అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

పార్వతిదేవి ఒడిలో పవళించి ఉన్న శివుని యొక్క శివాలయం ఎక్కడ వుందో తెలుసా?

Written by: Venkatakarunasri
Updated: Monday, May 8, 2017, 9:21 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మహావిష్ణువు అనంతపద్మనాభస్వామిగా కొలువైన క్షేత్రాలు ఎన్నో వున్నాయి. అయితే ఎక్కడ చూసినా లింగాకారంలో తప్ప మరోవిధంగా కనిపించని శివుడు తన ప్రియపత్ని పార్వతిదేవి ఒడిలో పవళించి ఉన్న భంగిమలో వున్న అపురూపమైన విగ్రహాన్ని సందర్శించాలంటే చిత్తూరు జిల్లా సురటు పల్లి వెళ్ళవలసిందే. పల్లి కొండేశ్వరస్వామి క్షేత్రం తిరుపతికి 73 కి.మీ ల దూరంలో చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురటు పల్లి గ్రామంలో తిరుపతి,చెన్నై రహదారిని ఆనుకుని వుంది.

ఈ ఆలయంలో 14 అడుగుల పొడవున మానుష్య రూపంలో వున్న శివుడు తన దేవేరి పార్వతీదేవి ఒడిలో పవళించి సేదతీరుతున్నట్లుగా దర్శనమిస్తారు. శివుడు శయన మూర్తిగా పార్వతీదేవి సర్వమంగళా దేవిగా ఈ క్షేత్రంలో మాత్రమే దర్శనమిస్తారు.

చుట్టూ బ్రహ్మ, విష్ణువు, సూర్యచంద్రాదులు, నారదతుంబురుదాదులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, కులస్త్యుడు, వాల్మీకి, విశ్వామిత్రాదులు మహర్షులు, గణపతివల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, గాంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష సిద్ధసాధువులు, పల్లి కొండేశ్వరుని సన్నిధిలో కొలువుతీరి వుండగా స్వామి సేద తీరే దృశ్యం అద్భుతం. దేవదానవులు అమృతం కోరి క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల సముద్రం నుంచి భయంకర కాలకూట విషం వెలుగొందుతుంది.

పార్వతిదేవి ఒడిలో పవళించి ఉన్న శివుని యొక్క శివాలయం ఎక్కడవుందో తెలుసా?

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

లోక కళ్యాణార్థం

లోక కళ్యాణార్థం శివుడు ఆ విషాన్ని స్వీకరిస్తాడు. విషం గర్భంలోకి వెళ్ళకుండా పార్వతీదేవి తన పతి గొంతును నొక్కి పడుతుంది. దీనితో గొంతు భాగం నీలి రంగులోకి మారి శివుడు నీలకంఠుడు అవుతాడు. విషప్రభావానికి లోనైన శివుడు భరించలేని తాపంతో పార్వతీదేవి ఒడిలో సేదతీరుతాడు.

pc: youtube

దక్షిణామూర్తి

అలా సేదతీరిన క్షేత్రమే పల్లి కొండేశ్వర క్షేత్రమని భక్తుల విశ్వాసం. శివుడు 64 రూపాలలో ఒక్కటైన దక్షిణామూర్తి వృషభ వాహనంపై వామ భాగంలో గౌరీసమేతుడై దాంపత్య దక్షిణామూర్తిగా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.

pc: youtube

సీతాదేవి అరణ్యవాసంలో

సీతాదేవి అరణ్యవాసంలో కొంత భాగం ఈ ప్రాంతంలో వున్నప్పుడు ఆమె చెంతకు వచ్చారని నమ్మకం. అందుకు నిదర్శనంగా లవకుశల పాదముద్రలు ఈ సన్నిధానానికి సమీపంలో చూడవచ్చును. అలాగే రావణ సంహారణం అనంతరం శ్రీరాముల వారు బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు.

