అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఇక్కడుంది అమర్ నాథ్ దేవాలయం యొక్క మంచు రహస్యం

Written by: Venkatakarunasri
Published: Wednesday, August 9, 2017, 16:03 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు. హిమాలయాలకు వెళ్ళే దారిలో, పరమశివుడు తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి వద్ద, తన వృషభం నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి. పిదప, శివుడు, తన తనయుడు, గజ దేవుడైన గణేశునిమహగుణాస్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్ నాగ్ వద్ద విడిచి పెట్టాడు. తర్వాత, మహా శివుడు, పంచ భూతాలని పంచ్ రత్ని వద్ద వదిలి గుహ లోకి వెళ్ళాడని నమ్మిక.

అప్పడు శివుడు, తన మాటలను ఎవరూ వినకుండా ఉండేందుకు గానూ, గుహ లో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు. అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావురం గుడ్లకి మాత్రం ఎటు వంటి హాని జరగలేదు. ఆ రెండు గుడ్లు, శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా,నిశ్శబ్దంగా పొదిగి,మాటలను దొంగ చాటుగా వినేసాయి. అమర్ నాథ్ గుహ చేరుకోగానే, యాత్రికులు పావురాల జంటను చూడవచ్చు. వ్యాప్తి లో ఉన్న నమ్మకం ప్రకారం, శివుని రహస్యం చాటుగా విన్న ఆ రెండు పావురాలు, మరల మరల జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్ నాథ్ గుహను తమ నిత్య నివాసం గా చేసుకున్నాయి.

అమర్ నాథ్ జంట పావురాల స్టోరీ వింటే షాకవుతారు

ప్రసిద్ధ యాత్రా స్థలం

6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన, నీలమాత పురాణం లో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు. ఈ పురాణం కాశ్మీరీల కర్మకాండ ను మరియు వారి సాంస్కృతిక జీవన శైలులను వివరిస్తుంది. క్రీ. పూ 34 లో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజ తో కూడా అమర్ నాథ్ ముడిపడి ఉంది.

సహజ రీతిన మంచుతో తయారయినశివ లింగం

కాలక్రమంలో ఈ రాజు, తన రాచరిక హక్కును విసర్జించాడు. వేసవుల్లో అతను ఇక్కడికి చేరుకొని సహజ రీతిన మంచుతో తయారయినశివ లింగాన్ని పూజించాడని నమ్ముతారు. రాజతరంగిణి లో కూడా అమర్ నాథ్ అమరేశ్వర గా పేర్కొనబడింది.

అమర్ నాథ్ గుహ

1420 మరియు 1470 ల మధ్య జరిగిన తన అమర్ నాథ్ యాత్రా కాలం లో సుల్తాన్ జైన్లబిదిన్, షా కోల్ అనే కాలువ నిర్మించాడు. అమర్ నాథ్ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను తప్పక చూడాలి.

గుహ 5000 ఏళ్ల నాటిగుహ

ఈ గుహ లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు "శివ లింగం" ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగష్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది.ఈ గుహ 5000 ఏళ్ల నాటిదిగా చెప్పబడుతుంది.

అమరత్వ రహస్యం

ఇది శివుడు పార్వతి దేవి కి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతుంది. గణేశునికి,పార్వతి దేవి కి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి. భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్.పి.ఎఫ్, ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి.

శేష్ నాగ్ సరస్సు

అందువల్ల, అమర్ నాథ్గుహ ను సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. శేష్ నాగ్ సరస్సు అమర్ నాథ్ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది పహల్గాం కి 27 కి.మీ ల దూరంలో ఉంది.

భారీ సంఖ్యలో పర్యాటకులు

ఈ సరస్సు, సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల, జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో అమర్ నాథ్ యాత్రికులు , పర్యాటకులు ఈ సరస్సు కి భారీ సంఖ్యలో వస్తారు.

భక్తులలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రదేశం

శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.

ఇక్కడి ముఖ్య ఆకర్షణ

మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన "శివ లింగం",ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు.

5000సం.లకు పూర్వమే ఏర్పడిన అమర్ నాథ్ గుహలు

భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమర్ నాథ్ పర్వతంపై వున్న అమర్ నాథ్ గుహలు హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఈ పుణ్యక్షేత్రం 5000సం.లకు పూర్వమే ఏర్పడిందని పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బిందువుబిందువుగా నేలకురాలే హిమ జలం

ఈ అమర్ నాథ్ గుహలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన శివ లింగం వుంటుంది. ఆ శివ లింగం సీజన్ ను బట్టి పెరగటం తరగటం జరుగుతుంది,ఆ గుహ వుపరితలం నుండి జారిపడే హిమ జలం బిందువుబిందువుగా నేలకురాలగా అక్కడ గడ్డకట్టే చలికి క్రమక్రమంగా ఘనీభవిస్తూ పౌర్ణమితిధి నాటికల్లా 8అడుగుల ఎత్తులో మంచు శివలింగం ఏర్పడుతుంది.

