Search
  • Follow NativePlanet
Share
» »ఆ గుడికెళ్తే ఎలాంటి కేసుల నుంచి అయినా ఈజీగా బైటపడొచ్చు !

ఆ గుడికెళ్తే ఎలాంటి కేసుల నుంచి అయినా ఈజీగా బైటపడొచ్చు !

మన దేశంలో సినిమా వాళ్లకు, గొప్ప నాయకులకు గుళ్లు ఉండటం సాధారణమే. కానీ ఓ న్యాయనిర్ణేతకు గుడి ఉండటం మాత్రం అరుదైన విషయం. కేరళలోని కొట్టాయం జిల్లాలో ‘జడ్జి అంకుల్’ పేరిట న్యాయనిర్ణేతకు ఓ గుడి కట్టించారు.

By Venkatakarunasri

కొట్టాయం కేరళలో ఒక పురాతన నగరం. ఇది కొట్టాయం జిల్లాలో, దేవుని స్వంత భూమి యొక్క జిల్లాలో ఒకటి. ముద్రణ మాద్యమం మరియు సాహిత్యంలో ఈ నగరం యొక్క సేవను పరిగణించి కొట్టాయం ను "అక్షర నగరి" అనగా "అక్షరాల నగరం" గాపిలవబడుతుంది. కొట్టాయం అనే పేరు మలయాళ పదాలైన 'కొత్త' అనగా కోట మరియు 'ఆకం' అనగా 'అంతర్భాగం'ల నుండి ఉద్భవించిందని చెప్తారు, ఈ పదానికి అర్ధం 'కోట యొక్క లోపలిభాగం'.కొట్టాయం పాత పట్టణంను ఇప్పుడు కున్నుమ్పురం అని అంటారు, మరియు ఇది ఒక కొండ మీద ఉన్న నగరం అని పేరు పొందింది. ట్రావన్కోర్ రాజు యొక్క ఆదినంలో ఉండుట వల్ల కొట్టాయం నగరం ఉనికిలోకి వచ్చింది. తూర్పు మరియు పశ్చిమ కనుమలు సరిహద్దులు గల వెంబనాడ్ సరస్సు మంత్రముగ్దులను చేస్తుంది. ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన ప్రదేశం.

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

మన దేశంలో సినిమా వాళ్లకు, గొప్ప నాయకులకు గుళ్లు ఉండటం సాధారణమే. కానీ ఓ న్యాయనిర్ణేతకు గుడి ఉండటం మాత్రం అరుదైన విషయం. కేరళలోని కొట్టాయం జిల్లాలో ‘జడ్జి అంకుల్' పేరిట న్యాయనిర్ణేతకు ఓ గుడి కట్టించారు. చెరువల్లి శ్రీ దేవి ఆలయంలో ఓ మూలన ఈ గుడి ఉంటుంది. ఇదేమీ ఆషామాషీ గుడి కాదు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

న్యాయపరంగా సమస్యలను ఎదుర్కొంటున్నవారు జడ్జి అంకుల్‌ను దర్శించుకుని కేసుల నుంచి బయటపడుతున్నారు. పీకల్లోతు కేసుల్లో మునిగిపోయిన గాలి జనార్ధన్ రెడ్డి కూడా ఈ గుడికెళ్లి వచ్చాకే ఉపశమనం పొందాడట. మళయాళ నటిపై అత్యాచారం కేసులో నటుడు దిలీప్ జైలుకు వెళ్లడంతో ఆయన సోదరుడు అనూప్ వెంటనే ఈ గుడికొచ్చి పూజలు జరిపించారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

అంతెందుకు తరాల నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని మరీ.. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ఆడవాళ్లకు ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీంతో ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు ప్రెసిడెంట్ పి. గోపాలక్రిష్ణన్ కూడా ‘జడ్జి అమ్మవన్‌ (అంకుల్)ను దర్శించుకున్నారు. ఈ గుడికి అంతటి ప్రాధాన్యం ఉంది.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

ఇదంతా చదివాక.. ఈ గుడి వెనకాల ఉన్న నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి అనిపిస్తోంది కదూ. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం ట్రావెన్‌కోర్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ రాజ్యంలోని గోవింద పిళ్లై అనే న్యాయనిర్ణేతకు కచ్చితమైన తీర్పులు ఇవ్వడంలో తిరుగులేని వాడిగా పేరొందాడు. అలాంటిది..

