అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఈ వేసవి సెలవులకు సిక్కింలోని అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ చూసి ఎంజాయ్ చేద్దాం !

Written by: Venkatakarunasri
Updated: Wednesday, May 3, 2017, 11:39 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

కొత్తకొత్తగా నున్నది.. స్వర్గామిచ్చటే నున్నది.. కోటి తారలే పూల ఏరులై నేల చేరగా..నే అని పాడుకోవాలనుంది కదూ ! అవునండీ నిజంగానే స్వర్గంలో విహరించాలని వుంది కదూ ! అయితే సిక్కిం పూల తోటలో విహరించేందుకు రెడీ అయిపోండి ! పూలంటే ఎవరికి ఇష్టం వుండదండి. అందుకే పూల ప్రియుల కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ పూల ఫెస్టివల్ ఏర్పాటుచేశారు.

ఎక్కడనుకుంటున్నారు? సిక్కిం రాష్ట్రంలోనండి. అవునండి సిక్కింలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది. ఎలాగో పిల్లలకు వేసవిసెలవులు వచ్చేసాయి కదా ! రిలాక్స్ కోసం మైండ్ రిఫ్రెష్ కోసం ఎక్కడైనా డిఫరెంట్ ప్లేస్ కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మాకు తెలుసండీ. అందుకే చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలిగే స్థలం. అదేనండీ అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్. సిక్కింలో ప్రతిసంవత్సరం పండుగలాగా జరుగుతుంది !

Latest:కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !
కాణిపాకం వినాయకుడి ఆలయం రహస్యం మీకు తెలుసా?
తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడ వుందో మీకు తెలుసా ?
రాత్రిపూట ఈ ఆలయంలో అమ్మవారు మాట్లాడుతుంది !

భారతదేశంలో ఈశాన్యంలో వున్న సిక్కిం చాలా అందమైన రాష్ట్రం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం. ఇక్కడ సహజ అందం, సంస్కృతి, స్థానిక ప్రజలు మొదలైన విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి.

ఈ వేసవి సెలవులకు సిక్కిం అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ ను చూసి ఎంజాయ్ చేద్దాం

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ప్రకృతి సౌందర్యాలు

ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఒదిగినట్లు వుండటంవల్ల, చక్కటి ప్రదేశాలు, మంచుకిరీటాన్ని ధరించిన పర్వతాలు, పూల పాన్పు వంటి మైదానాలు, దివ్యమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అనిపించే విధంగా సిక్కిం పర్యటన పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక అందమైన అనుభూతిగా పర్యాటకుల అభివర్ణిస్తారు.

ఇది కూడా చదవండి: గాంగ్ టక్ లో సందర్శించదగిన ప్రసిద్ధ ప్రదేశాలు

2. రాజధాని గ్యాంగ్టక్

సిక్కిం భారతదేశపు ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా కలిగి ఉంది. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం కూడా. సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గ్యాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం.

సిక్కిం రాష్ట్ర సంక్షిప్త సందర్శన !

3. ఫ్లవర్ ఫెస్టివల్

అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ చాలా సరదాగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు మీ జీవితంలో ఒక్కసారైనా చూసి ఆనందించవలసిన ప్రదేశం.

సిక్కిం ఆకర్షణలు...బౌద్ధ ఆరామాలు!

4. ఉత్సాహముతో పండుగ

ఈ అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ గాంగ్టక్ లో జరుగుతుంది. మీరు ప్రకృతి ప్రియులు కాబట్టి ఆ పూల పరిమళాలు ఆస్వాదించటానికి మీకు గాంగ్టక్ సరైన ప్రదేశం. ఇక్కడ అందమైన గులాబీలు, ఫెర్న్లు, ఆల్పైన్ మొక్కలు మరియు అనేక జాతుల చెట్లు గురించి మరింత తెలుసుకోవచ్చు.

ఇండియాలో అయిదు ప్రసిద్ధ బౌద్ద ఆరామాలు !

5. అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ జరుగు సమయం

అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ మే 1, 2017 నుండి మే 31, 2017 వరకు జరుగుతుంది. మీరు మీ స్నేహితులతో, కుటుంబంతో ఈ పండుగకు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్ళవచ్చును. అవునండీ మీరు టికెట్ ముందుగానే బుక్ చేయవచ్చు. మరింకెందుకాలాస్యం గెట్ రెడీ. వేసవి సెలవులను దేశంలో ఇతర రాష్ట్రాలలో సెలెబ్రేట్ చేసుకుందాం. ఒకెనా.

రించెన్ పొంగ్ మొనాస్టరీ చూసొద్దామా !!

6. ఇక్కడి ప్రత్యేకత ఏమిటి ?

అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ లో 600 కంటే ఎక్కువ ఆర్కిడ్లు జాతులు, 240 జాతుల చెట్లు మరియు మొక్కలు మరియు పువ్వులు జాతులను చూసి ఎంజాయ్ చేయవచ్చును. అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ లో సిక్కిం ప్రభుత్వం పర్యాటకుల కోసం పువ్వులను విస్తృతంగా ప్రదర్శనకు తీసుకొచ్చింది. ఇక్కడ మీరు చెట్లు, మొక్కలలో గల వివిధ జాతుల గురించి తెలుసుకోవచ్చు.

యుక్సోం - సన్యాసుల మఠం !

7.ఫుడ్ ఫెయిర్

మీరు ఈశాన్య భారతదేశంలో ఎప్పుడైనా తిన్నారా? ఇక్కా భోజనప్రియుల కోసం రుచికరమైన ఆహారం కోసం ఇక్కడ అంతర్జాతీయ ఫ్లవర్ ఫెస్టివల్ తో పాటు ఫుడ్ ఫెయిర్ కూడా జరుగుతుంది. మీరు మరింత ఎంజాయ్ చేయవచ్చును.

మంగన్ - విభిన్న పర్యాటక అనుభవం !

8. ఫన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆనందించవచ్చు

ఇక్కడ సరదాసరదా గేమ్స్ ఉంటుంది. మీరు క్షణం తీరిక లేకుండా అటువైపు పూలు, ఇటువైపు రుచికరమైన ఆహారం, మరోవైపు మీ పిల్లలకు గేమ్స్ అబ్బా.. ఇంతకన్నా ఏం కావాలి. ఈ వేసవి శెలవులు ఉత్సాహంగా గడపటానికి.

నామ్చి - హిమాలయాల ఒడిలో విహారం !

9. యాక్ రైడ్

చాలా ఖుషీగా వుంటుంది కదూ. మీ పిల్లలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. వారి ఆనందానికి అవధులు వుండవు. అదేనండీ. యాక్ రైడ్ కూడా చేసి ఆనందించవచ్చును.

సిక్కిం .... ప్రకృతి సౌందర్యాల స్వర్గం !!

10. ఎత్తైన శిఖరం

ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్ లో విస్తరించి ఉంది. సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతి దీవెనలతో నిండిన ఎంతో అందమైన ఒక అద్భుత భూమి.

లచెన్ - ఒత్తిడిని తగ్గించుకోండి ... సేదతీరండి !

11. సంస్కృతి

సంస్కృతి సిక్కింలో దీపావళి, దసరా వంటి హిందువుల పండుగలు, లోసార్, లూసాంగ్, సగదవా, ల్హబాబ్, డ్యూచెన్, ద్రుప్కాతెషి, భుమ్చు వంటి బౌద్ధుల పండుగలు, ఇంకా క్రిస్టమస్, ఆంగ్లనూతన సంవత్సరాది ఉత్సవాలన్నీ జరుపుకుంటారు.

12. జనప్రియమైనవి

పాశ్చాత్య సంగీతము, హిందీ సినిమా పాటలు, స్థానిక నేపాలీ గీతాలూ కూడా జనప్రియమైనవి. విందులు నూడిల్సు తో వండే వంటకాలు - తుప్కా, చౌమెయీన్, తంతుక్, ఫక్తూ, గ్యాతుక్, వాంటొన్ - ఎక్కువగా తింటారు. కూరగాయలు, మాంసము వాడకం కూడా ఎక్కువ. ఎక్సైజ్ పన్నులు తక్కువైనందున మధ్యం చౌక కనుక వాడకం కూడా బాగా ఎక్కువ.

13. సిక్కిం ఎలా చేరాలి?

భౌగోళిక కారణాలవల్ల సిక్కింలో విమానాశ్రయాలూ లేవు. రైలు మార్గాలు లేవు. పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి విమానాశ్రయం గాంగ్టక్కు 124 కి.మీ. దూరంలో ఉంది. అక్కడికీ, బాగ్డోగ్రాకూ హెలికాప్టర్ సర్వీసున్నది. సిలిగురికి 16 కి.మీ. దూరంలోని 'క్రొత్త జల్పాయ్‌గురి' సిక్కింకు దగ్గరలోని రైలు స్టేషను. సిలిగురినీ గాంగ్‌టక్ నూ కలుపుతూ జాతీయ రహదారి (నేషనల్ హైవే 31ఎ) ఉంది.

లాల్ బాగ్ ఫ్లవర్ షో - గులాబీల గుబాళింపులు!

అందమైన పూవుల లోకం ... వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ !!

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!
అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?
శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు
నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

English summary

International Flower Festival Sikkim 2017

Gangtok is the venue for the Flower Festival. The International Flower Festival will be organised from 1st May 2017 to 31st May 2017.
Please Wait while comments are loading...