అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

భారతదేశంలో హనుమంతుని విగ్రహం లేని రామాలయం ఎక్కడుందో తెలుసా ?

Written by: Venkata Karunasri Nalluru
Updated: Tuesday, June 6, 2017, 11:38 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధ శివాలయం కీసర గుట్ట చరిత్ర

భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు !

ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన హిందూ దేవాలయం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ కోదండరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి మూలమూర్తులు. ఒంటిమిట్టకు ఆంధ్రా భద్రాచలం అనే పేరు కూడా వుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.

ఇది కూడా చదవండి: జైసల్మేర్ లోని తన్నోట్ మాతా ఆలయం - అంతుచిక్కని రహస్యాలు

ఒంటిమిట్టలోని కోదండ రామాలయం విశేషాలు

1.ఒకే శిల

ఒంటిమిట్ట ఆలయంలో రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠిండు. ఇక్కడ ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు.

చిత్రకృప: Kanheya Behera Follow

 ఇది కూడా చదవండి: కొల్లిమలై రహస్యం రహస్యం గురించి మీకు తెలుసా!

 

 

2. శ్రీరామ తీర్థము

సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణం చెపుతుంది. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది.

చిత్రకృప: Step

3. గోపుర నిర్మాణము

ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది.

చిత్రకృప:rajaraman sundaram

4. ఏకశిలానగరం

ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది.

చిత్రకృప:Trulyajays

5. శ్రీరామచంద్రుని భక్తుడైన పోతన

పోతన తను రాసిన భాగవతాన్ని కోదండ రామునికి అంకితం గావించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు.

చిత్రకృప:sowrirajan s

 

6. స్థల పురాణం

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

చిత్రకృప:Kodandaram

7. హనుమంతుడు విగ్రహం లేని రామాలయం

ఈ ఆలయంలోని ఒకే శిలలో శ్రీరామ, సీత, లక్ష్మణ విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల పరిచయానికి ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు చెప్పవచ్చును.

చిత్రకృప: Siva1249

8. గోపురద్వారాలు

ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది.

చిత్రకృప:MADHURANTHAKAN JAGADEESAN

9. చోళ పద్ధతి

గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది.

చిత్రకృప:Krishna Jakkinapalli

 

10. సంజీవరాయ దేవాలయం

గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయంను చూడవచ్చును. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల,రథం కూడా చూడవచ్చును.

చిత్రకృప:Sriniketana

11. రామాయణ భాగవత కథలు

చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు.

చిత్రకృప:MADHURANTHAKAN JAGADEESAN

12. ట్రావెర్నియర్

చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు.

చిత్రకృప:Krishna Jakkinapalli

13. సహజకవి

పోతనకు సహజకవి అని పేరు వుంది. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు.

చిత్రకృప:V Sambasiva Rao

14. శ్రీరామనవమి ఉత్సవాలు

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రశాంత వాతావరణానికి నెలకొని వుంటుంది. టూరిజం శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

చిత్రకృప:Mohankrish999

15. ఇమాంబేగ్

ఒంటిమిట్టలో ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు.

చిత్రకృప:Dilli20

16. ఇమాంబేగ్ బావి

అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇక్కడి విశేషం.

చిత్రకృప:Kashyap Kondamudi

17. విదేశీయుల సందర్శన

పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి వచ్చి ఆలయ శిల్ప సంపద చూసి ఆశ్చర్యపోతారు.

చిత్రకృప:MADHURANTHAKAN JAGADEESAN

18. పూజలు, ఉత్సవాలు

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు.

చిత్రకృప:Bhaskaranaidu

19. మహాకవి పోతన విగ్రహం

2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చిత్రకృప:రహ్మానుద్దీన్

20. ఒంటిమిట్టకు ఎలా చేరుకోవాలి

కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో కడపకి 27 కి.మీ. ల దూరంలో వున్నది. కడప నుంచి బస్సు సౌకర్యం వున్నది.

చిత్రకృప:google maps

21. విమాన మార్గం

విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఏదైనా ప్రవేట్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. కడప విమానాశ్రయం కొత్త కాబట్టి విమాన సర్వీసులు ఇంకా అంతగా అందుబాటులో లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్రకృప:Sriniketana

22. రైలు మార్గం

ఒంటిమిట్ట లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన గానీ లేదా షేర్ ఆటోలో గానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే భాకరపేట్ రైల్వే స్టేషన్ (7 కి.మీ), కడప రైల్వే స్టేషన్ (25 కి.మీ) మరియు తిరుపతి రైల్వే స్టేషన్ (106 కి.మీ) లు ఒంటిమిట్ట కు చేరువలో ఉన్నాయి.

చిత్రకృప:Krishna Jakkinapalli

23. రోడ్డు మార్గం

ఒంటిమిట్ట కు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. కడప నుండి ప్రతి రోజు అరగంటకోసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. కడప 7 రోడ్ల కూడలి వద్ద కానీ లేదా కడప ప్రధాన బస్ స్టాండ్ నుండి కానీ లేదా కడప పాత బస్ స్టాండ్ నుండి కానీ ప్రభుత్వ బస్సులు ఎక్కొచ్చు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఏపి ఎస్ ఆర్ టీ సి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

చిత్రకృప:MADHURANTHAKAN JAGADEESAN

English summary

Interesting Facts About Vontimitta Temple

Vontimitta temple is the largest temple in the region. It is located at a distance of 25 km from Kadapa.
Please Wait while comments are loading...