Search
  • Follow NativePlanet
Share
» »రహదారుల అభివృద్ధి లో ఇండియా !

రహదారుల అభివృద్ధి లో ఇండియా !

ఇండియా చాలా విశాలవంతమైన ప్రదేశం. ఇండియా లోని హైవే లు నేటికి బాగా అభివృద్ధి చెందాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక హైవే లు మనకు కనపడతాయి. ఈ హైవే లు రవాణా వ్యవస్థకు పునాదుల వంటివి. హైవే లు ఏర్పడిన తర్వాత ప్రయాణాలు సుఖవంతంగా సాగుతున్నాయి. రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందినది. ఇండియాలో కల ప్రధాన హైవే ల గురించి ఈ వ్యాసం మూలంగా కొంత తెలుసుకుందాము.

 నేషనల్ హైవే 1

నేషనల్ హైవే 1

రాష్ట్రీయ రహదారి 1 దేశ రాజధాని అయిన ఢిల్లీ ని భారత - పాకిస్తాన్ దేశాల మధ్య కల పంజాబ్ రాష్ట్రం కు కలుపు తుంది.

ఫోటో క్రెడిట్ : Ekabhishek

నేషనల్ హైవే 1D

నేషనల్ హైవే 1D

ఈ రహదారి ని శ్రీనగర్ - లెహ్ రహదారిగా పిలుస్తారు. ఈ రహదారి శ్రీ నగర్ - లడఖ్ లను లెహ్ మార్గం ద్వారా కలుపుతుంది.

ఫోటో క్రెడిట్ : Kondephy

 నేషనల్ హై వే 2

నేషనల్ హై వే 2

ఢిల్లీ - కోల్కత్త రహదారిని నేషనల్ హై వే 2 గా చ్లేపుతారు. ఈ రహదారిలో, ఢిల్లీ, హరియాన, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు కలుస్తాల్యి.

ఫోటో క్రెడిట్ : Raulcaeser

నేషనల్ హై వే 3

నేషనల్ హై వే 3

నేషనల్ హై వే 3 సాధారణంగా ముంబై - ఆగ్రా రహదారిగా పేర్కొంటారు. ఈ మార్గంలో ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కలుస్తాయి.

ఫోటో క్రెడిట్ : Hkore

 నేషనల్ హై వే 4

నేషనల్ హై వే 4

నేషనల్ హై వే 4 మహారాష్ట్ర లోని ముంబై నుండి దక్షిణ భారత దేశంలోని చెన్నై నగరానికి కలుపుతుంది. ఈ రహదారి లో సుమారు పది నగరాలు అధిక జనాభా గలవి మీకు తగులుతాయి. ఫోటో క్రెడిట్ Balaji.B

నేషనల్ హై వే 5

నేషనల్ హై వే 5

నేషనల్ హై వే 5 పొడవు 1533 కి. మీ. లు. తూర్పు కోస్తా తీరం ఓడిశా , ఆంధ్ర మరియు తమిళనాడు వరకు ఈ రహదారి విస్తరించి వున్నది.

ఫోటో క్రెడిట్ : Enthusiast10

 నేషనల్ హై వే 7

నేషనల్ హై వే 7

ఈ రహదారి ఉత్తర - దక్షినాలుగా విస్తరించి ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతుంది. దీని మొత్తం పొడవు 2,369 కి. మీ. లు

ఫోటో క్రెడిట్: arunpnair

నేషనల్ హైవే 8

నేషనల్ హైవే 8

భారత దేశ రాజధాని ఢిల్లీ ని భారత దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరాన్ని ఈ మార్గం కలుపుతుంది. దీని పొడవు 1428 కి. మీ. లు.

ఫోటో క్రెడిట్ : Lisa.davis

నేషనల్ హై వే 11

నేషనల్ హై వే 11

ఈ రహదారి ఉత్తర ప్రదేశ్ లని ఆగ్రా నగరాన్ని, రాజస్తాన్ లోని బికనీర్ పట్టణానికి కలుపుతుంది. దీని పొడవు 582 కి. మీ. లు.

