అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

రామేశ్వరం వెళితే తప్పక చూడవలసిన దర్శనీయ స్థలాలు !!

Written by:
Published: Wednesday, February 8, 2017, 12:11 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ (హిందూ అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ...) తప్పక సందర్శించవలసిన యాత్రా స్థలం రామేశ్వరము (రామేశ్వరం). విశాల భారతదేశంలో ఇటువంటి యాత్రా స్థలాలు నాలుగు (రామేశ్వరం తో కలిపి) ఉన్నాయి. ఇవి భారతదేశంలో నాలుగు దిక్కులలో వెలిశాయి. తూర్పున పూరీ, పశ్చిమాన/పడమర దిక్కున ద్వారకా, ఉత్తరాన బద్రీనాథ్ మరియు దక్షిణాన రామేశ్వరము కలవు.

తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం ఈ రామేశ్వరం.ఈ పట్టణములో ద్వాదశ జోత్యిర్లింగాలలో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉంది. ఇది దేశంలో ప్రసిద్ధి గాంచినది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మీ. ల దూరములో ఉన్నది. ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్వస్థలం కూడా ఇదే !!

ఇది కూడా చదవండి : కుట్రాలం - దక్షిణ భారతదేశ చికిత్సాలయం !!

ఇతిహాస నేపథ్యం

హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరములో రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.

శంఖు ఆకారం

రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్పీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది. శంఖు ఆకారములో ఉన్నఈ ద్వీపము విస్తీర్ణం 61.8 చదరపు కి.మి.

చిత్రకృప : Nataraja~commonswiki

రామేశ్వరం లో ఏమేమి చూడవచ్చు ?

రామేశ్వరం దీవి, సముద్ర కెరటాలు, పక్షులు, బంగారు రంగులో మెరిసిపోయే ఇసుకతిన్నెలు, బంగారం లాంటి మనసులు, యాత్రికులు, రామనాథస్వామి గుడి, చిన్న చిన్న అంగళ్ళు, గవ్వలతో చేసిన వస్తువులు, గుర్రపు బళ్ళు, నీలి రంగులో మైమరపించే సముద్రం ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదంటే నమ్మండి!

చిత్రకృప : Adityabhagat149

ఆధ్యాత్మికమే కాదు ... అద్భుతమైనది

రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలే గానీ చాలా ప్రదేశాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కొటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోడి, విభిషనాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. రామేశ్వరం గుడిలో నీటిపై తేలియాడే 15 కేజీల రాయి ప్రత్యేక ఆకర్షణ.

చిత్రకృప : Indiancorrector

రామనాథస్వామి దేవాలయం - ద్రవిడ శిల్పకళా చాతుర్యం

ఈ ద్వీపము యొక్క భూభాగాని ఎక్కువగా రామనాథస్వామి దేవాలయం ఆక్రమిస్తుంది.ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక. ఇక్కడ నుండి శ్రీలంక దేశము కనిపిస్తూ ఉంటుంది. శ్రీలంక ప్రధాన పట్టణం కొలంబొ 112 కి.మి. దూరములో ఉంది.

దేవాలయం గురించి మరిన్ని విశేషాల కొరకు క్లిక్ చేయండి.

చిత్రకృప : Wandering Tamil

ఖండ్రిక గ్రామము

రామేశ్వరము ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రము. ఇచట శ్రీ కృత కృత్య రామలింగేశ్వర స్వామి వారు ఉన్నారు. కాలక్రమేణ ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుపబడింది. ఈ గ్రామంలో రంగనాథ, శ్రీ రామ, ఎల్లమ్మ, గంటలమ్మ, ఆలయాలు ఉన్నాయి.

చిత్రకృప : Amlantapan1

పంబన్ బ్రిడ్జి

పంబన్ బ్రిడ్జి ఇండియాలో కట్టిన మొట్టమొదటి సముద్ర వంతెనగా చెబుతారు. దీనిని పాక్ జలసంధి పై పంబన్ ద్వీపానికి, రామేశ్వరం పట్టణానికి మధ్యన నిర్మించారు. పెద్ద పెద్ద ఓడలు, స్టీమర్లు వస్తే బ్రిడ్జి రెండుగా విడిపోయి పైకి లేవడం .. అవి వెళ్ళాక మరలా యధాస్థానానికి రావటం ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. ఒకేవేళ మీరు రైలులో ఈ బ్రిడ్జి మీద ప్రయాణిస్తే మధుర జ్ఞాపకాన్ని గుర్తుకుచేసుకుంటారు.