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

ఆయన ఓసారి పొరబాటున తన మేనల్లుడు నేరం చేశాడని పొరబడ్డారు. అతడికి మరణ శిక్ష విధించారు. తర్వాత అతడు అమాయకుడని తెలియడంతో.. తప్పుడు తీర్పు వెలువరించినందుకు గానూ.. పిళ్లై తనకు తానే ఉరిశిక్ష విధించుకున్నారు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందో జనాలకు తెలియడం కోసం తన మృతదేహాన్ని మూడు రోజులపాటు అలాగే బహిరంగ ప్రదేశంలో ఉంచాలని కూడా తీర్పునిచ్చారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

న్యాయానికి కట్టుబడి ఉండాలన్న పిళ్లై తపన అక్కడి ప్రజలను కదిలించింది. దీంతో ఆయనకు గుడి కట్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆయన ఆత్మ ఈ గుడిలో ఉంటుందని వారు విశ్వసిస్తారు. ఈ నమ్మకం బలపడటంతో ఎక్కడెక్కడి నుంచో జనం ఈ గుడికి వచ్చి పూజలు చేస్తున్నారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

ఎక్కడ వుంది?

కేరళలోని కొట్టాయం జిల్లాలో జడ్జి అంకుల్ పేరిట న్యాయనిర్ణేతకు ఓ గుడి కట్టించారు. చెరువిల్లిశ్రీదేవి ఆలయంలో ఓ మూలాన ఈ గుడి వుంటుంది.ఇదేమీ ఆషామాషీ గుడి కాదు. న్యాయపరంగా సమస్యలను ఎదుర్కొంటున్నవారు జడ్జిఅంకుల్ ను దర్శించుకుని కేసులనుంచి బయటపడుతున్నారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

పీకల లోతు కేసులలో మునిగిపోయిన గాలిజనార్ధనరెడ్డికూడా ఈ గుడికెళ్ళి వచ్చాకే ఉపశమనం పొందారట. మలయాళం నటిపై అత్యాచారంకేసులో నటుడు దిలీప్ జైలుకువెళ్ళటంతో ఆయన సోదరుడు అనూప్ వెంటనే ఈ గుడికొచ్చి పూజలు జరిపించారు.అంతెందుకు తరతరాల నుంచి వస్తున్న ఆచారాలను కాదని,శబరిమలై అయ్యప్ప దేవాలయంలో ఆడవాళ్ళకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

దీంతో ట్రావెన్కో బోర్డ్ ప్రెసిడెంట్ పి.గోపాలకృష్ణన్ కూడా జడ్జిఅమ్మవన్ ను దర్శించుకున్నారు. ఈ గుడికి అంతటి ప్రాధాన్యం వుంది. ఇదంతా చదివాక ఈ గుడివెనకాల వున్న నేపధ్యంఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది వుంది కదూ.18వ శతాబ్దంలో ఈ ప్రాంతం ట్రావెన్కో రాజ్యంలో భాగంగా వుండేది.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

ఆ రాజ్యంలో గోవిందపిళ్ళై అనే న్యాయనిర్ణేతకు ఖచ్చితమైన తీర్పులు ఇవ్వటంలో తిరుగులేని వాడిగా పేరొందాడు. అలాంటిది ఆయన ఓసారి పొరపాటున తన మేనల్లుడు నేరంచేసాడని పొరపడ్డాడు. అతడికి మరణ శిక్ష విధించారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

తరవాత అమాయకుడని తెలియడంతో తప్పుడు తీర్పు వెలువరించినందుకు గానూపిళ్ళై తనకుతానే ఉరిశిక్షవిధించుకున్నారు. తప్పు చేస్తే ఎలాంటి శిక్షను అనుభవించవలసి వస్తుందో జనాలకు తెలియటంకోసం తన మృతదేహాన్ని 3రోజుల పాటు అలాగే బహిరంగప్రదేశంలో వుంచాలని కూడా తీర్పునిచ్చారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