ఫోటో క్రెడిట్ : Haros

నేషనల్ హైవే 13

నేషనల్ హైవే 13

మహారాష్ట్ర లోని సోలాపూర్ నగరం నుండి కర్ణాటక లోని బందరు పట్టణం మంగళూర్ వరకు ఈ రహదారి కలదు. దీని పొడవు 691 కి. మీ. లు

ఫోటో క్రెడిట్ Tomas Belcik

నేషనల్ హై వే 17

నేషనల్ హై వే 17

పశ్చిమ కనుమలలోని సముద్ర తీరం వరకు సాగే ఈ రహదారి మహారాష్ట్ర లోని పాన్వెల్ నుండి కేరళ లోని కోచి వరకు కొనసాగుతుంది. దీని పొడవు 1269 కి. మీ. లు.

ఫోటో క్రెడిట్: Rajaramraok

నేషనల్ హై వే 22

నేషనల్ హై వే 22

అంబాల పట్టణంలో మొదలయ్యే ఈ రహదారి, చండి ఘర్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ సమీపంలోని కచ్ వరకు సాగుతుంది. దీని పొడవు 459 కి. మీ. లు. ఫోటో క్రెడిట్ : Manojkhurana

నేషనల్ హై వే 31

నేషనల్ హై వే 31

ఈ రహదారి ఈశాన్య భారత దేశ పట్టణాలను టచ్ చేస్తుంది. బర్హి లో మొదలయ్యే ఈ రహదారి హౌహతి వరకు సాగుతుంది. దీని మొత్తం పొడవు 1125 కి. మీ. లు

ఫోటో క్రెడిట్ : Tanmoy Bhaduri

 నేషనల్ హై వే 43

నేషనల్ హై వే 43

ఈ రహదారి ఆంద్ర ప్రదేశ్ ను చత్తీస్ ఘర్ ను కలుపుతుంది. దీని మొత్తం పొడవు 551 కి. మీ. లు.

ఫోటో క్రెడిట్ : Paalappoo

నేషనల్ హైవే 45

నేషనల్ హైవే 45

దీనిని గ్రాండ్ సథరన్ ట్రంక్ రోడ్ అని పిలుస్తారు. ఈ రహదారి పొడవు 472 కి. మీ. లు.

ఫోటో క్రెడిట్ : Ashok Prabhakaran

 నేషనల్ హైవే 46

నేషనల్ హైవే 46

తమిళనాడు రాష్ట్రంలోని ఈ రహదారి క్రిష్ణగిరి నుండి మొదలై వాల్జా పెట్ వరకు కొనసాగుతుంది. దీని పొడవు 148 కి. మీ. లు .

ఫోటో క్రెడిట్ : Immanueldc

నేషనల్ హై వే 47

నేషనల్ హై వే 47

మొత్తం పొడవు 620 కి. మీ. లు గా కల ఈ రహదారి తమిళనాడు లోని సేలం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి వుంది.

ఫోటో క్రెడిట్: Smokingsingh

నేషనల్ హై వే 67

నేషనల్ హై వే 67

ఈ రహదారి కర్ణాటక మియు తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ, తమిళనాడు లోని నగపట్టినం లో మొదలై, కర్నాటక లోని చామరాజు నగర్ లోని గుండ్లు పెట్ వరకు విస్తరించినది.

ఫోటో క్రెడిట్ : Incrazy

నేషనల్ హై వే 68

నేషనల్ హై వే 68

కేవలం తమిళనాడు రాష్ట్రంలోని ఈ రహదారి ఉలున్దూర్, సేలం లను కలుపుతూ 134 కి. మీ. ల పొడవు కలిగి వుంటుంది. అయితే ఈ రహదారి హై వే 7 మరియు హైవే 4 లకు కూడా కలుస్తుంది.

ఫోటో క్రెడిట్ : Thamizhpparithi Maari

నేషనల్ హై వే 76

నేషనల్ హై వే 76

ఈ రహదారి ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ నగరం నుండి రాజస్తాన్ లోని పిండ్వారా పట్టణం వరకు కలుపుతుంది. దీని పొడవు మొత్తంగా 1007 కి. మీ.లు.

ఫోటో క్రెడిట్: Daniel Villafruela

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X