దేశవిదేశాల నుండి వేలాదిమంది భక్తులు

ఇది ఎలా ఏర్పడుతుందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే వున్దిపోయింది.ప్రతి సం కొన్నివేల మంది భక్తులు దేశవిదేశాల నుండి అమరనాథ్ యాత్రకు బయలుదేరుతూవుంటారు. అమర్ నాథ్ యాత్ర చేయటం ద్వారా మోక్షం లభించి స్వర్గానికి వెళ్తామని శివభక్తుల నమ్మకం.

బంగారపు నాణేలుగా మారిన బొగ్గులు

గుజ్జర్ జాతికిచెందిన బూటామలిక్ అనే ఒక గొర్రెల కాపరికి ఒకరోజు ఋషికనిపించి సంచినిండా బొగ్గులను ఇచ్చాడు.బూటామలిక్ ఆ ఋషి ప్రసాదించిన బొగ్గుల సంచిని ఆ ప్రసాదంగా స్వీకరించి ఇంటికి వచ్చాక తెరిచిచూడగా ఆశ్చర్యం ఆ బొగ్గులన్నీ బంగారపు నాణేలుగా మారాయి.

బూటామలిక్

దాంతో బూటామలిక్ ఆ ఋషికి కృతఘ్నతను తెలియ జేయటానికి తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళగా ఆ ఋషి అక్కడ కనిపించలేదు.

పవిత్ర శివలింగం

కానీ అక్కడ అద్భుతమైన మంచుతో కూడిన పవిత్ర శివలింగం కనిపించింది. ఇక అప్పటినుండి ఆ ప్రాంతం అమర్నాథ్ యాత్రా స్థలంగా ప్రసిద్ధిచెందింది.

భక్తుల నమ్మకం

అమరనాథుడు అంటే జనామరణాలు లేనివాడని అర్థంమంచులింగాకారంలో పరమేశ్వరుడు ప్రజలకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నాడని భక్తుల నమ్మకం.

జంట పావురాల స్టోరీ వింటే షాకవుతారు

ఆ గుహ పాషాణనిర్మితం.రాతిపొడినే భక్తులు విభూతిగా నిర్మిస్తారు.అయితే అమర్ నాథ్ యాత్రలో ఇవన్నీ ఒక ఎత్తయితేగుహలో కనిపించే జంటపావురాలు మరొక ఎత్తు.ఈ జంటపావురాలు అజరామరమై భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్నాయి.

జంట పావురాల స్టోరీ వింటే షాకవుతారు

ఈ జంటపావురాల వెనక ఒకపెద్ద స్టోరీయే వుంది.ఒక రోజు పార్వతీ దేవి పరమేశ్వరుడుతో స్వామీ కంఠంలో మీరు ఎప్పుడూ కపాలం ధరిస్తారు ఎందుకు?అని అడిగింది.

జంట పావురాల స్టోరీ వింటే షాకవుతారు

అప్పుడు శివుడు దేవీ ఈ కపాలంలు నీ పూర్వజన్మకు సంకేతాలు నీ ఒక్కో జన్మలో ఒక్కో కపాలము ఈ మాలలో వచ్చి చేరుతూవుంటుంది అని సమాధానం ఇస్తాడు.

జంట పావురాల స్టోరీ వింటే షాకవుతారు

స్వామీ!నేనేమో మళ్ళీమళ్ళీ జన్మిస్తూ వుంటాను.మీరు మాత్రం శాశ్వతంగా వుంటారు.అలా ఎందుకు?అని అడిగింది.దానికి శివుడు దేవీ అది సృష్టి రహస్యం.

నిర్జల ప్రదేశం

అది ఎక్కడపడితే అక్కడ చెప్ప కూడదు.ప్రాణికోటి లేనిప్రదేశంలో ఏకాంతంగా చెబుతానని నిర్జల ప్రదేశం కొరకు వెతికివెతికి అమర్నాథ్ గుహను ఎంచుకున్నానని అన్నాడు.

పార్వతీపరమేశ్వరులు

పార్వతీపరమేశ్వరులు ఆ గుహలోకి వెళ్ళే ముందు తోడుగావచ్చిన వారిని మార్గ మధ్యంలోనే ఆగమన్నారు.శివుడు నందిని పహల్గాం వద్ద వుండమని వదిలివెళ్ళాడు. తన తలపై వున్న చంద్రుడ్ని చందన్వారీ వద్ద వదిలివెళ్ళాడు.