న్యాయానికి కట్టుబడివుండాలన్న పిళ్ళై తపన అక్కడి ప్రజలను కదిలించింది. దీంతో ఆయనకు గుడికట్టించి పూజలు చేయటం ప్రారంభించారు. ఆయన ఆత్మ ఈ గుడిలో వుంటుందని వారు విశ్వసిస్తారు. ఈ నమ్మకం బలపడటంతో ఎక్కడెక్కడినుంచో జనం ఈ గుడికివచ్చి పూజలు చేస్తున్నారు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

చుట్టుప్రక్కల చూడదగిన ప్రదేశాలు

ఎలవీజాపూంఛిరా

ఎలవీజాపూంఛిరా అందమైన వనభోజనా స్థలంగా సందర్శకులకు ప్రఖ్యాతమైనది. ఇక్కడ చిన్నకొండలు యొక్క కొనలు మరింత ఆకట్టుకొంటాయి.ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశం చాలా మంది అధిరోహకులకు ఇష్టమైన ప్రదేశం.మీరు ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ నుండి చాలా అందమైన ఉదయిస్తున్న సూర్యుడి మరియు అస్తమిస్తున్న సూర్యుడిని చూడవచ్చు.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

పూంజర్ ప్యాలెస్

పూంజర్ ప్యాలెస్ కొట్టాయం నుండి పాల-ఎరాట్టుపెట్ట కు పూంజర్ కు వెళ్ళే దారిలో ఉంటుంది.ఈ ప్యాలెస్ కేరళ యొక్క గొప్ప చరిత్రకు ఒక నిదర్శనం. ప్యాలెస్ లో రాచరిక పురాతన వస్తువులు, సుందరమైన శిల్పాలు మరియు రాళ్ళ నుండి చెక్కబడిన దీపాలు చాలా ఉన్నాయి.రాజభవనము యొక్క అందం మెరుగుపర్చే అద్భుతమైన ఛాండిలీయర్ దీపాలు మరియు ఇతర సున్నితమైన దీపాలు, ఆభరణాల పెట్టెలు,చెక్క తో చేసిన నగిషిలు ఉన్నాయి.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

తిరునక్కర మహాదేవ ఆలయం

తిరునక్కర మహాదేవ ఆలయం లార్డ్ శివకు అంకితం చేయబడింది.తేక్కుమ్కూర్ రాజు దీనిని 16 వ శతాబ్దం ప్రారంభంలోనిర్మిచారు. ఇది కొట్టాయం ప్రధాన నగరంలో ఉంది. ఇది కేరళ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయము కొట్టంబలం నమూనాగా పేరుగాంచింది.కొట్టంబలం అంటే సంప్రదాయ కళ మరియు నృత్య రూపాలు ఉంటాయి.ఇక్కడ ఆలయం లో ధ్వని సంబంధిత థియేటర్ ఉంది.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

సుబ్రమణ్య స్వామి ఆలయం, కొట్టాయం

కొట్టాయం నుండి 20 కి.మీ.లదూరంలో సుబ్రమణ్య స్వామి ఆలయం ఉన్నది. సుబ్రమణ్య స్వామికి కేరళలో ఇంకా కొన్ని ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయం లోకి కుల,మతాలకు సంబంధం లేకుండా అందరు వెళ్ళే మొదటి ఆలయం. క్రీ.శ.753 నాటి చాలా పాత ఆలయం. ఆలయం విగ్రహం 6 అడుగుల పొడవు ఉంటుంది.సుబ్రమణ్య స్వామి చేతిలో ఒక ఈటె లాంటి ఆయుధం ఉంటుంది. 'పల్లిమెట్ట ఉత్సవ్'ను ఈ ఆలయంలో జరుపుకుంటారు,ఇది వార్షిక ఉత్సవం. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది మరియు నవంబర్ మరియు డిసెంబర్ లలో వస్తుంది.ఈ పండుగ సమయంలో చేసిన ప్రధాన ఆచారము చాకిఅర్కూత్ ఉంది. సుబ్రమణ్యస్వామి ఆలయం ఉర్జమా దేవస్వామ్ బోర్డు చే నిర్వహించబడుతుంది. ఇది ఒక పురాతన దేవాలయం, ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

సరస్వతి ఆలయం, కొట్టాయం

కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం లోని విగ్రహం ఒక భక్తునిచే కనుగొనబడింది. తూర్పు ముఖంగా సెట్ చేసిన ఈ విగ్రహాన్ని కిజ్హేప్పురం నంబూద్రి ప్రతిష్ట చేసారు. దీనికి పశ్చిమంగా మరో విగ్రహం ఉంటుంది, కానీ విగ్రహం ఏ ఆకారంలోను ఉండదు,కానీ దానిని పూజిస్తారు.