చిత్రకృప : Ramesh050998

గంధమాదన పర్వతం

రామేశ్వరంలో ఎత్తైన ప్రదేశం ఈ పర్వతం. ప్రధాన ఆలయానికి ఉత్తరాన 3 కి.మీ. ల దూరంలో ఇది ఉన్నది. ఇదొక వ్యూ పాయింట్. కొండపై రామర్పథం టెంపుల్ చూడవచ్చు. రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళుతున్నప్పుడు ఇక్కడ నగలు పారవేసిందని చెబుతారు. కొండపై నుండి రామేశ్వరం దృశ్యాలు చూడవచ్చు.

చిత్రకృప : Ryan

ధనుష్కోటి

ధనుష్కోటి రామేశ్వరంలోని ఒక గ్రామము మరియు శ్రీలంక భూభాగం ఇక్కడి నుండి మూడు కిలోమీటర్లు మాత్రమే. ఇతిహాసం ప్రకారం రావణుడు సోదరుడు విభీషణుడు, రాముడిని సేతు ను పడగొట్టమని కోరతాడట. అప్పుడు రాముడు ధనుస్సుతో సేతును పడగొడతారు. ఇప్పటికీ ఆ సేతు (బ్రిడ్జి) ఆనవాళ్ళను ధనుష్కోటిలో గమనించవచ్చు. కాశీ వెళ్ళొచ్చినవారు ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.

చిత్రకృప : M.Mutta

వాటర్ బ్రిడ్జి సాంక్చువరి

ఈ సాంక్చువరి వలస పక్షులకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకు ఇక్కడ వలస పక్షులు వచ్చి సందడి చేస్తుంటాయి. ఇక్కడ వలస పక్షులు మరియు స్థానిక పక్షులు రెండూ కూడా చూసి ఆనందించవచ్చు. బైనాక్యులర్ తీసుకువెళ్ళటం మరవద్దు !!

తెరుచు సమయం : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజూ

చిత్రకృప : Ve.Balamurali

రామేశ్వరంలో చూడవలసిన ఇతర దేవాలయాలు

కోదండరామ టెంపుల్, పంచముఖ హనుమాన్ ఆలయం, నంబు నయగి అమ్మన్ టెంపుల్, రామలింగం విలాసం ప్యాలెస్, సాక్షి హనుమాన్ టెంపుల్, ఉత్తిరకోశమంగై, విల్లుంది తీర్థం, అగ్ని తీర్థం, జడ తీర్థం, టెంపుల్ ట్యాంక్ లేదా దేవాలయం చుట్టుప్రక్కల గల తీర్థాలు, అన్నాయి ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జి, కురుసడాయి ద్వీపం, ఆడం బ్రిడ్జి, అరియమాన్ బ్రిడ్జి మొదలగునవి చూడవచ్చు.

చిత్రకృప : Nsmohan

వసతి

రామేశ్వరంలో వసతి సదుపాయాలూ చక్కగా అందుబాటులో ఉన్నాయి. అన్ని తరగతులవారికి గదులు దొరుకుతాయి. ఏసీ, నాన్ - ఏసీ గదులతో పాటు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లు కలవు. స్థానిక ఆహారాలు రుచించదగ్గవి.

చిత్రకృప : Nsmohan

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం: రామేశ్వరము సమీపాన మదురై దేశీయ విమానాశ్రయం కలదు. టాక్సీ లేదా క్యాబ్ ఎక్కి రామేశ్వరం సులభంగా చేరుకోవచ్చు.

రైలు మార్గం : చెన్నై నుండి రామేశ్వరానికి ప్రతి రోజూ రెండు, మంగళ, శని వారాలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు రైళ్ళు తిరుగుతుంటాయి. యాత్రికులు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవటం సూచించదగినది.

రోడ్డు మార్గం : చెన్నై మరియు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల నుండి రామేశ్వరం కు ప్రతి రోజూ ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : PP Yoonus

English summary

Interesting Places Visit In Rameshwaram

Rameshwram is a small Island and Pilgrim centre and located 570 KM from the state capital Chennai. This town has so many attractions. Apart from Ramanathaswamy temple, pamban bridge are major toursit attractions.
Please Wait while comments are loading...