Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో మరో తాజ్ మహల్ ఎక్కడ వుందో మీకు తెలుసా?

ఇండియాలో మరో తాజ్ మహల్ ఎక్కడ వుందో మీకు తెలుసా?

తాజ్ మహల్ పేరు చెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ గుర్తుకొస్తుంది. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన ఆ కట్టడం ప్రపంచవింతల్లో చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

By Venkatakarunasri

తాజ్ మహల్ పేరు చెప్పగానే మనకు ఆగ్రాలో షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ గుర్తుకొస్తుంది.

ముంతాజ్ ప్రేమకు గుర్తుగా ఆయన నిర్మించిన ఆ కట్టడం ప్రపంచవింతల్లో చోటు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే.

అయితే అచ్చం అలాగేకాకపోయినా మన దేశంలో మరో తాజ్ మహల్ కూడా వుంది.

ఇది మీకు ఆశ్చర్యం అనిపించినా అక్షరాలా నిజం.

ఆగ్రాలో వున్న అందమైన కట్టడం తాజ్ మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా నిలచి పేరుతెచ్చుకుంది.

ఈ అద్భుతకట్టడం గూర్చి మీ అందరికీ తెలిసిందే.

కానీ మన దేశంలో మరో తాజ్ మహల్ వుందన్నవిషయం కూడా వున్నదన్న విషయం చాలామందికి తెలీదు.

ఇండియాలో మరో తాజ్ మహల్.. ఎక్కడ వుంది...

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో వున్న మరోతాజ్ మహల్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

PC:youtube

అద్భుతమైన చారిత్రక కట్టడం

అద్భుతమైన చారిత్రక కట్టడం

ఈ తాజ్ మహల్ భోపాల్ లో వుండటం విశేషం. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన అద్భుతమైన చారిత్రక కట్టడం ఇది.

PC:youtube

ఎవరు నిర్మించారు?

ఎవరు నిర్మించారు?

భోపాల్ రాజ్యాన్ని పరిపాలించిన 11 వ పరిపాలకురాలు నవాబ్ షాజహాన్ బేగం ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు.

PC:youtube

1868నుంచి 1901

1868నుంచి 1901

1868నుంచి 1901వరకు ఆమె భోపాల్ ను పరిపాలించి నిర్మించిన కట్టడాలలో తాజ్ మహల్ కూడా ఒకటి.

PC:youtube

తాజ్- ఉల్- మస్జిద్

తాజ్- ఉల్- మస్జిద్

ఈ తాజ్ మహల్ ను భోపాల్ లోని అతిపెద్దదైన మసీద్ తాజ్- ఉల్- మస్జిద్ పక్కన నిర్మించారు.

PC:youtube

బేగం నివాసం

బేగం నివాసం

షాజహాన్ తన ప్రియురాలు కోసం తాజ్ మహల్ కట్టించాడు.కానీ భోపాల్ లోని తాజ్ మహల్ బేగం నివాసంగా రూపుదిద్దుకుంది.

PC:youtube

 70లక్షల రూపాయలు

70లక్షల రూపాయలు

ఆ కాలంలో 70లక్షల రూపాయలతో దీనిని నిర్మించారు.

PC:youtube

13సంల కాలంలో

13సంల కాలంలో

1871నుంచి 1884వరకు 13సంల కాలంలో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుంది.

PC:youtube

రాజ ప్రాసాదం

రాజ ప్రాసాదం

ఆ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన రాజ ప్రాసాదంగా నిర్మించటం విశేషం.

PC:youtube

ముగ్ధులైన బ్రిటీష్ పరిపాలకులు

ముగ్ధులైన బ్రిటీష్ పరిపాలకులు

మొదట దీనిని రాజ్ మహల్ పేరుతో పిలిచేవారు.ఆ తర్వాత భోపాల్ లో నివసించిన బ్రిటీష్ పరిపాలకులు దీని నిర్మాణం చూసి ఎంతో ముగ్ధులయ్యారు.