pc: youtube

లింగరూపం

మాములుగా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు లింగరూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు. చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అటువంటి సదా శివుడు, శ్రీ మహావిష్ణువు మాదిరిగా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉన్నది. అదే సురటు పల్లి.

pc: youtube

రాముడు ప్రతిష్టించిన లింగం

రాముడు ప్రతిష్టించిన లింగం కావటంతో రామలింగేశ్వరునిగా ప్రసిద్ధిచెందింది. సమస్త భూమండలంలో ఏకైక క్షేత్రంగా చిత్తూరు జిల్లా నాగలా పురం మండమలో విలసిల్లుతుంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉన్నది.

pc: youtube

అమృతం కోసం దేవదానవులు

పూర్వం అమృతం కోసం దేవదానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించుకోవడం కోసం పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశాడు. ఆ విష ప్రభావం కారణంగా తూలిన అయన, కొంతసేపు అమ్మవారి ఒడిలో సేదదీరాడు. ఆ సమయంలో దేవలంతా అక్కడికి చేరుకున్నారు.

pc: youtube

సురుల పల్లి

సురులంతా దిగివచ్చిన కారణంగా ఆ ప్రాంతాన్ని సురుల పల్లి అనే పేరు వచ్చింది. కాల క్రమంలో అది కాస్త సురటు పల్లిగా మారింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకి, శయన భంగిమలో గల శివుడిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది.

pc: youtube

దాంపత్యసేవ

గురువారం దాంపత్యసేవకు భక్తులు బారులు తీరుతుంటారు. ఏడు వారాలపాటు నిమ్మచెక్కలో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేస్తే అన్ని సమస్యలు తొలిగి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం.

pc: youtube

జీర్ణోద్ధారణ

విజయనగరాధీశుడు, హరిహరబుక్కరాయలు క్రీ.శ. 1344 - 47 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 18౩౩ లో శ్రీకాళహస్తి సంస్థానాధీశుడైన రాజువారు జీర్ణోద్ధారణ జరిపినట్లు ఆలయ కుడ్యాలపై లిఖింపబడి వుంది.

pc: youtube

కంచికామకోఠి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి

1979లో కంచికామకోఠి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొనగా పరమశివుడు చంద్రశేఖర సరస్వతుల వారికి సాక్షాత్కరించి దర్శనభాగ్యం కల్పించాడని దాంతో ఆయన కొన్నిరోజులపాటు ఈ ఆలయంలో గడిపాడని అంటారు.

pc: youtube

ఎలా వెళ్ళాలి?

తిరుపతి నుండి 73కి.మీ చెన్నై వైపుగా, చెన్నై నుండి 68 కి.మీ తిరుపతి వైపుగా ప్రయాణిస్తే చెన్నై-తిరుపతి జాతీయ రహదారిని ఆనుకుని వున్న ఈ ఆలయాన్ని చేరుకోవచ్చును. తిరుపతి నుండి సత్యవేడు వెళ్ళే ఎ పి ఎస్ ఆర్ టి సి బస్సులో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరవచ్చును.

pc: gogle maps

వసతులు

సురటుపల్లి చిన్న గ్రామం కావున ఇక్కడ బస చేసే సౌకర్యం లేదు. ఆలయ కాటేజీ రూంలు ఐదు వున్నాయి. ఇవి ఖాళీగా ఉన్నప్పుడు అద్దె చెల్లించి బస చేయొచ్చు. తిరుమల-తిరుపతి ఆలయం ఉచిత దేవస్తాన బస్సు ఈ ఆలయానికి వస్తూ వుంటుంది. తిరుమల-తిరుపతి నుండి ఉచితంగా వచ్చి ఈ ఆలయ దర్శనాన్ని చేసుకోవచ్చును.

pc: youtube

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

English summary

Interesting Facts About Palli Kondeswarar Temple - Surutapalli !

Palli Kondeswarar Temple is a Hindu temple dedicated to the god Shiva located in Surutapalli,a village in Chitoor district of Andhra Pradesh. Surutapalli is located 55 km away from Chennai.
Please Wait while comments are loading...