అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

Written by: Venkatakarunasri
Updated: Friday, June 23, 2017, 12:39 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: కర్ణాటకలో చనిపోయిన యువకుడు మరలా లేచి కూర్చున్నాడు

మహాబలిపురం ఆలయంలో వుండేది ఎలియెన్స్ కి సంబంధించిన బండేనా ?

ఆడవారి రొమ్ములపై కూడా పన్ను వేసే నికృష్ట ఆచారం ఏ రాష్ట్రంలో వుందో మీకు తెలుసా?

ఖమ్మం భూపాలపల్లి అడవుల్లో అద్భుత నిర్మాణాలు. ఒకే చోట వేలసంఖ్యలో సమాధులు. గుట్టు విప్పేందుకు ముందుకొచ్చిన అమెరికావర్శిటీ. 10అడుగుల ఎత్తున్న రాతిఫలకాలతో చుట్టూ గోడ, 15 నుంచి 20 అడుగుల వెడల్పు, అడుగు మందంతో రాతిపైకప్పు దానికి చిన్నద్వారం, లోపల 10అడుగుల వెడల్పు, అంతే పొడవుండే గండ శిలతో చెక్కిన తొట్టి లాంటి ఆకృతి.

ఇది కూడా చదవండి: నాసిక్ - శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం !!

దానికి రాతి మూత, దాని బయట అస్పష్టమైన మానవాకృతిలో గండశిలలు ఆ ప్రాంగణం చుట్టూ భారీ శిలలు..! అలాంటివి ఒకటి కాదు రెండు కాదు.. వందలు... వేలు... దట్టమైన అడవిలో ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలు! ఇంతకూ ఏంటవి..?? ఎవరు నిర్మించారు.. ఎక్కడున్నాయి?

గోదావరి తీరం వెంట 3000ల ఏళ్ల నాటి మానవ చరిత్ర జాడలు

టాప్ 3 ఆర్టికల్స్ కోసం కింద చూడండి

గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

రాతి తొట్టిలో ఎముకలు కనిపించటంతో అవి సమాధులని, ఆదిమానవుల కాలానివని దాదాపు వందేళ్ల క్రితమే తేల్చారు. కానీ అవి ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణాలని అమెరికా కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం గుర్తించింది.

పూతరేకులు, మామిడితాండ్ర .. మన తీయని ఆత్రేయపురం !!

PC:youtube

 

గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

వీటిపై అధ్యయనానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందానికి ఆసక్తిగా ఉంది. ఇంతకూ ఆ నిర్మాణాలు ఎక్కడున్నాయో తెలుసా? భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల పరిధిలోని గోదావరి నదీతీరం వెంట!

విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం !!

PC:youtube

 

గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

వారంతా వలస వచ్చినవారా?

గోదావరి తీరం వెంట భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోని తాడ్వాయి, దామరవాయి, జానంపేట, దొంగలతోవు, సింగారం, గంగారం, కాచనపల్లి, గలబ, గుండాల... అటవీప్రాంతాల్లో వేల సంఖ్యలో సమాధులున్నాయి.

ఆంధ్రా పాలిట భూతలస్వర్గం ... 'కోనసీమ' !

అంతర్వేది .. గోదావరి సంగమ ప్రదేశం !

PC:youtube

 

గోదావరి తీరాన ఆదిమానవుల జాడలు !

వీటిని ఎవరు నిర్మించారన్నది ఇప్పటివరకు మిస్టరీగా ఉంది. తాజాగా సీసీఎంబీ నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో వారు వలస జీవులని తేలింది.

PC:youtube

 

ఎముకల డీఎన్‌ఏ

హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ ఆచార్యులు కేపీరావు ఆధ్వర్యంలో సర్వే జరిగిన సమయంలో సీసీఎంబీ.. ఖమ్మం జిల్లా ప్రాంతంలో ఈ సమాధుల్లోని ఎముకల డీఎన్‌ఏను పరీక్షించింది.

PC:youtube

 

ఆవాసం

అది స్థానికుల డీఎన్‌ఏతో సరిపోలలేదు. దీంతో వలస వచ్చినవారు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారని భావించారు.

ఖమ్మం జిల్లా - పర్యాటక ప్రదేశాలు !!

PC:youtube

 

డీఎన్‌ఏ పరీక్ష

దీన్ని రూఢీ చేసుకోవాలంటే ఈ సమాధులు విస్తరించిన ఇతర ప్రాంతాల్లో కూడా డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీసీఎంబీ భావిస్తోంది. దానికంటే ముందు వీటి గుట్టు విప్పేందుకు కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది.

