Search
  • Follow NativePlanet
Share
» »మీ ప్రశ్నకు అక్షరరూపంలో జవాబు ఇచ్చే శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా ?

మీ ప్రశ్నకు అక్షరరూపంలో జవాబు ఇచ్చే శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా ?

శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం దాసరిగట్ట అనే గ్రామంలో తిప్తూరుకు దగ్గరలో తుంకూరు జిల్లాలో కర్ణాటకలో కలదు. ఈ ఆలయం చిత్తూరుకు కేవలం 10కి.మీ ల దూరంలో వుంటుంది.బెంగుళూరు నుంచి చిత్తూరు 145 కి.మీల దూరం వుంది

ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షరరూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చును. ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించి వున్నారు. మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్రమోడీ కూడా 2006 లో ప్రైం మినిస్టర్ అవుతారని చెప్పి ఈ ఆలయంలో చెప్పినట్లు తెలుస్తుంది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ అయిన రవిశంకర్ గారు ఈ అమ్మవారికి పరమ భక్తులు.ఈ అమ్మవారి ఆలయ విశేషాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీ ప్రశ్నకు అక్షరరూపంలో జవాబు ఇచ్చే శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం !

1. ఆలయ సందర్శన

1. ఆలయ సందర్శన

ఈ ఆలయం దాసరిగట్ట అనే గ్రామంలో తిప్తూరుకు దగ్గరలో తుంకూరు జిల్లాలో కర్ణాటకలో కలదు. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఎవరైనా సరే వంద రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కుని ప్రశ్నకి కూర్చోవచ్చు.

pc:Bp

2. పంచలోహ విగ్రహం

2. పంచలోహ విగ్రహం

ముందుగా ప్రశ్నకు కూర్చునేటప్పుడు అమ్మవారిని దర్శించి ఇక్కడ ఒక ప్రదేశంలో కూర్చోగానే పంచలోహ విగ్రహాన్ని ఇద్దరు చదువుకుని విలేజ్ వాళ్ళు తీసుకురావటం జరుగుతుంది.

pc:Priya

3. కలశం

3. కలశం

ఆ పంచలోహ విగ్రహానికి పై వైపున ఒక కలశం వుంటుంది.ఆ కలశాన్ని త్రిప్పి రాసేటట్లుగా వుంచి బియ్యపు పిండి మీద మనం ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు కదిలిస్తూ వుంటారు.అమ్మవారిని కదిలిస్తూ వున్నప్పుడు అమ్మవారి కలశం అక్షరరూపంలో రాసుకుంటూ వెళ్తుంది. కానీ వారికాసంగతులు ఏమీ తెలీవు.

pc:Priya

4. బియ్యప్పిండి

4. బియ్యప్పిండి

అయితే అది జరిగిన తర్వాత మనం చెప్పుకుంటాం కదా షార్ట్ హ్యాండ్ ఆ మోడల్ లో వీళ్ళు కన్నడ భాషలో రాయటం జరుగుతుంది.మనం ఏ భాషలో ప్రశ్న అడిగినప్పటికీ లేదా మనం మనసులో అనుకున్నప్పటికీ వారు ఆ పాయింటర్ కదులుతూ బియ్యప్పిండి మీద రాస్తూ వెళ్తారు.దాన్ని చూసిన పూజారిగారు మనం అనుకున్న ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేస్తూ వుంటారు.

pc:Bp

5. భక్తుల విశ్వాసం

5. భక్తుల విశ్వాసం

దీన్ని ఎంతోమంది భక్తులు విశ్వసిస్తారు. ఇప్పటివరకు ఎవ్వరూగూడా అది తప్పయినట్లు చెప్పినటువంటి ఆధారాలు లేవు.ఎంతోమంది వారి యొక్క బందుమిత్రులు దూరం అయినప్పుడు, లేదా ఏదైనా వస్తువులు పోయినప్పుడు అంతేకాక ఎన్నో సమస్యలు ఎప్పుడు తీరుతాయి.

pc:Bhanu

6. అక్షరరూపంలో అనుభూతి

6. అక్షరరూపంలో అనుభూతి

జాబ్ లేకపోతే పెళ్లి ఇలా ఎన్నో విషయాలను ఈ అమ్మవారి సన్నిధికొచ్చి ప్రశ్నల రూపంలో తిరిగి వారికి కావలసిన సమాధానాల్ని అక్షరరూపంలో పొంది అనుభూతికి లోనై వెళ్తూవుంటారు.

pc:Bhanu

7. శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలి

7. శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలి

ఈ దాసరిఘట్ట ఆలయం చిత్తూరుకు కేవలం 10కి.మీ ల దూరంలో వుంటుంది.బెంగుళూరు నుంచి చిత్తూరు 145 కి.మీ ల దూరంలో వుంటుంది.

pc:Bhanu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X