Search
  • Follow NativePlanet
Share
» »చేప కడుపులో అండర్ గ్రౌండ్ అక్వేరియం !

చేప కడుపులో అండర్ గ్రౌండ్ అక్వేరియం !

అక్వేరియాలను చూస్తే కేరింతలు కొడతాం. మరి బోలెడన్ని అక్వేరియాలను, వందల జాతుల చేపలను ఒకేసారి చూస్తే .. ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది! అక్వేరియాలలో చేపలు ఉండటం చూశాం .. కానీ ఒక పెద్ద చేపలో అక్వేరియం ఉండటం

By Venkatakarunasri

అక్వేరియాలను చూస్తే కేరింతలు కొడతాం. మరి బోలెడన్ని అక్వేరియాలను, వందల జాతుల చేపలను ఒకేసారి చూస్తే .. ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది! అక్వేరియాలలో చేపలు ఉండటం చూశాం ..

కానీ ఒక పెద్ద చేపలో అక్వేరియం ఉండటం ఎప్పుడైనా చూశారా ? అలాంటి అక్వేరియాన్ని చూడాలంటే జమ్మూకాశ్మీర్ కు వెళ్లాల్సిందే ! అక్వేరియం పేరు బాగ్ - ఎ - బహు .

ఈ అక్వేరియం స్పెషాలిటీ ఏంటో తెలుసా ? ఇది ఇండియాలోనే కాదు ఓరల్ భారత ఉపఖండంలోనే అతి పెద్ద అండర్ గ్రౌండ్ అక్వేరియం. అండర్ గ్రౌండ్ అంటే భూమి కింద ఉంటుందన్న మాట. దీనిని చేపల మ్యూజియం అని కూడా అంటారు.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

అక్వేరియం చూడటానికి వింతగా ఉంటుంది. దీనిని అచ్చం చేప ఆకారంలో నిర్మించారు. నోటి భాగం నుంచి మెట్లు దిగి లోనికి వెళితే మీకు గుహలు కనిపిస్తాయి. ఒక్కో గుహలో ఒక్కో అక్వేరియాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 24 గుహలు ఉన్నాయట !

ఈ మొత్తం 24 గుహలను మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో రెండు పెద్ద విశాలమైన గుహలు ఉంటాయి. వీటిలో పెద్ద పెద్ద సముద్ర చేపలు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

రెండవ భాగంలో 9 అక్వేరియాలు ఒక మోస్తరు గదుల్లా ఉంటాయి. ఇందులో సముద్ర జలచరాలు ఆకట్టుకుంటాయి. చివరగా మూడవ భాగంలో 13 అక్వేరియాలు ఉంటాయి. ఇవి చిన్న పాటి గాజు గదులను తలపిస్తాయి. వీటిలో కేవలం మంచి నీటి చేపలు మాత్రమే తిరుగుతుంటాయి. పైన పేర్కొన అన్ని అక్వేరియాలలో (24 అక్వేరియాలలో) మొత్తం కలిపి 500 పైగా దేశ విదేశీ చేపల జాతులు ఆకట్టుకుంటున్నాయి.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

సముద్రం లోపల వాతావరణం ఎలా ఉంటుందో , అచ్చం అలాగే అక్వేరియం లోపలి గదులు ఉంటాయి. పెద్ద పెద్ద బండరాళ్లు, రంగురాళ్ల, శంఖాలు, గచ్చికాయలు, ఇంకా ఎన్నో బోలెడు సముద్ర మొక్కలను పెంచుతున్నారు.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

ఈ అండర్ గ్రౌండ్ అక్వేరియాన్ని 1995 వ సంవత్సరంలో విద్యార్థులకు సముద్ర జలచరాలపై మంచి అవగాహన కలిపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అక్వేరియం గోడలపై సముద్రాలు, చేపలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని క్రోడీకరించి రాశారు.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

అక్వేరియం మొత్తం చూశాక, చేప తోక లో నుంచి బయటకు రావటం భలే తమాషా గా ఉంటుంది. దగ్గరలో బహు కోట మరియు అందులోని ఆలయం చూడదగినవిగా ఉన్నాయి. బాగ్ - ఎ - బహు అక్వేరియం లోనికి వెళ్ళటానికి ఎంట్రెన్స్ టికెట్ ఉంటుంది. చిన్న పిల్లలకు రూ.5/-, పెద్ద వారికి రూ. 10/- వసూలు చేస్తారు. పెంపుడు జంతువులకు ప్రవేశం లేదు.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

సందర్శన సమయం

సంవత్సరం పొడవునా అక్వేరియం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అక్వేరియం తెరిచే ఉంచుతారు. దేశ విదేశీ పర్యాటకులు వస్తుంటారు.

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం

బాగ్ - ఎ - బహు అక్వేరియం చేరుకోవటం ఎలా ?

బాగ్ - ఎ - బహు , జమ్మూ నగరంలో కలదు. జమ్మూ నగరానికి దేశంలోని అన్ని నగరాల నుండి చక్కటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

వాయు మార్గం

జమ్మూ లో ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రాంతాల నుండి విమానాలు వస్తుంటాయి.

రైలు మార్గం

జమ్మూ లో రైల్వే స్టేషన్ కలదు. ఢిల్లీ, చెన్నై, పుణె వంటి నగరాల నుండి రైళ్లు ఇక్కడికి తరచూ వస్తుంటాయి. ఆటో రిక్షాల సహాయంతో జమ్మూ సులభంగా చేరుకోవచ్చు.

బస్సు మార్గం

జమ్మూ పట్టణానికి చండీఘర్,లూథియానా, ఢిల్లీ తదితర సమీప ప్రాంతాల నుండి మరియు రాష్ట్రంలోని అన్ని పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X