PC:youtube

 

బలమైన చరిత్ర

ప్రపంచంలో మరెక్కడా లేని సంఖ్యలో.. ఆకృతిలో భిన్నంగా ఉన్న ఈ నిర్మాణాల వెనక బలమైన చరిత్ర ఉందని ఆ వర్సిటీ భావిస్తోంది.

PC:youtube

 

తెలంగాణ పురావస్తు శాఖ

తాజాగా ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ థామస్‌ లెవీ వాటిని పరిశీలించారు. వీటి గుట్టు విప్పేందుకు తెలంగాణ పురావస్తు శాఖ ముందు ప్రతిపాదన ఉంచారు.

బిక్కవోలు - అద్భుత శిల్పకళ ఆలయాలు !

PC:youtube

 

పశువుల కొట్టాల్లోకి తొట్లు

సమాధుల్లో రాతి తొట్లను స్థానికులు కొందరు అక్రమంగా ఇళ్లకు తరలించి పశువుల కొట్టాల్లో తొట్లుగా వాడుతున్నారు. వాటిపై అవగాహన లేకపోవటంతో అత్యంత అరుదైన సంపద ధ్వంసం అవుతోంది.

తెలంగాణలో తప్పక చూడవలసిన 25 ప్రదేశాలు !

PC:youtube

 

ఆ నిర్మాణాల్లో ఎన్నో ప్రత్యేకతలు

సాధారణంగా సమాధులు భూమి లోపల నిక్షిప్తమై ఉంటాయి. వాటికి గుర్తుగా పైన గండ శిలలను వృత్తాకారంలో పాతటం నాటి అలవాటు.

తలుపులమ్మ తల్లి దేవాలయం, తుని !!

PC:youtube

 

మానవాకృతి రాళ్లు

కానీ ఇక్కడ దానికి భిన్నంగా భూమి ఉపరితలంలోనే రాతి పలకలతో గుడారం తరహా నిర్మాణం ఉంది. సమాధుల ముందు అస్పష్టమైన మానవాకృతి రాళ్లు పాతి ఉన్నాయి.

PC:youtube

 

సెంట్రల్‌ యూనివర్సిటీ

మగవారి ఆకృతి ఉన్న రాళ్లు క్రెస్తవ శిలువ ఆకృతిని పోలి ఉన్నాయి. కానీ అది క్రెస్తవంతో సంబంధం లేదని సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పుల్లారావు తెలిపారు.

PC:youtube

 

మహిళా రూపం

మహిళా రూపం అయితే శిలలపై స్థనభాగం రూపొందించి ఉంది. ఇలాంటి ఆకృతులు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి.

కష్టాలు తొలగించే అయినవిల్లి గణపతి !!

PC:youtube

 

పలుమార్లు పరిశోధన

గతంలో ఈ నిర్మాణాలపై పలుమార్లు పరిశోధన జరిగినా 1982లో పురావస్తు అధికారి రామకృష్ణ వీటిని పరిశీలించి రిపోర్టు రూపొందించారు.

గోదావరి పుష్కరాలు ఎక్కడ ?? ఎలా ??

PC:youtube

 

తొలి మెరుగైన అధ్యయనం

1991లో పురావస్తు అధికారులు రంగాచారి, గోవిందరెడ్డిలు పరిశీలించి వీటిలోని తొట్టి తదితర వివరాలను బహిర్గతం చేశారు. స్వాతంత్య్రానంతరం తొలి మెరుగైన అధ్యయనం ఇదే.

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాలు !!

PC:youtube

 

డీఎన్‌ఏ పరీక్షలు

2000లో ప్రొఫెసర్‌ పుల్లారావు బృందం మరికాస్త పరిశోధించి వీటి ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వెల్లడించింది. వీరి ఆధ్వర్యం లోనే ఇటీవల డీఎన్‌ఏ పరీక్షలు జరిగాయి.

అడిగిన వెంటనే వరాలిచ్చే ... అన్నవరం సత్యనారాయణ స్వామి !!

PC:youtube

 

యునెస్కో గుర్తింపు

ఈ సమాధులు అరుదైనవి, అద్భుతమైనవి. శాన్‌ డియాగో విశ్వవిద్యాలయం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పరిశోధనలు చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఖమ్మం ఒక కోటల నగరం !!

PC:youtube

 

యునెస్కో గుర్తింపు

ఇన్ని వేల సంఖ్యలో మరెక్కడా సమాధులు లేవు. వాటి గుట్టువిప్పి ప్రపంచం ముందు పెడితే తెలంగాణకు తొలి యునెస్కో గుర్తింపు రావటం ఖాయం.

మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం !

PC:youtube

 

English summary

Human Traces By Aadimanavula History !

Khammam is the city in Khammam district of the Indian state of Telangana. It is the headquarters of the Khammam district and Khammam mandal as well.
Please Wait while comments are loading...