Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవారి మూలవిరాట్టు110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో ఉంటుందట గర్భగుడిలో !

శ్రీవారి మూలవిరాట్టు110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో ఉంటుందట గర్భగుడిలో !

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది.

By Venkatakarunasri

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

శ్రీవారి మూలవిరాట్టు110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో ఉంటుందట శ్రీ వేంకటేశ్వరస్వామిఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో వుంటుందో తెలుసా? స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతకలిగి వుంటుంది.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

తిరుమల కొండ 3000అడుగుల ఎత్తు కలది. తిరుమలకొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశం. తెల్లవారుజామున 4.30గంలకు చల్లనినీరు,పాలు,సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు.పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు.గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలనితీసేస్తారు.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

ఆ ఆభరణాలన్నీవేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు.మూలవిరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్కటీ అద్భుతమే.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

హుండి,అభిషేకాలు, పూజగదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోర్ట్ చాలా పెద్దది.శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం,పులిహోర,పోలి,అప్పం, వడ,జంతికలు,జిలేబి,పాయసం, దోస,రవకేసరి,బాదంకేసరి,జీడి పప్పు కేసరిలను ప్రతిరోజూతయారు చేస్తారు.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

అయితే శ్రీ వారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భ గుడిలో పెరుగన్నం మినహా ఏదీనైవేద్యంగా పోదు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించే పెరుగన్నంమాత్రం భక్తుడికి ప్రసాదంగా లభిస్తే అది మహాభాగ్యంఅని పురోహితులు అంటున్నారు.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

ఇక స్వామివారి వస్త్రాల సంగతికి వస్తే స్వామివారికి ధరించే పీతాంబరం 21అడుగుల పొడవు, 6 కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రువారం బిల్వదళాలతో అర్చన చేస్తారు.పండగనెల అంతటా బిల్వదళాలనే స్వామి వారికి అర్పిస్తారు.శివ రాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూదిసమర్పించి తిరుమాడవీధుల్లో వూరేగిస్తారు.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

ఇక్కడ సందర్శించదగిన ప్రదేశాలు

అలమేలు మంగమ్మ ఆలయం, తిరుపతి

అలమేలు మంగమ్మ ఆలయం అలమేలుమంగాపురం లో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామీ భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం. ఈ ఆలయం రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉండి ఆధ్యాత్మిక సాధనలో వున్న పర్యాటకులకు అనువైన గుడి.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

గోవిందరాజ స్వామి గుడి

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది. అలాగే ఇక్కడ మనవాల మాముని, శ్రీ చక్రాతాళ్వార్, సలాయి నాచియార్ అమ్మవారి, శ్రీ మచురకవి ఆళ్వార్, శ్రీ వ్యాసరాజ ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమంగాయి ఆళ్వార్, శ్రీ వేదాంత దేశికర్ ల చిన్న చిన్న ఆలయాలు కూడా వున్నాయి.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

పద్మావతీ దేవి గుడి, తిరుపతి

తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఈ ఆలయం పద్మావతీ దేవి జననం గురించి, పద్మావతీ వెంకటేశ్వరుల పరిణయం గురించిన గాథలను చెప్తు౦ద౦టారు.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

తోన్దమందలాన్ని పాలించే ఆకాశ రాజు ఒక యజ్ఞ౦ చేసినప్పుడు ఆయనకు ఒక తామరపువ్వు లో దొరికిన బిడ్డను పద్మావతీ దేవి పేరిట తన కూతురుగా పెంచుకున్నాడు. ఆవిడనే అలమేలు మంగ అని కూడా అంటారు - అంటే ప్రేమ, కరుణల నిరంతర, అక్షయ వనరు అని అర్ధం. ఆవిడ పెరిగి పెద్దదయ్యాక దైవ నిర్ణయంగా వెంకతెస్వ్హ్వార స్వామి ఆవిడను వివాహమాడారని చెప్తారు.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

శ్రీ వెంకటేశ్వరా జూలాజికల్ పార్క్, తిరుపతి

శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్1987 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. 5,532 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మగ కోడి, జింక, చిలక, చిరుత, అడవి ఏనుగులకి ఆవాసం. శాకాహార, మాంసాహార స్థలాలు, మగకోడి నివాస స్థలానికి పక్కన విస్తరి౦చీ ఉన్న పచ్చని మైదానాలు ఇక్కడ పెద్ద ఆకర్షణగా ఉన్నాయి.

pc:youtube

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

110 డిగ్రీలు ఉష్ణోగ్రతతో మూలవిరాట్టు

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X