PC:youtube

 ఆర్కిటెక్చర్ పనితనం

ఆర్కిటెక్చర్ పనితనం

దీని ఆర్కిటెక్చర్ పనితనం వారికి బాగానచ్చి ఈ కట్టడాన్ని తాజ్ మహల్ గా పిలిచారు.

PC:youtube

వేడుకలు

వేడుకలు

ఇక భోపాల్ లో తాజ్ మహల్ నిర్మాణం పూర్తైన తర్వాత బేగం తాజ్ మహల్ పేరిట 3 సంలు పాటు వేడుకలు నిర్వహించారు.

PC:youtube

హమీదుల్లాఖాన్,సిందీఖాన్

హమీదుల్లాఖాన్,సిందీఖాన్

1947లో స్వాతంత్ర్యం వచ్చి దేశవిభజన జరిగిన తర్వాత నవాబు హమీదుల్లాఖాన్,సిందీఖాన్ లు ఈ ప్యాలెస్ లో నివసించేందుకు ఏర్పాట్లుచేసారు.

PC:youtube

బైరాగర్

బైరాగర్

వారు తాజ్ మహల్ లో నాలుగుసంలు పాటు నివసించారు.ఆ తర్వాత భోపాల్ లోని బైరాగర్ కు తమ నివాసాన్ని మార్చారు. ఈ కాలంలో ఈ రాజప్రాసాదం కొంత దెబ్బతిన్నది.

PC:youtube

భోపాల్ రాజవంశీయులు

భోపాల్ రాజవంశీయులు

ఆ తరువాత పలువురు భోపాల్ రాజవంశీయులు ఈ రాజ ప్రాసాదంలో నివసించి క్రమ క్రమంగా అక్కడనుండి వెళ్ళిపోయారు.

PC:youtube

 వివిధ రకాల శిల్పకళా పని తనం

వివిధ రకాల శిల్పకళా పని తనం

2008లో ఈ రాజ్ మహాల్లోని పలు భవనాలు కూలిపోయాయి. భోపాల్ లోని తాజ్ మహల్ ను వివిధ రకాల శిల్పకళా పని తనంతో అందంగా నిర్మించారు.

PC:youtube

120గదులు

120గదులు

బ్రిటీష్, ఫ్రెంచ్, అరబిక్,హిందూవాస్తు నిర్మాణ పద్ధతుల్లో దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్యాలెస్ లో 120గదులు నిర్మించారు.

PC:youtube

అద్దాలప్యాలెస్

అద్దాలప్యాలెస్

ఇందులో వున్న సీష్మాలనగా అద్దాలప్యాలెస్ అలాగే అతిపెద్దదైన సావన్ బడోప్రివిలియన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

PC:youtube

ద రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్

ద రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్

ఇక్కడ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 7అంతస్థుల భవనం చూడదగ్గది.భోపాల్ తాజ్ మహల్ పరిశోధన చేసిన హుస్సేన్ ఈ కట్టడంపై ప్రత్యేకంగా ద రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్ అనే పుస్తకాన్ని రాసారు.

PC:youtube

అతి పెద్ద ప్యాలెస్

అతి పెద్ద ప్యాలెస్

భోపాల్ లోని అతి పెద్ద ప్యాలెస్ గా దీనిని ఆయన అభివర్ణించారు.భోపాల్ తాజ్ మహల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

PC:youtube

 వేలాదిమంది పర్యాటకులు

వేలాదిమంది పర్యాటకులు

దేశవిదేశాలకు చెందిన వేలాదిమంది పర్యాటకులు ప్రతియేటా ఈ కట్టడాన్ని తిలకిస్తారు.

PC:youtube

 ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి నాగపూర్ మీదుగా భోపాల్ కు బస్సు ద్వారా 17గం.పడుతుంది.

కారులో అయితే 15గం లు పడుతుంది.

విమానమార్గం ద్వారా 2గంలలోనే చేరవచ్చును.

PC:google maps

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X