Search
  • Follow NativePlanet
Share
» »ఇడుక్కి పర్యటన - బహుముఖ ప్రదేశాలు !

ఇడుక్కి పర్యటన - బహుముఖ ప్రదేశాలు !

ఇడుక్కి ఒక అందమైన పర్యాటక ప్రదేశం. పర్వ్హత శ్రేణుల నేపధ్యం కలిగి దట్టమైన పచ్చటి అడవులు కల ఇడుక్కి ఒక భూతల స్వర్గం వలే వుంటుంది. ఇడుక్కి లోని ఆర్చ్ డాం ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్చ్ డాం నిర్మాణంగా పేర్కొంటారు. ఇడుక్కి లో మూడు డాములు అంటే ఆర్చ్ డాం, కులమావు డాం మరియు చేరుతోని డాం లు ప్రధానమైనవి. ఈ మూడు డాముల ప్రదేశాలు అందమైన ప్రకృతి దృశ్యాల నేపధ్యంలో వుంటాయి. రామక్కల మేడు లో ఒక విండ్ ఎనర్జీ ఫారం కలదు. ఇది ఇడుక్కి లో ఒక ప్రధాన పర్యాటక ప్రదేశం.

కురింజిమల సాన్క్చురి లో అరుదైన వివిధ వృక్ష మరియు జంతు జాతులు చూడవచ్చు. టూరిస్ట్ లు ఇక్కడ కల నీలగిరి థార్ , నీలగిరి వడ్రంగి పిట్ట, గౌర్, ఊదా రంగు కప్పు, అడవి ఉడుత, ఏనుగు, సాంబార్ డీర్ మరియు నీల కురింజి వంటి జంతువులు చూడవచ్చు .

తట్టేక్కాద్ బర్డ్ సాన్క్చురి లేదా సలీం ఆలి బర్డ్ సాన్క్చురి వివిధ రకాల స్థానిక పక్షులకు మరియు అనేక సరీ నృపములకు, ఇతర జంతువులకు నిలయంగా వుంటుంది. ఇక్కడ అంతరింఛి పోతున్న పక్షులైన పెనిన్సులర్ బే ఔల్, మలబార్ గ్రేట్ హార్న్ బిల్, రోజ్ బిల్ రోలరు, క్రిమ్సన్ బార్బర్, క్రేస్తేడ్ సేర్పెంట్ ఈగల్, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ మరియు ఫెయిరీ బ్లూ బర్డ్ ల వంటివి చూడవచ్చు.

కలవారి మౌంట్, కులమావు మరియు పాలకుల మేదు ప్రాంతాలలో సాహసోపేత ట్రెక్కింగ్ క్రీడలు ఆచరించవచ్చు.

ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

ఇడుక్కి కి సమీప ఎయిర్ పోర్ట్ నేడుమ్బస్సేరి లేదా కోచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది ఇడుక్కి నుండి 160 కి. మీ. ల దూరం. ఎయిర్ పోర్ట్ నుండి తక్సి లేదా బస్సు లలో ఇడుక్కి చేరవచ్చు. ఎయిర్ పోర్ట్ నుండి వాహనాలు తరచుగా లభిస్తాయి. సమీప రైలు స్టేషన్ కొట్టాయం లో కలదు. ఇది ఇడుక్కి నుండి 114 కి. మీ. లు. కొట్టాయం నుండి ఇడుక్కి బస్సు లలో కూడా చేరవచ్చు.
ఇడుక్కి ఆరు రాష్ట్ర రహదారులతో కలుపబడి వుంది. నేషనల్ హై వే - 49 ద్వారా కూడా చేరవచ్చు. కేరళ ప్రభుత్వ బస్సు లు లేదా ఇతర వాహనాలు లభ్యంగా వుంటాయి.

Photo Courtesy: green umbrella

చేరుతోని డాం

చేరుతోని డాం

చేరుతోని డాం కేరళ లో ని ఇడుక్కి జిల్లా లో ఒక ప్రసిద్ధ ఆనకట్ట. ఈ డాము ను చేరుతోని నది పై నిర్మించారు. చేరుతోని నది పెరియార్ నది యొక్క అప్ శాఖ. ఈ డాం జల విద్యుత్ ను తయారు చేసి సమీప ప్రదేశాలకు సరఫరా చేస్తుంది. ఇక్కడ చాలామంది ఫోటో గ్రఫి చేసి ఆనంద పడతారుఇడుక్కి ఆర్చ్ డాం ప్రతి రోజూ అనేకమంది పర్యాటకులను సుదూర ప్రాంతాలనుండి ఆకర్షిస్తుంది. ప్రపంచంలో ఇది రెండవ పెద్ద డాం .

ఇడుక్కి ఆర్చ్ డాం

ఇడుక్కి ఆర్చ్ డాం

ఇడుక్కి ఆర్చ్ డాం ప్రతి రోజూ అనేకమంది విజిటర్ లను సుదూర ప్రాంతాలనుండి ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ ఆర్చ్ డాం మరియు ఆసియా లో మొదటిది. ఈ డాం ను కుర వనమాల మరియు కురతిమాల హిల్స్ మధ్య అందంగా పెరియార్ నది పై నిర్మించారు. ప్రపంచంలో రెండవ ఆర్చ్ డాం అవటమే కాక ఈ డాం సుందరమైన పరిసరాలు కూడా కలిగి వుంది.

