Search
  • Follow NativePlanet
Share
» »ప్రభాస్ గిరి - జైనుల ప్రముఖ పుణ్యక్షేత్రం !!

ప్రభాస్ గిరి - జైనుల ప్రముఖ పుణ్యక్షేత్రం !!

జైన్ సమాజంనకు ప్రధాన ఆకర్షణగా భగవాన్ పద్మ ప్రభు దేవాలయము ఉన్నది. ఈ దేవాలయంనకు ఆరవ జైన తీర్థంకరుడు భగవాన్ పద్మ ప్రభు పేరు పెట్టబడింది.

By Mohammad

ప్రదేశం : ప్రభాస్ గిరి
జిల్లా : కౌశాంబి
రాష్ట్రం : ఉత్తర ప్రదేశ్
ప్రధాన ఆకర్షణ : జైన దేవాలయాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కుశంబి జిల్లాలో ప్రభాస్ గిరి పట్టణం ఉన్నది. అంతే కాకుండా అలహాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ పట్టణము జైన్ సమాజం వారి కోసం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉన్నది. సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకర్షిస్తుంది. జైన్ సమాజంనకు ప్రధాన ఆకర్షణగా భగవాన్ పద్మ ప్రభు దేవాలయము ఉన్నది. ఈ దేవాలయంనకు ,ఆరవ జైన తీర్థంకరుడు భగవాన్ పద్మ ప్రభు పేరు పెట్టబడింది. ప్రభాస్ గిరి హిందువులకు కూడా పవిత్ర ప్రదేశం. ఈ ప్రదేశంలో లార్డ్ కృష్ణుడు భూమి పైన అయన చివరి రోజులు గడిపారని చెప్పుతారు.

జైన దేవాలయం

జైన దేవాలయం

చిత్రకృప : Pratyk321

ఈ పట్టణంలో అనేక గుహలు ఉన్నాయి. ఈ గుహల గోడల మీద పురాతన బ్రహ్మి లిపిలో రాసి ఉన్న అక్షరాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ గుహలు గొప్ప చారిత్రక ఆసక్తి కలిగి ఉన్నాయి. మీరు ప్రభాస్ గిరి సందర్శించినప్పుడు దానికి సమీపంలో ఉన్న కారా మరియు మంఝాన్పూర్ ను చూడవచ్చు.

కారా శీతల మాతా ఆలయం, చ్చేత్రపాల్ భైరవుని ఆలయం, హనుమాన్ ఆలయం మరియు కాళేశ్వర్ మహాదేవ్ దేవాలయములతో సహా అనేక హిందూ మతం దేవాలయాలు ఉన్నాయి. శీతల మాతా ఆలయం గంగా నది ఒడ్డున ఉంది. అంతేకాక ఈ దేవత మొత్తం 51 శక్తిపిటంలలో అతిపెద్ద శక్తిపిటంగా పరిగణించబడుతుంది. మంఝాన్పూర్ లో కూడా కమసిన్ దేవి ఆలయం ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది ఒక ప్రముఖ మత కేంద్రంగా ఉంది.

జైన తీర్ధాంకుడు పద్మప్రభువు

జైన తీర్ధాంకుడు పద్మప్రభువు

చిత్రకృప : Capankajsmilyo

పద్మ ప్రభు దేవాలయం

జైన్ సమాజంనకు ప్రధాన ఆకర్షణగా భగవాన్ పద్మ ప్రభు దేవాలయము ఉన్నది. ఈ దేవాలయంనకు ఆరవ జైన తీర్థంకరుడు భగవాన్ పద్మ ప్రభు పేరు పెట్టబడింది. తామర పువ్వు భంగిమలో తీర్థంకరుడి ఒక అందమైన విగ్రహం ఉంది. తామర పువ్వు భంగిమ ధ్యాన స్థితిని సూచిస్తుంది.

ఈ ఆలయంలో 85 అడుగుల తెల్ల పాలరాయి శిఖరం మరియు సృజనాత్మక వేదాలతో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంతే కాకుండా 1008 భగవాన్ పద్మప్రభు యొక్క భారీ విగ్రహం ఆకాశం వైపు గంభీరముగా ఉంటుంది. ఆలయంలో ఆధ్యాత్మికత భావన కనిపిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సందర్శనకు వచ్చిన పర్యాటకులకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

మీరు పద్మ ప్రభు దేవాలయం సందర్సించినప్పుడు దానికి సమీపంలో ఉన్న కారా మరియు మంఝాన్పూర్ లో కమసిన దేవి ఆలయం ,శీతల మాతా దేవాలయం లను తప్పక చూడండి.

దేవాలయ గోడలపై అందంగా చెక్కిన శిల్పాలు

దేవాలయ గోడలపై అందంగా చెక్కిన శిల్పాలు

చిత్రకృప : Ed Sentne

ప్రభాస్ గిరి ఎలా చేరుకోవాలి ?

బస్ ప్రయాణం

రోడ్డు మార్గం ఉత్తర ప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ ప్రభాస్ గిరి తరచూ బస్సులను నడుపుతుంది. సోమ్నాథ్ మరియు వారణాసి నుండి సాధారణ బస్ సేవలు ఉన్నాయి.

రైలు మార్గం

ప్రభాస్ గిరి కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్వారి లో సమీప రైల్వే స్టేషన్ ఉన్నది. ఒక బస్సు లేదా టాక్సీ ద్వారా ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు. ముంబై, పూనే, వారణాసి, ఝాన్సీ, గౌలియార్ మరియు నాగ్పూర్ సహా దేశంలో అనేక నగరాలకు అనుసంధానించబడినది . అలహాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక పబ్లిక్ రవాణా బస్సు లేదా ఒక టాక్సీని అద్దెకు తీసుకోని ప్రభాస్ గిరి చేరుకోవచ్చు.

విమాన మార్గం

ప్రభాస్ గిరి కి సమీప విమానాశ్రయం 48 కిలోమీటర్ల దూరంలో అలహాబాద్ లో ఉన్న బంరులి విమానాశ్రయము. బంరులి విమానాశ్రయం నుండి ఒక పబ్లిక్ రవాణా బస్సు లేదా ఒక టాక్సీని అద్దెకు తీసుకొని ప్రభాస్ గిరిని చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X