మహాగుణపర్వతం

మేడలో వున్న సర్పాన్ని పిషాంగ్ సరోవరతీరాన శేష్ నాగ్ వద్ద వదిలివెళ్ళాడు.గణేషుడ్ని మహాగుణపర్వతం వద్ద వదిలిపెట్టాడు.చివరికి పంచ భూతాలైన భూమి,నీరు, అగ్ని,వాయువు,ఆకాశాలను పన్చ్తరిణీవద్ద వదిలి పార్వతీదేవి తో అమర్నాద్ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళగానే శివుడు డమరుకంతో శబ్దాలు చేస్తూ తాండవం చేసాడు.

అమరత్వ రహస్యము

గుహమొత్తం దద్దరిల్లి ఆ గుహలో వున్న పావురాళ్ళు శబ్దాలకు భయపడి దూరంగా ఎగిరిపోయాయి.కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ వున్న మిగతా ప్రాణులను దూరంగా పంపాడు.ఇక్కడ తన అమరత్వ రహస్యము జీవుల జననమరణ రహస్యాలను శివుడు పార్వతీదేవికి వినిపించాడు.

పావురాళ్ళు పెట్టిన గుడ్లు - విశేషం

అయితే విశేషం ఏంటంటే ఆ గుహలో పావురాళ్ళు పెట్టిన రెండుగుడ్లు వున్నవి.సరిగ్గా అదేసమయంలో ఆ గుడ్లనుంచి జన్మించిన పిల్లపావురాళ్ళు సృష్టి రహస్యాన్ని విన్నాయి.అది గమనించిన శివుడు జననమరణ రహస్యాన్ని విన్నాయి కాబట్టి ఇక వీటికి జననమరణాలు వుండవు.

ఇప్పటికీ దర్శనమిస్తున్నా జంట పావురాళ్ళు

మన మిద్దరం పావురాళ్ళరూపంలో ఈ గుహలోనే వుండి ప్రతి సంవత్సరం వచ్చిన భక్తులకు దర్శనం ఇస్తూ ముక్తిని ప్రసాదిస్తామని ఆ గుహలోనే వుండిపోతారు. అమర్నాథ్ యాత్రకిగాన వెళ్ళినట్లయితే ఇప్పటికీ జంట పావురాళ్ళు దర్శనమిస్తాయి.

అమర్ నాథ్ దర్శించడానికి సరైన సమయం

వేసవి లో సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. అయితే, శీతాకాలం విపరీతమైన చలిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -5 డిగ్రీల దాకా పడిపోతుంది. అమర్ నాథ్ సాధారణంగా నవంబర్ నుంచి మార్చి/ఏప్రిల్ దాకా మంచు తో కప్పబడి ఉంటుంది. ఏడాది లో ఏ సమయంలోనైనా వర్షాలు పడవచ్చు. వర్షాలు అమర్ నాథ్ యాత్రకు అడ్డంకి గా మారతాయి. అమర్ నాథ్ దర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్యనెలలు సరైన సమయం.

అమర్నాథ్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

శ్రీనగర్ విమానాశ్రయం అమర్నాథ్ కు సమీపాన ఉన్నది. ఢిల్లీ, జైపూర్ వంటి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి ఎయిర్ పోర్ట్ కు విమాన సర్వీసులు ఉన్నాయి. హెలికాప్టర్ సర్వీస్ శ్రీనగర్ నుండి అమర్నాథ్ కు సపరేట్ గా హెలికాఫ్టర్ సర్వీస్ ఉన్నది. ఇది రక్షణ రంగం(డిఫెన్స్) వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వన్ వే ప్యాసింజర్ హెలికాప్టర్ సర్వీస్ ఒక్కొక్కరికి రూ. 4300 ఉండవచ్చు(ప్రస్తుతం).

 

రైలు మార్గం

శ్రీనగర్ రైల్వే స్టేషన్ అమర్నాథ్ కు సమీపాన ఉన్నది. దేశం నలుమూలల నుండి స్టేషన్ కు రైళ్ళు నడుస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం

జమ్మూ లోని అన్ని ప్రధాన నగరాల నుండి శ్రీనగర్ కు అలాగే పహల్గామ్ కు ఆ రాష్ట్ర బస్సు సర్వీసులతో పాటు ప్రవేట్ బసులు కూడా తిరుగు తుంటాయి. పహల్గామ్ వద్ద కు చేరుకొని క్యాబ్ లలో గాని లేదా కాలినడకన గానీ అమర్నాథ్ గుహ చేరుకోవచ్చు.

విమానాశ్రయం

అమర్ నాథ్ సందర్శించేవారు, విమానం లో గానీ రైలు లో గానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ఇది ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తో చక్కగా అనుసంధానించబడింది. అమర్ నాథ్ ని రైలు లో చేరగోరే వారు జమ్మూ రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఇక్కడికి దేశం లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి రైళ్లు ఉన్నాయి.

English summary

Journey To Amarnath Cave

Amarnath, situated at a distance of around 145 km from Srinagar, is considered to be one of the major pilgrimage sites of India. The pilgrimage site received its name from the Hindi words 'amar', which stands for immortal, and 'nath' which stands for god.
Please Wait while comments are loading...