Search
  • Follow NativePlanet
Share
» »పంచకుల - పర్యాటకులకు విశ్రాంతి కేంద్రం !!

పంచకుల - పర్యాటకులకు విశ్రాంతి కేంద్రం !!

మొర్ని హిల్ పంచకుల లోని ఏకైక పర్వత ప్రాంత౦. ఇది హర్యానాలో ఎత్తైన ప్రదేశం. ఇది శివాలిక్ కొ౦డలలో ఒక భాగం. పింజోర్ తోటలు అద్భుతమైన ముఘల్ తోటలకు ప్రసిద్ది గాంచినవి.

By Mohammad

పంచకుల అనే పేరు ఐదు నీటిపారుదల కాలువలు, పాయల నుండి పెరుగంచిందని స్థానికులు చెప్తారు. ఈ కాలువలు ఘగ్గర్ నదినుండి నీరు తీసుకుని నాద సాహిబ్, మానస దేవి వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు పంచుతారు. ఈ కాలువలు గ్రామంలోని వారిచే నిర్వహి౦చబడుతూ స్థానికులకు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఇది కూడా చదవండి : యమునా నగర్ - అందమైన నేచర్ పార్కులు !!

పంచకుల లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు:

మొర్ని హిల్ పంచకుల లోని ఏకైక పర్వత ప్రాంత౦. ఇది హర్యానాలో ఎత్తైన ప్రదేశం. ఇది శివాలిక్ కొ౦డలలో ఒక భాగం. పింజోర్ తోటలు అద్భుతమైన ముఘల్ తోటలకు ప్రసిద్ది గాంచినవి. వీటిని యాదవింద్ర తోటలు అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ్ లోని కసులి కి పంచకుల నుండి 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది.

కాక్టస్ తోట

కాక్టస్ తోట

పంచకుల లోని కాక్టస్ తోట ఆసియా లోనే అతిపెద్దది, ఇక్కడ అరుదైన, అంతరించిపోయే ప్రమాదపు కాక్టస్ జాతులు భారీ సేకరణ ఉంది. ఈ తోటను అన్వేషించే సమయంలో ఒపున్టియాస్, ఫేరో కాక్టస్, అగవేస్, కలుమ్నార్ కాకతి, ఎచినో సెరిస్, మమ్మిలారియాస్ వంటి కొన్ని కాక్టస్ రకాలను ఇక్కడ చూడవచ్చు.

చిత్రకృప : Raimundo Pastor

యదవింద్ర గార్డెన్ పింజోర్

యదవింద్ర గార్డెన్ పింజోర్

యదవింద్ర గార్డెన్ లేదా పింజోర్ గార్డెన్ పింజోర్ లో ఉంది. పటియాల వంశ పాలకులచే నిర్మించబడిన ఈ గార్డెన్ ముఘల్ శైలిని ప్రతిబింబిస్తుంది. పర్యాటకుల గదులు, రెస్టారెంట్లు విద్యుదీకరణ ఫౌంటైన్ లతో ఉంటాయి.

చిత్రకృప : Shahnoor Habib Munmun

నాద సాహిబ్

నాద సాహిబ్

నాద సాహిబ్ పంచకుల లోని ధార్మిక ప్రదేశాలలో ఒకటి. ఈ గురుద్వారం శివాలిక్ కొండ దిగువ భాగాన, ఘగ్గర్ నది ఒడ్డు వద్ద నగరం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సిక్కులకు చాలా ప్రసిద్ది గాంచింది. ఈ మందిరానికి చెందిన పవిత్రమైన జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది.

చిత్రకృప : varun Bajaj

కాళిమాత ఆలయం

కాళిమాత ఆలయం

కాళిమాత మందిరం 22 వ జాతీయ రహదారిపై ఉంది. ఇది కల్క పట్టణం గుండా నడుస్తుంది. కాళీమాత కు చెందిన ఈ ప్రసిద్ధ ఆలయం హిందువుల యాత్రాస్థలంగా పేరుగాంచింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఇది ఈ ప్రాంతంలోని హిందూ యాత్రలలో చాలా ప్రసిద్ది చెందింది.

చిత్రకృప : Barthateslisa

మొర్ని కొండలు

మొర్ని కొండలు

మొర్ని కొండలు లేదా భోజ్ జబిఅల్ హర్యానాలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పంచకుల అదేవిధంగా హర్యానా లో ఎత్తైన ప్రదేశం. ఇది చండీగర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధమైన హిమాలయ వీక్షణ సరస్సులు, వివిధ రకాల వృక్ష జాతులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

చిత్రకృప : Karan1999

మానస దేవి ఆలయం

మానస దేవి ఆలయం

పంచకుల లోని మానస దేవి ఆలయం హిందువులు కోరుకునే యాత్రా స్థలాలలో ఒకటి. ఈ ఆలయం మానస దేవి లేదా శక్తి కి అంకితం చేయబడింది. 100 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఆలయం, శివాలిక్ కొండల దిగువ భాగాన ఉంది.

చిత్రకృప : Ekabhishek

పంచకుల ఎలా చేరుకోవాలి ?

పంచకుల ఎలా చేరుకోవాలి ?

రోడ్డుద్వారా : చండీగర్ కి రోడ్డుమార్గాల బాగా అభివృద్ది చెందబడి, కలుపబడి ఉన్నాయి, హర్యానాలోని ఇతర ప్రాంతాల గుండా మంచి రోడ్డు రవాణా నెట్వర్క్ ఉంది.

రైలు ద్వారా :పంచకుల కి సమీప రైల్వే స్టేషన్ చండీగర్

విమానం ద్వారా : పంచకుల లో స్వంత విమానాశ్రయం లేదు. చండీగర్ నుండి విమానాలు అందుబాటులో ఉంటాయి.

చిత్రకృప : Ekabhishek

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X