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

నట్టకం

నట్టకం అనే గ్రామం కొట్టాయంలోని పల్లం తాలూకాలో ఉంది. కొట్టాయం నగరానికి నట్టకం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గ్రామం చుట్టూ పచ్చదనం తో ఉండుట వల్ల అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది.వేసవి కాలంలో అనేక రకాల వలస పక్షులు వస్తాయి.ఈ పక్షుల అరుపులు ఒక సంగీత వాతావరణాన్ని కలిగిస్తాయి. కొట్టాయం పోర్ట్ మరియు కంటైనర్ టెర్మినల్ (KPCT) నట్టకంలో ఉన్నాయి.మీరు ఒకసారి తప్పకుండా నట్టకంను సందర్శించండి.ఇక్కడ ఆయుర్వేద మసాజ్ మరియు ఈత, ఫిషింగ్ మరియు బోటింగ్ వంటి ఇతర వినోదాలు కూడా ఉన్నాయి.మీకు ఫోటోగ్రఫి మీద ఆసక్తి ఉంటే సందర్శించడానికి ఇది ఒక మంచి ప్రదేశం.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

పంచికడు, కొట్టాయం

పంచికడు కొట్టాయం జిల్లాలోఉన్న మరొక చిన్న నిద్రావస్థ గ్రామం.కొట్టాయం మరియు చంగనస్సేరి మధ్య ప్రధాన రోడ్ మీద ఉంది. పంచికడు కొట్టాయం కి 11km దూరంలో ఉంది.ఈ గ్రామంలో సరస్వతి ఆలయం ఉంది. ఈ ఆలయం ను దక్షిణ మూకంబికగా కొలుస్తారు.ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా పూజలు చేస్తారు.ఇక్కడ ప్రకృతి దృశ్యాలు మనసును రంజింప చేస్తాయి.ఈ చిన్న గ్రామంలో మనకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.ఈ గ్రామం ప్రకృతి చిత్రీకరణకు అనువైన ప్రదేశం.

PC:youtube

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం

రోడ్డు ద్వారా కొట్టాయంకు రోడ్డు మార్గం బాగా అనుసంధానించబడింది. ఇది జాతీయ రహదారి-220 లో ఉంది. రాష్ట్ర రహదారులు సంఖ్య 1, 9, 11, 13, 14, 15 మరియు 32 ఈ జాతీయ రహదారిగుండా వెళతాయి. ప్రభుత్వ బస్సులు మరియు ప్రైవేటు బస్సుల ద్వారా కొట్టాయంకు రావచ్చు. ఈ ప్రాంతం కేరళ మరియు ఇతర పొరుగు రాష్ట్రాల ప్రధాన నగరాలకు చక్కని రోడ్డు మార్గం ద్వారా కలపబడింది.

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

రైలు మార్గం

కొట్టాయం రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టణాలు మరియు కేరళ నగరాలకు రైలు సేవలు అందిస్తుంది. ఇది బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్, కోలకతా, న్యూ ఢిల్లీ మరియు అహ్మదాబాద్ ల వంటి భారతదేశం యొక్క ఇతర ప్రధాన నగరాలకు కలిపే అనేక రైళ్ళు ఉన్నాయి.

 కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

కేసుల నుంచి బయటపడేసే ‘జడ్జి అంకుల్’ గుడి

విమాన మార్గం

కొట్టాయంకు 90 కి.మీ.ల దూరంలో విమానాశ్రయం ఉంది.దీనిని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అని అంటారు.విమానాశ్రయం నుండి కొట్టాయం చేరుకోవడానికి బస్సు లేదా రైలు లో వెళ్ళాలి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X