అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

Written by:
Published: Tuesday, December 13, 2016, 13:06 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

భక్తులారా !! మీకో ప్రశ్న. గుడిలో ప్రసాదంగా ఏమి ఇస్తారు ??
జవాబు : లడ్డు, కేసరి, శనగలు, పులిహోర, దద్దోజనం ... (ఇక చాలు ఆపండి).
ప్రశ్న : మీ ఫెవరెట్ ప్రసాదం ఏంటి ?
జవాబు : లడ్డు (తిరుపతి), పులిహోర, దద్దోజనం

అందరూ చాలా బాగా చెప్పారండీ !! అవునులెండి ఇండియాలో ఎక్కడ పోయినా నైవేద్యంగా ఇవేయిస్తుంటారు కదా !! కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర ప్రసాదాలను సైతం ఇవ్వటం ఇప్పటివరకు చూశాము (భారతదేశంలోని దేవాలయాలు - విచిత్ర ప్రసాదాలు !!) కానీ ఒక దేవాలయం ఉంది, అక్కడ నైవేద్యంగా బంగారం, వెండి ఇస్తుంటారు భక్తులకు. మరి ఆలస్యం చేయకుండా లటుక్కున పట్టుకొద్దాం పదండి.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

                                                     ఆలయంలో డబ్బుల కట్టలతో తోరణాలు

                                                      చిత్రకృప : Aakash Lalit Kothari II

భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే. అదే మహాలక్ష్మి దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ అనే ప్రాంతంలో కలదు. రత్లామ్ ప్రాంతం బంగారానికి, రత్లమి సేవ్ కు, రత్లమి చీరలకు ప్రసిద్ధి చెందినది.

మండు - విహార యాత్రకు చక్కటి ప్రదేశం !

రత్లామ్ లోని మహాలక్ష్మి గుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతకు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబుచేస్తారు. ప్రతిఏడాది ఈ గుడికి విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో బంగారం, వెండి కీలకం.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

                                                            గర్భాలయంలో లక్ష్మిదేవి

                                                           చిత్రకృప : Aakash Pujari

దీపావళి ప్రత్యేకం

ప్రతిఏడాది దీపావళి రోజున మహాలక్ష్మి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని మూడు రోజులపాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగేటప్పుడు అమ్మవారిని నోట్ల దండలతో, బంగారు, వెండి వస్తువులతో అలంకరిస్తారు. వీటి విలువ 100 కోట్ల పైమాటే. బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో ... !!

బాంధవ్ ఘర్ - పాండవులు వేటాడిన ప్రాంతం !

అంత భారీగా విరాళాలుగా వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకు ప్రసాదంలా తిరిగి ఇస్తుంటారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుండి రత్లామ్ చేరుకోవడం సులభం.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

                                            లక్ష్మిదేవత ఆలయం అంటే ఈ మాత్రం ఉండాలి సుమి !!

                                                               చిత్రకృప : Rakesh Porwal

ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం (బంగారం, వెండి) వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదు. అయినా భక్తులు దేవుని ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఆలస్యం చేయకుండా మీరూ వెంటనే ప్రసాదం తెచ్చేసుకోండి ..!

రత్లామ్ గురించి

రత్లామ్ సముద్రమట్టానికి 480 మీటర్ల ఎత్తున (1575 అడుగులు) మాళ్వా ప్రాంతంలో కలదు. మధ్యప్రదేశ్లోని రత్లమ్ జిల్లాకు హెడ్క్వాటర్స్ ఇది. రత్లమ్ అందమైన ఆలయాలకు నెలవు. ప్రసిద్ధి.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

                                                            జైన దేవాలయం

                                                     చిత్రకృప : Achintporwal

ప్రసిద్ధి చెందిన కల్కామత దేవాలయం కలెక్టరేట్ సమీపంలో ఉన్నది. క్యాక్టస్ గార్డెన్ ఇక్కడికి 20 కి.మీ ల దూరంలో ఉన్నది. శైలన వివిధ రకాలైన క్యాక్టస్ కు ప్రసిద్ధి. అలాట్ లో నాగేశ్వర టెంపుల్, జఒరా లోని హుస్సేన్ తెక్రి లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడి ఆకర్షణలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1) ఆర్కియోలాజికల్ ప్రదేశాలు 2) ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు.

ఇటార్సి - పర్యాటకులకు ఆసక్తిని కలిగించే ప్రదేశం !

1) ఆర్కియోలాజికల్ ప్రదేశాలు  

బిల్ పాకేశ్వర ఆలయం (18 కి.మీ రత్లామ్ నుండి), ఝర్ లోని శివాలయం (రత్లామ్ నుండి 12 కి. మీ), విరూపాక్ష మహాదెవ్ ఆలయం, అలోట్ షిపవ్ర ఆలయం, ధరోలా మహాదెవ్ ఆలయం (రత్లామ్ నుండి 84 కి.మీ), గార్ఖాన్‌ఖై దేవాలయం, శివగర్హ్ లోని కేదారేశ్వర ఆలయం, అమర్ జీ ఆలయం, జఒరా లోని అయన మహదేవ్ ఆలయం, బార్బాద్ మహదేవ్ ఆలయం మొదలగునవి చూడదగ్గవి.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

                                                            హనుమాన్ పాద గుర్తులు

                                                        చిత్రకృప : Abhishek.jangalwa

2) ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు

గులాబ్ చుక్కర్ పురావస్తు సంగ్రహాలయం, గాడ్ఖంగేమతా ఆలయం(౩౦ కి.మీ), కేదారేశ్వర ఆలయం (20 కి.మీ), ధొలవాద్ డామ్ (15 కి.మీ), సగోడ్ జైన్ ఆలయం, క్యాక్టస్ గార్డెన్, హుస్సేన్ తెక్రి, అందికల్పెశ్వర్ ఆలయం, ఖర్మోర్ బర్డ్ స్యాంక్చురీ, గంగా సాగర్ మొదలుగునవి చూడదగ్గవి.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

వసతి

రత్లామ్, జిల్లా ప్రధాన కేంద్రం కనుక వసతి సదుపాయాలు చక్కగా ఉంటాయి. టూ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, లాడ్జీలు మరియు గెస్ట్ హౌస్ లలో యాత్రికులు వసతి పొందవచ్చు.

'బంగారం' ను ప్రసాదంగా ఇచ్చే మహాలక్ష్మి దేవాలయం !!

                                                                 రైలు మార్గం

                                                           చిత్రకృప : Belur Ashok

రత్లామ్ ఎలా చేరుకోవాలి ?

రత్లామ్ చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చేరువలో ఉన్నాయి.

వాయు మార్గం : సమీపాన 104 కి. మీ ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కి. మీ ల దూరంలో ఉదైపూర్ ఏర్ పోర్ట్ లు కలవు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి రత్లామ్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : రత్లామ్ లో రేల్‌వే జంక్షన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదైపూర్, కోల్‌కతా ప్రాంతాల నుండి రెగ్యులర్ గా రైళ్ళు స్టేషన్ మీదుగా వెళుతుంటాయి.

బస్సు మార్గం/ రోడ్డు మార్గం : రత్లామ్ కు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సదుపాయం కలదు. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్ రాష్ట్ర బస్సులు, ట్యాక్సీ లు, క్యాబ్ లలో ప్రయాణించి చేరుకోవచ్చు.

English summary

Mahalaxmi Mandir : Gives Gold, Silver As Prasadam

When you visit temple, after god darshan you commonly get "Prasadam(food item)". But there is a temple in Madhya pradesh gives gold as a Prasadam.
Please Wait while comments are loading...