
సముద్ర వంటకాలను ఆస్వాదించవచ్చును. ఇక్కడ ఒరియా మరియు బెంగాలీ భోజనాన్ని కూడా ఆస్వాదించవచ్చును.

చాలామందికి తెలియదు

చాలామందికి తెలియదు

తక్కువ మరియు ఎక్కువ అలల వ్యత్యాసం వల్ల చండీపురంలోని సముద్రతీరం ప్రసిద్ధిపొందినా కూడా ఈ రహస్యమైన ప్రదేశం గురించి మరీ అంత ఎక్కువగా పర్యాటకులకు తెలీదు.
ప్రపంచంలో ఏకైక స్థానాన్ని మార్చే బీచ్ అంటే ఇదే.పురి మరియు కోణార్క్ దేవాలయాలకి చూడటానికి వెళ్ళే అనేకమంది పర్యాటకులు కూడా ఈ అద్భుతమైన స్థలం గురించి తెలీదు.

సౌకర్యవంతమైన

సౌకర్యవంతమైన

ఈ అలలు చంద్రుని కదలికలను నిర్దిష్టసమయంలో అనుసరిస్తాయి.అదేవిధంగా మరింత ఆందమయమైన సమయాన్ని ఇక్కడ గడపటానికి అవకాశం వుంటుంది.

జీవ వైవిధ్యం

జీవ వైవిధ్యం

ఈ హైడ్ అండ్ సీక్ ప్రశాంతమైన సముద్రతీరమే కాదు అనేక జీవ వైవిధ్యాలు కూడా పుష్కలంగా వుంది.ఇక్కడ అనేక సముద్రప్రాణులను చూడవచ్చును.

సమీపంలో చూడవలసిన స్థలాలు

సమీపంలో చూడవలసిన స్థలాలు

చండీపుర సముద్ర తీర సమీపంలో అనేక ప్రదేశాలు చూడవచ్చును. అవి వరుసగా దేవకుండ జలపాతం, పంచలింగేశ్వర ఆలయం, ఖిరచోర గోపీనాథ్ ఆలయం, చందనేశ్వర్ ఆలయం, నీలగిరి జగన్నాథ ఆలయం వంటి ఆలయాలు అనేకం వున్నాయి.

సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ హైడ్ అండ్ సీక్ బీచ్ సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి మార్చ్ వరకు. ఎందుకంటే ఫిబ్రవరిలో అనేక నృత్యాలు, కళలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

ఈ హైడ్ అండ్ సీక్ బీచ్ చేరుకోవటానికి సమీప విమానాశ్రయం ఏదంటే భువనేశ్వర్. ఈ విమానాశ్రయం నేరుగా కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, రాయ్పూర్, నాగపూర్ మరియు ముంబై వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X