Search
  • Follow NativePlanet
Share
» »వేసవి సెలవులు ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం పాండిచ్చేరి..

వేసవి సెలవులు ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం పాండిచ్చేరి..

By Venkatakarunasri Nalluru

పాండిచ్చేరిని "పుదుచ్ఛేరి" అని కూడా పిలుస్తారు. పాండిచ్చేరి "తమిళనాడు" రాష్ట్రంలో ఉంది. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. తమిళంలో "పుదు" అంటే "క్రొత్త" అనీ, "చ్ఛేరి" అంటే "ఊరు" అని అర్థము.

క్రీ.శ. 4వ శతాబ్దం తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవ, చోళ , పాండ్య, విజయనగర రాజులు పాలించారు. "పుదుచ్ఛేరి" ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ ప్రధానభాష "తమిళం". కానీ ఇంగ్లీష్, ఫ్రెంచి భాషలు కూడా ఇక్కడ మాట్లాడుతారు.

ఇక్కడ పాండిచ్ఛేరి అతి ముఖ్యంగా చూడవలసినది మ్యూజియం. ఈ మ్యూజియంలో ఎన్నో కళాకృతులు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 'బీచ్' ఎంతగానో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇక్కడ అరవిందాశ్రమం ప్రశాంతతను కలిగిస్తుంది.

హైదరాబాద్ నుండి పాండిచ్చేరి టూర్

రూట్ 1: హైదరాబాద్ నుండి సూర్యాపేట - సూర్యాపేట నుండి ఒంగోలు - ఒంగోలు నుండి కావలి - కావలి నుండి నెల్లూరు - నెల్లూరు నుండి చెన్నై - చెన్నై నుండి మహాబలిపురం - మహాబలిపురం నుండి - పుదుచ్ఛేరి చేరవచ్చు. 786కి.మీ. దూరం ఉంటుంది. కారులో ప్రయాణించినట్లయితే 13గం.ల 11ని. పడుతుంది. బస్సులో 18గం. ల 15ని.ల సమయం పడుతుంది.

రూట్ 2: హైదరాబాద్ నుండి కర్నూలు - కర్నూలు నుండి వేలూరు - వేలూరు నుండి కాంచీపురం - కాంచీపురం నుండి మహాబలిపురం - మహాబలిపురం నుండి పుదుచ్ఛేరి చేరవచ్చు. ఈ మార్గం యొక్క దూరం 773కి.మీ. కారులో ప్రయాణించినట్లయితే 13గం. ల 26ని. పడుతుంది.

రూట్ 1: ఈ మార్గంలో చూడవలసిన మరికొన్ని స్థలాలు: నెల్లూరు, చెన్నై, మహాబలిపురం

నెల్లూరులో చూడవలసిన ప్రదేశాలు : మైపాడు బీచ్, జొన్నవాడ కామాక్షి దేవాలయం, ఇక్కడికి దగ్గరగా సూళ్లూరుపేటలో షార్ అంతరిక్ష రాకెట్ కేంద్రం కలదు.

చెన్నై : మెరీనా బీచ్, గాంధీ బీచ్, బేసంట్‌ నగర్ బీచ్, వళ్ళువర్ కోట్టమ్, అణ్ణాసమాధి, ఎమ్‌జీఆర్ సమాధి, రాజాజీ నినైవు ఇల్లమ్, గాంధి నినైవు ఇల్లమ్, ప్లానిటోరియమ్ (అడయార్),వండలూర్ జంతు ప్రదర్శనశాల

రూట్ 2: ఈ మార్గంలో చూడవలసిన మరికొన్ని స్థలాలు:

వేలూరులో బంగారు గోపురపు లక్ష్మీ దేవి టెంపుల్ చూడదగ్గది.

కాంచీపురం: కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజధాని. ఇక్కడ ఏకాంబరేశ్వర దేవాలయం, కామాక్షి దేవాలయం, వరదరాజస్వామి దేవాలయం దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాంతము కంచి పట్టుచీరలకు ప్రసిద్ధిగాంచినది .

మహాబలిపురం: మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది.

మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ చూడవలసిన ప్రాంతాలు. వీటిని చూడటానికి, ఫొటోలకి రుసుము లేదు పూర్తిగా ఉచితం. అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు. ఇవి చూడటానికి, ఫొటోలకి టికట్ తీసుకోవాలి. మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. సముద్రం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఉంది. ఇది కూడా చాలా దగ్గరే. బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.

బిగ్ రాక్: ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు వుంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.

హైదరాబాద్ నుండి పాండిచ్చేరి టూర్

బీచ్ : మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. కనుక సముద్ర స్నానం ప్రమాదకరం. గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇక్కడ బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువ మంది ఇక్కడ కనిపిస్తుంటారు. మీరు ఈ ప్రదేశాలను మార్గమధ్యంలో దర్శించుకోవచ్ఛును.

హైదరాబాద్ నుండి పాండిచ్చేరి టూర్

అరబిందో ఆశ్రమం: ఈ ఆశ్రమాన్ని 1926లో "అరబిందో" స్థాపించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించేవారు వేలమంది ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుస్తారు.

హైదరాబాద్ నుండి పాండిచ్చేరి టూర్

బీచ్ : పాండిచ్చేరిలో 4 ప్రధాన బీచ్ లు ఉన్నాయి: ప్రొమినేడ్ బీచ్, పారడైజ్ బీచ్, ఆరోవిల్ బీచ్ మరియు ప్రశాంతత బీచ్. పాండిచ్చేరి బీచ్ భారతదేశంలో చాలా రద్దీగా ఉండే ఇతర సముద్ర తీరాలు పోలిస్తే అందంగా శుభ్రంగా ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X