కలవారి మౌంట్

కలవారి మౌంట్

ఎత్తైన కలవారి మౌంట్ ప్రదేశం ఇడుక్కి కి 5 కి. మీ. ల దూరంలో కలదు. ఇది కట్టపన - ఇడుక్కి రోడ్ పై కలదు. ఇది ఏటవాలు గా వుంది. పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. గుడ్ ఫ్రైడే పండుగ వేడుకలు ఇక్కడ అట్టహాసంగా చేస్తారు. ట్రెక్కింగ్ మరియు పిక్నిక్ లకు అనువైన ప్రదేశం. మార్గం లో ఏనుగులను చూడవచ్చు. చల్లని తాజా గాలులు, పక్షుల కూతలు ఈ ప్రదేశ అందాలను మరువ లేనివి గా చేస్తాయి. రాత్రి బసకు ఈ ప్రదేశం అనుకూలం.

Photo Courtesy: Ashwin Kumar

కులమావు

కులమావు

ఇడుక్కి జిల్లాలో కల కులమావు ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడువేల అడుగుల ఎత్తున కలదు. దాని అద్భుత అందాలతో అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. కులమావు డాము ఇక్కడ కల మూడు డాములలో ఒకటి.

Photo Courtesy: Reji Jacob

కురింజిమాల సంక్చురి

కురింజిమాల సంక్చురి

కురింజిమల సాన్క్చురి లో అరుదైన వివిధ వృక్ష మరియు జంతు జాతులు చూడవచ్చు. టూరిస్ట్ లు ఇక్కడ కల నీలగిరి థార్ , నీలగిరి వడ్రంగి పిట్ట, గౌర్, ఊదా రంగు కప్పు, అడవి ఉడుత, ఏనుగు, సాంబార్ డీర్ మరియు నీల కురింజి వంటి జంతువులు చూడవచ్చు .
ఈ సంక్చురి చుట్టూ ఎరావికులం, పామ్పడుం షోలా మరిఉ అనముడి షోలా నేషనల్ పార్క్ లు కలవు. ఇక్కడకు వచ్చే టూరిస్ట్ లు ఈ ప్రాంత జీవ వైవిధ్యం చూసి ఆనందించవచ్చు. ప్రకృతి ప్రియులకు, వన్య జంతువుల అభిమానులకు ఒక స్వర్గం లా వుంటుంది.

పైనావు

పైనావు

పైనావు అనబడే ఒక చిన్న టవున్ ఇద్డుక్కిలో మరొక ఆకర్షణ. ఇది ఒక వాణిజ్య కేంద్రం. ప్రకృతి సహజ అందాలు కలిగి వుంది. పచ్చటి దట్టమైన అడవులు టవున్ చుట్టూ కలవు. ఇక్కడ ట్రెక్కింగ్ మార్గాలు అనేకం కలవు.

Photo Courtesy: Joaquim679

రామక్కలమేడు

రామక్కలమేడు

రామక్కల మేడు చిన్నది అయినప్పటికీ ప్రసిద్ధి గాంచిన హిల్ స్టేషన్. రామక్కల మేదు అంటే ' శ్రీ రాముడు తన అడుగు పెట్టిన భూమి' అని చెపుతారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తున కలదు. టూరిస్ట్ లు ఈ హిల్ స్టేషన్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పూర్తి విశ్రాంతి పొందవచ్చు.

Photo Courtesy: Balachand

తట్టేక్కాద్ బర్డ్ సాన్క్చురి

తట్టేక్కాద్ బర్డ్ సాన్క్చురి

తట్టేక్కాద్ బర్డ్ సాన్క్చల్లురి ని సలీం బర్డ్ సాన్క్చురి అని కూడా అంటారు. ఇక్కడ మీరు వివిధ జాతుల పక్షులను చూడవచ్చు. ఇక్కడకు చాలా మంది పక్షి ప్రియులు వస్తారు. స్థానిక మరియు వలస పక్షులు కూడా ఇక్కడ చూడవచ్చు. అంతరించిపోతున్న పక్షి జాతులైన పెనిన్సులర్ బే, మలబార్ గ్రీ హార్న్ బిల్, రోజ్ బిల్ రోలరు, క్రిమ్సన్ బార్బర్, క్రేస్తేడ్ సేర్పంట్ ఈగల, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ మరియు ఫెయిరీ బ్లూ బర్డ్ లు ఇక్కడి ప్రత్యేకత.

తోమ్మంకుతు జలపాతాలు

తోమ్మంకుతు జలపాతాలు

తోమ్మంకుతు జలపాతాలు ఇడుక్కి జిల్లాలో , తోడుపుజ టవున్ నుండి 17 కి. మీ. ల దూరం లో కలవు. ఈ జలపాతాలు చిన్నవి అయినప్పటికీ అందంగా వుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ జలపాతాలను ఏడూ అడుగుల జలపాతాలు అని కూడా అంటారు. దీనికి కారణం అవి ఏడూ దశలలో కిందకు పడతాయి. టూరిస్ట్ లు ఇక్కడ రాక్ క్లైమ్బింగ్, హైకింగ్ మరియు ట్రెక్కింగ్ లు చేయవచ్చు. సాహస క్రీడలు అలవాటు లేని వారు ఇక్కడ బోటింగ్ మరియు ఫిషింగ్ లు చేయవచ్చు.

Photo Courtesy: Kiran Gopi

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X